నిర్మల ధ్యానాలు - ఓషో - 254
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 254 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అస్తిత్వాన్ని సమీపించడానికి ప్రాథమిక విధానమేమిటంటే ప్రతి మనిషి తన చైతన్యాన్ని పూల చెట్టులా ఎదిగేలా చేయాలి. మన సమస్త జీవితాన్ని పండుగగా మార్చాలి.🍀
మనం అస్తిత్వానికి ఏమీ యివ్వలేం. మనం ఆడవచ్చు. పాడవచ్చు. అద్భుత సంగీత వాద్యాన్ని ఆలపించవచ్చు. మన సమస్త జీవితాన్ని పాటగా మార్చవచ్చు. పండుగగా మార్చవచ్చు. అస్తిత్వానికి మనమివ్వగలిగిన నిజమైనది అదే. చెట్లనించీ పూలు తెంపి యివ్వడం బుద్ధిమాలిన పని. కారణం పూలు చెట్లవి. నీవి కావు. అవి అప్పటికే చెట్టు అస్తిత్వానికి అర్పించినవి. అవి చెట్లపై సజీవంగా వుంటే నువ్వు తెంపి చంపావు. నువ్వు వాటి అందాన్ని నాశనం చేశావు. నువ్వు అస్తిత్వానికి శవాల్ని అర్పిస్తున్నావు. నువ్వు ఏ మహాత్ముని మాటల్ని దేవుడికి అర్పించలేవు. అవి ఆయన మాటలు, ఆయన పాటలు. అవి అందమైనవి.
కానీ నువ్వు వాటిని అరువు తెచ్చుకున్నావు. అవి నీ హృదయం నించీ వచ్చినవి కావు. వాటిల్లో నీ హృదయం స్పందన లేదు. వాటిల్లో నీ చేవ్రాలు లేవు. బుద్ధుని, కృష్ణుని మాటలైనా, పాటలయినా అవన్నీ అరువు తెచ్చుకున్నవే. అస్తిత్వాన్ని సమీపించడానికి ప్రాథమిక విధానమేమిటంటే ప్రతి మనిషి తన చైతన్యాన్ని పూల చెట్టులా ఎదిగేలా చేయాలి. మనిషిలో పూలు ప్రేమ పూలు, స్వాతంత్య్ర సుమాలు, ఆనంద సుమాలు. వాటిని నేను పాటలంటాను. నువ్వు నీ సంగీతాన్ని, ఆనందాన్ని ప్రేమని అస్తిత్వానికి సమర్పిస్తే వందరెట్లుగా అవి నీ మీద వర్షించడం చూసి ఆశ్చర్యపోతావు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment