శ్రీ శివ మహా పురాణము - 634 / Sri Siva Maha Purana - 634


🌹 . శ్రీ శివ మహా పురాణము - 634 / Sri Siva Maha Purana - 634 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 12 🌴

🌻. కార్తికేయ స్తుతి - 4 🌻


వృషభధ్వజుడు, మహేశ్వరుడు, గణములకు ప్రభువు, సర్వేశ్వరుడు, ముల్లోకములకు ప్రభువు అగు మహాదేవునకు నమస్కారము (33) ఓ నాథా! త్రిగుణ స్వరూపుడవై లోకములన్నిటిని సృష్టించి, పాలించి, పోషించి, సంహరించు నీకు నమస్కారము. నీవు శాశ్వతుడవు (34). సంగము లేని వాడు, పరమేశ్వరుడు, మంగళకరుడు, పరమాత్మ, ప్రపంచాతీతుడు, శుద్ధుడు, సర్వకారణుడు, నాశము లేనివాడు (35), చేతి యందు దండమును ధరించు మృత్యుస్వరూపుడు, చేతి యందు పాశమును ధరించువాడు, వేద మంత్రములచే ప్రతిపాదింబడువాడు, ప్రలయకాలములో అనేక విధములుగా ప్రాణులను భక్షించువాడు అగు నీకు నమస్కారము (36).

ఓ పరమేశ్వరా! భూత వర్తమాన భవిష్యత్కాలములకు చెందిన పదార్థములు మరియు స్థావర జంగమ ప్రాణులు నీ దేహమునుండియే పుట్టుచున్నవి (37). స్వామీ! మమ్ములను ఎల్లవేళలా రక్షించుము. భగవాన్‌! ప్రభూ! ప్రసన్నుడవు కమ్ము. పరమేశ్వరా! మేము నిన్ను అన్ని విధములుగా శరణు పొంది యున్నాము (38). తెల్లని కంఠము (నీలభాగమును విడచి) గలవాడు, స్వాహాకారస్వరూపుడు, రూపములేని వాడైననూ రూపమును స్వీకరించి సర్వరూపములు తానే అయినవాడు అగు రుద్రునకు నమస్కారము (39). విషమును ధరించుటచే నీలవర్ణమును కూడిన కంఠము గలవాడు, చితాభస్మను అవయవములపై ధరించినవాడు, నిత్యము నల్లని కేశములు గలవాడు అగు శివునకు అనేక నమస్కారములు (40).

అందరిచే నమస్కరింపబడు రూపముగలవాడు, యోగులచే ఉపాసింపబడువాడు, లయకాలములో ప్రాణులను సంహరించువాడు, అందరిచే పూజింపబడే పాదములు గలవాడు అగు మహాదేవునకు వందనము (41). నీవు దేవతలందరిలో బ్రహ్మవు. రుద్రులలో కంఠమునందు నీలవర్ణము, ఇతర దేహము నందు రక్తవర్ణము గల శివుడవు. సర్వప్రాణులలోని ఆత్మవు నీవే. సాంఖ్యులు నిన్ను పురుషుడని వర్ణింతురు (43).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 634🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 12 🌴

🌻 The story of Śiva and Pārvatī including that of Kārttikeya - 4 🌻


33. Obeisance to the bull-bannered lord Śiva, obeisance to the lord of Gaṇas; Obeisance to the lord of all. Obeisance to the lord of the three worlds.

34. O lord, obeisance to you, the annihilator, the sustainer and creator of the worlds. O lord of gods, obeisance to you, the lord of three attributes and the eternal.

35. Obeisance to the lord free from attachment; obeisance to Śiva the great soul. Obeisance to the pure beyond the world of matter, obeisance to the great, the unwasting.

36. Obeisance to you the god of death holding the staff of punishment and noose in the hand. Obeisance to the chief of the deities invoked by Vedic mantras. Obeisance to you the hundred-tongued deity.

37. O lord, everything has come out of your body whether past, present or future, whether mobile or immobile.

38. O lord, protect us always. O supreme lord, we have sought refuge in you in every respect.

39. Obeisance to you, the blue-necked Rudra, of the form of offering. Obeisance to you both possessed and devoid of forms, the multiformed one.

40. Obeisance to Śiva, the blue-necked, the wearer of ashes on the limbs from the funeral pyre. Obeisance to you Śrīkaṇṭha and Nīlaśikhaṇḍa.

41. Obeisance to you saluted by all, saluted by the Yogins. Obeisance to you, the great lord, whose feet are worshipped by all.

42. You are Brahmā among all the gods, you are Nīlalohita among Rudras; you are the soul in all living beings; you are the Puruṣa of Sāṅkhya system.

43. You are Sumeru among mountains, you are the moon among the stars. You are Vasiṣṭha among the sages and you are Indra among the gods.


Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment