శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।
మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀

🌻 403. 'మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ' - 3 🌻

మహాకామేశ్వరుడు తపస్సిద్ధుడు అగుటచే అతడు సహజముగ ఆనందమయుడు. ఆనందము అతనిని ఆశ్రయించి యుండును. అతడు అర్ధనిమీలిత నేత్రుడు. తపస్వి ఎప్పుడునూ కన్నులు మూసుకునే యుండును. అంతర్ముఖముగ విశ్వవిలాసమును గమనించుచు వికసితము, ప్రశాంతము అయిన ముఖము కలిగి యుండును.

అతడు కన్నులు సగము తెరచుటకు కారణము విశ్వవిలాసము శ్రీమాత రూపముగ ఎదురుగ నుండుటయే. అతడు అంతర్ముఖముగను, బహిర్ముఖముగను సృష్టి విలాసము దర్శించుటకు శ్రీమాతయే కారణము. ఆమె విలాసము అతనికి అతిశయించిన సుఖమును కలిగించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini
Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻

🌻 403. 'Mahakamesha Nayana Kumudahlada Kaumudi' - 3 🌻

Mahakameswara is an penant and therefore he is naturally blissful. Bliss takes shelter in Him. His eyes are half closed. An ascetic will always close his eyes. He internally observes the beauty and dance of the universe and has a calm and serene face.

The reason why he half-opened his eyes was that Srimata, who is an embodiment of the universal dance is right before him. Sri Mata is the reason why he sees the dance of this creation both inwardly and outwardly. Her indulgence gives him inordinate pleasure.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment