నిర్మల ధ్యానాలు - ఓషో - 221
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 221 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రపంచాన్ని పెద్ద నాటకంగా భావించాలి. ఇదంతా దేవుని నాటకమయితే అందులో మనం పాత్రలం. ఎవరూ నాటకాన్ని తీవ్రంగా తీసుకోకూడదు. మరణం వచ్చినపుడు చివరి తెర పడుతుంది. అందరూ విశ్వశక్తిలోకి అదృశ్యమవుతారు. 🍀
నువ్వు ప్రపంచంలో జీవించాలి. కానీ ప్రపంచాన్ని పెద్ద నాటకంగా భావించాలి. నేను ప్రపంచాన్ని వదిలెయ్యడానికి వ్యతిరేకిని. ప్రపంచం నించీ పారిపోకూడదు. దాంట్లో జీవించాలి. కానీ పూర్తిగా భిన్నరీతిలో జీవించాలి. దాన్ని భారంగా తీసుకోకు. తేలిగ్గా తీసుకో. అది విశ్వం వదిలిన మాయా బాణం. ప్రాచ్యంలో మనం దాన్ని ఆట 'అంటాం' అది దేవుని నాటకమయితే అందులో మనం పాత్రలం. ఎవరూ నాటకాన్ని తీవ్రంగా తీసుకోకూడదు. నువ్వు నాటకంలో రాజు కావచ్చు. కానీ దాన్ని అంతిమ సత్యంగా తీసుకోకూడదు. తెర పడుతూనే నువ్వు రాజన్న సంగతి మరిచిపోవాలి. తరువాత అది మనసులోకి రాకూడదు. నువ్వు సంపన్నుడయితే లేదా నువ్వు పేదవాడయినా ఆ విషయాన్ని పట్టించు కోవద్దు.
మనందరం ఈ ప్రపంచంలో పాత్రదారులమే. వాటిని వీలయినంత చక్కగా నిర్వర్తిద్దాం. కానీ ఇదంతా విశ్వం ఆడుతున్న ఆట అనే సంగతి మరచిపోవద్దు. మరణం వచ్చినపుడు చివరి తెర పడుతుంది. అప్పుడు నటులందరూ మాయమయిపోతారు. వాళ్ళంతా విశ్వశక్తిలోకి అదృశ్యమవుతారు. వ్యక్తి ప్రపంచంలో వున్నంత వరకు ఈ విషయం గుర్తుంచు కోవాలి. వ్యక్తి అన్ని రకాలయిన దుఃఖాల నుండి విముక్తుడు కావాలి. విషయాల్ని తీవ్రంగా తీసుకుంటే దాన్ని అనుసరించి దుఃఖాలు వస్తాయి. విషయాల్ని తేలిగ్గా తీసుకుంటే దాన్ననుసరించి ఆనందం వస్తుంది. నవ్వులాటగా తీసుకో. ఆనందించు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
06 Aug 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment