శ్రీ మదగ్ని మహాపురాణము - 89 / Agni Maha Purana - 89


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 89 / Agni Maha Purana - 89 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 29

🌻. సర్వతోభద్ర మండల విధి - 6 🌻


నలుబది హస్తముల మండలమును అడ్డగీతలు గీసి క్రమముగా విభజింపవలెను. మొదట ఒక్కొక్కదానికి ఏడేసి భాగములు చేయవలెను. మరల ఒక్కొక్కదానిని మూడేసి భాగములు చేసి, వాటిని గూడ రెండేసి భాగములు చేయవలెను. ఈ విధముగ ఒక వెయ్యి ఏడువందల అరువదినాలుగు (1764) కోష్ఠకము ఏర్పడును. మధ్య నున్న పదునారు కోష్ఠకములతో కమలమును నిర్మింపవలెను. పార్శ్వభాగమున వీథి నిర్మించవలెను. పిమ్మట ఎనిమిది భద్రములు, వీథులు నిర్మింపవలెను. పిమ్మట పదునారుదలములు కమలమును వీథినినిర్మింపవలెను.

పిమ్మట క్రమముగ ఇరువదినాలుగు దలముల కమలము వీథి ముప్పదిరెండు దళముల కమలము, వీథి, నలుబది దళముల కమలము, వీథి నిర్మింపవలెను. పిమ్మట మిగిలిన మూడుపంక్తులచే ద్వారములు, శోభలు ఉపశోభలు, నిర్మింపవలెను. సర్వదిశల మధ్యభాగమునందు ద్వారసిద్ధి కొరకై రెండు నాలుగు, ఆరు కొష్ఠకములు తుడిచివేయవలెను. దానిబాహ్యభాగమునందు శోభా-ఉపద్వారము లేర్పడుటకై ఐదు కోష్ఠములు, మూడు కోష్ఠములు తుడిచివేయవలెను.

ద్వారముల పార్శ్వములందు, లోపలి వైపున, క్రమముగా ఆరు కోష్ఠములు, నాలుగు కోష్ఠములు తుడిచివేయవలెను. మధ్య నున్న రెండు రెండు కోష్ఠములు కూడ తుడిచివేయవలెను. ఈ విధముగ ఆరు ఉపశోభలు ఏర్పడును. ఒక్కొక్క దిక్కునందు నాలుగేసి శోభలు, మూడేసి ద్వారములను ఉండును. కోణములలో ఒక్కొక్క పంక్తిలోని ఐదేసి కోష్ఠముల విడువవలెను. అవి కోణము లగును. ఈ విధముగ చేయగా కావలసిన సుందరమైన మండల మేర్పడునున.

అగ్నేయమహాపురాణమునందు సర్వతోభద్రమండలాది విధి యను ఇరువదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 89 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 29

🌻 Mode of worshipping Hari in the figure called Sarvatobhadra - 6 🌻


43-44. Each one (of these divisions) are again (first) divided into seven parts and then into two. Then of one thousand seven hundred and sixty-four apartments we will have a bhadraka (figure) (formed) by the central sixteen apartments. There will be a pathway on the side, then eight bhadra apartments and a pathway.

45-46. Then sixteen (figures) of lotuses and twenty-four lotuses for the rows and thirty-two for the pathway and forty rows and a passage with the remaining three rows (are drawn). The doors are provided with ornaments and minor beautifications in the directions, omitting the centre.

47. For accomplishing, two, four and six doors (space) is cut off in the four directions and five, three and one outside (are set apart) for accomplishing the adornment of the doors.

48. In the same manner, six or four (compartments) are omitted outside the door and four inside. There will be six minor adornments.

49- 50. There should be four doors on one side or three doors specifically in each direction. One has to draw five apartments at the angular points (as well as) in the rows in order. An auspicious altar dear to a mortal has to be (drawn) in this manner.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


05 Aug 2022

No comments:

Post a Comment