శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 399 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 399 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 399 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 399 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀

🌻 399. 'వ్యక్తావ్యక్త స్వరూపిణి' - 2🌻


మూడు వంతులు దివ్యము, అమృతము అయి ఉండి ఒక వంతు మాత్రమే గోచరించు విశ్వముగను, భూతములుగను శ్రీమాత యున్నది. కేవలము కనబడునదే అంతయూ అనుకొనుట అవివేకము. కనబడుచున్న వస్తువునందు నిక్షిప్తమై యున్న మూడు స్థితులు కూడ కలిపి చూడగలిగినచో ఒక వస్తువు యొక్క సమగ్రరూపము తెలియును. ప్రతి వస్తువు నందు వ్యక్తము, అవ్యక్తము రూపములతో శ్రీమాతయే యున్నది అని తెలియవలెను.

శ్రీమాత ఒక పాదమే వ్యక్త మగును, మూడు పాదములు అవ్యక్తముగనే యుండును. అవ్యక్తము మూలప్రకృతితో కూడియుండును. మూలప్రకృతి బ్రహ్మముతో కూడియుండును. ఇట్లు పరమపద సోపాన మంతయు శ్రీమాత రూపము వ్యాపించి యున్నది. తరువాత నామము 'వ్యాపిని'యే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 399 -2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari
Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻

🌻 399. Vyaktāvyakta-svarūpiṇī व्यक्ताव्यक्त-स्वरूपिणी 🌻


It is vyakta (manifested) + avyakta (un-manifested) svarūpiṇī. She is both manifested and un-manifested form. Since this form is the first of manifested form, it is called mahat which means great. It is the fundamental tool of the phenomenal universe. This mahat is endowed with supreme knowledge.

The undifferentiated prakṛti is mahat. From mahat, further evolution takes place. Vyakta means perishable and a-vyakta means imperishable. The soul-Brahman relationship is cited here. In general, this stage provides happiness and the final salvation. This nāma means the first signs of creation and final liberation are both caused by Lalitāmbikā.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


19 Aug 2022

No comments:

Post a Comment