శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 4


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 4 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।
మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀

🌻 403. 'మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ' - 4 🌻


మహాకామేశ నయన అను పదముల సముదాయమునకు మరియొక అర్థము కూడ యున్నది. 'నయన' అనగా చేర్చుట అను అర్థము కూడ యున్నది. ఉపనయన మనగా దగ్గరకు చేర్చుట. బ్రహ్మము దగ్గరకు చేర్చుటకే ఉపనయన క్రతువు. అట్లే మహా కామేశుని దగ్గరకు జీవులను చేర్చుటకు కృషి చేయునది శ్రీమాత. పిల్లలను పెంచి తండ్రికి అప్పచెప్పుట తల్లుల కర్తవ్యమై యున్నది. అందువలన శ్రీమాత కృషి అంతయూ జీవులను దేవుని వద్దకు చేర్చుటయే. వెన్నెల వెలుగు మార్గము ద్వారా జీవులను దేవుని వద్దకు చేర్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 4 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini
Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻

🌻 403. 'Mahakamesha Nayana Kumudahlada Kaumudi' - 4 🌻


Mahakamesha Nayana also has another meaning. 'Nayana' also means to include. Upanayana means to bring closer. Thus, Upanayana is the act of approaching Brahman. It is Srimata who strives to bring living beings closer to the great Lord. It is the mother's duty to bring up the children and hand them over to the father. Therefore Sri Mata's work is to bring all beings to God. She brings the beings to God through the path of light.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


08 Sep 2022

No comments:

Post a Comment