శ్రీ శివ మహా పురాణము - 597 / Sri Siva Maha Purana - 597


🌹 . శ్రీ శివ మహా పురాణము - 597 / Sri Siva Maha Purana - 597 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 04 🌴

🌻. కార్తికేయుని కొరకై అన్వేషణ - 6 🌻


శంభుడు దేవతలతో గూడి నీకు అభిషేకమును చేయగలడు. నీకు ఆయుధములన్నియు లభించగలవు. తారకాసురుని సంహరించగలవు (53). నీవు జగత్తును లయము చేయు రుద్రుని కుమారుడవు. నిన్ను దాచే సామర్ధ్యము ఈ కృత్తికలకు లేదు. ఎండిన మ్రాను తన తొర్రలో అగ్నిని దాచియుంచలేదు (54).

బ్రహ్మాండములన్నింటిలో అధిక ప్రకాశము గల నీవు వీరి ఇంటిలో నుండుట బాగుండలేదు. నూతిలో నున్న మదపుటేనుగు ప్రకాశించదు (55). మానవుని దృష్టికి సూర్యుడు కానరాకుండగా చంద్రకాంతి కప్పివేయజాలదు. అటులనే నీ తేజస్సు నిన్ను దాగి ఉండనీయదు. నీవు మా సన్నిధికి రమ్ము (56).

ఓ శంభుపుత్రా! జగత్తులను వ్యాపించి యుండు విష్ణువు నీవే. నీ వంటి వాడు మరియొకడు పుట్టలేదు. పరిచ్ఛిన్నములగు వస్తువులనన్నిటినీ ఆకాశము వ్యాపించి యుండు తీరున నీవు సర్వమును వ్యాపించెదవు (57).

కాని, జ్ఞానులు కర్మలనాచరించు చున్నానూ కర్మఫలముతో సంగమును పొందని తీరున, యోగీంద్రుడవగు నీకు కూడా సంసారలేపము లేదు. జగత్తును పోషించు నీవు జగత్తుతో సంపర్కమును పొందవు (58).

యోగి యొక్క ఆత్మ త్రిగుణాతీతమై యుండును. అటులనే ఈ జగత్తును సృజించి రక్షించే తేజోరాశివగు నీవు ఈత్రిగుణములకు అంతర్గతుడవై లేవు (59). ఓ సోదరా! నిన్ను ఎరుంగని మానవులు భ్రష్టమైన బుద్ధి గలవారు. కప్పలు, పద్మములు ఒకే సరస్సులో నుండును. కాని కప్పలు పద్మములను ఆదరించవు (60).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 597 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 04 🌴

🌻 Search for Kārttikeya and his conversation with Nandin - 6 🌻


53. Śiva will be crowning you in the company of the gods. You will get miraculous weapons and will slay the demon Tāraka.

54. You are the son of the annihilator of the universe and these (Kṛttikas) are impatient to gain possession of you as the dry tree tries to conceal fire within its hollow though it is incapable of holding it.

55. You are brilliant enough to illuminate the universe. You do not fit in well in this abode just as a majestic elephant fallen in a deep well does not retain splendour.

56. You can shed splendour if your brilliance is not hidden just as the sun illuminates the world only when it is not hidden by the cloud.

57. In the matter of omnipresence in the universe you alone are Viṣṇu, O Śiva’s son. The all-pervading sky is not pervaded by anything else.

58. A Yogin is not entangled in the activities of nurturing himself. The soul is not involved in the physical activities.

59. You are the creator of the universe, you are the lord. Your place is not among these. You are a mass of attributes and splendour as the soul of a Yogin.

60. O brother, those who do not know you are of damned intellect. Although the toads and lotuses are in the same pond toads are not honoured.


Continues....

🌹🌹🌹🌹🌹


20 Jul 2022

No comments:

Post a Comment