1) 🌹 16 - NOVEMBER - 2022 WEDNESDAY, బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 90 / Kapila Gita - 90 🌹 సృష్టి తత్వము - 46
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 129 / Agni Maha Purana - 129 🌹 🌻. అర్ఘ్యదాన-శల్యముల కథనము - 3 🌻
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 264 / Osho Daily Meditations - 264 🌹 అవగాహన - AWARENESS
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 412 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 2🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹16, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : కాలభైరవ జయంతి, వృశ్చిక సంక్రాంతి, Kalabhairav Jayanti, Vrischika Sankranti 🌺*
*🍀. శ్రీ నారాయణ కవచం - 22 🍀*
*33. తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరిః |*
*పాతు సర్వైః స్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః*
*34. విదిక్షు దిక్షూర్ధ్వమధః సమంతా- దంతర్బహిర్భ
గవాన్నారసింహః |*
*ప్రహాపయఁల్లోకభయం స్వనేన స్వతేజసా గ్రస్తసమస్తతేజాః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : లోకం చెడ్డదన్న ప్రతి దానినీ నీవు చెడ్డదనబోకు. ఈశ్వరుడు నిరాకరించినది మాత్రమే నీవు నిరాకరించు. అట్లే, లోకం మంచిదన్న ప్రతి దానినీ నీవు మంచిదనబోకు. ఈశ్వరుడు స్వీకరించినది మాత్రమే నీవు స్వీకరించు.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: కృష్ణ అష్టమి 31:58:13 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: ఆశ్లేష 18:59:05 వరకు
తదుపరి మఘ
యోగం: బ్రహ్మ 25:08:43 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: బాలవ 18:54:21 వరకు
వర్జ్యం: 06:30:00 - 08:17:00
దుర్ముహూర్తం: 11:38:02 - 12:23:17
రాహు కాలం: 12:00:40 - 13:25:31
గుళిక కాలం: 10:35:49 - 12:00:40
యమ గండం: 07:46:07 - 09:10:58
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 17:12:00 - 18:59:00
సూర్యోదయం: 06:21:15
సూర్యాస్తమయం: 17:40:04
చంద్రోదయం: 00:14:06
చంద్రాస్తమయం: 12:40:21
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు : రాక్షస యోగం - మిత్ర కలహం
18:59:05 వరకు తదుపరి చర యోగం
- దుర్వార్త శ్రవణం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 90 / Kapila Gita - 90🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 46 🌴*
*46. భావనం బ్రహ్మణః స్థానం ధారణం సద్విశేషణమ్|*
*సర్వసత్త్వగుణోద్భేదః పృథివీవృత్తిలక్షణమ్॥*
*విగ్రహాది రూపములలో పరబ్రహ్మము యొక్క సాకార భావనకు ఆశ్రయము గలిగించుట, జలము మొదలగు కారణతత్త్వములకంటె వేరైన ఇతర వస్తువులను ఆశ్రయింపకయే స్థిరముగా ఉండుట, జలము మున్నగు ఇతర పదార్థములను ధారణ చేయుట, ఆకాశాదులచే నిండుట అనగా - ఘటాకాశము, మఠాకాశము - మొదలగు తీరులలో పరిచ్ఛిన్నము చేసినట్లు గోచరించుట అట్లే పరిణామ విశేషములచే సకల ప్రాణుల యొక్క స్త్రీత్వ-పురుషత్త్వాది గుణములను ప్రకటించుట అనునవి పృథివీతత్త్వము యొక్క కార్యరూప లక్షణములు.*
*భూమి చేసే పనులు*
*1. భావనం - ఆకారం ఏర్పడుట (కుండ మనం భూమితోనే చేస్తున్నాము. మట్టికి ఆయా ఆకారములుగా మారగల శక్తి ఉన్నది. వివిధ రూపములు పొందగలుగుట మట్టి యొక్క లక్షణం. బంగారము కూడా మట్టి యొక్క ఆకారమే. దానిలో తేజో గుణం ఎక్కువగా ఉంది, అంతే. మనకు కంటికి కనపడే ప్రతీ ఆకారం మట్టి). ఆకారం ఉంది అంటే మట్టి.*
*2. బ్రహ్మణః స్థానం - సకల చరా చర జగత్తు నిలవడానికి ఆధారం భూమి. స్వర్గములో కూడా భూమి ఉంది. స్వర్గములో కూడా ఇక్కడిలాగే వాయువూ, అగ్నీ, సూర్యుడు చంద్రుడు భూమి ఉంటాయి.*
*3. ధారణం - మనము ఏమి వేసిన ధరిస్తుంది.*
*4. సద్విశేషణం - పదార్ధాలలో సారమునీ రుచినీ మార్చేది భూమి. ఒక్కో ప్రాంతములో ఒక్కో పంట విశేషముగా పండుతుంది. అలాగే ఒక ప్రాంతములో పండినవి, ఇంకో ప్రాంతములో పండిన దాని కన్నా రుచిగా ఉంటుంది. అన్ని చోట్లా పండినా, కొన్ని చోట్ల పండిన ధ్యానం రుచి బాగా ఉంటుంది. ఎంత మంచి భూమి అయినా, విత్తనం బాగా లేకుంటే పండదు. ఎంత మంచి విత్తనమైనా చౌటు భూమిలో పండదు. మంచి విత్తనము కూడా మంచి భూమిలో పెరిగినదే. దేశ భేదాన్ని బట్టి సారవంతములూ నిస్సారవంతములూ అవుతాయి.*
*సర్వసత్త్వగుణోద్భేదః - మట్టి ప్రాణుల ఆకారాన్ని కూడా మారుస్తుంది. ఒక ప్రాంతములో ఉన్న వారికి కళ్ళు చిన్నగా ఉంటాయి, కొన్ని ప్రాంతాలలో తెల్లగా, కొన్ని ప్రాంతాలలో నల్లగా ఉంటారు. అంటే స్వరూపానీ, రుచినీ, ఆకారాన్ని మార్చేది భూమి. స్వభావాన్ని మార్చేది కూడా భూమే. దేవాలయానికి వెళితే ప్రశాంతముగా ఉంటుంది. వ్యగ్రమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనసు వ్యగ్రముగా ఉంటుంది. హిమాలయాలలో ఉన్న జంతువులకి జుట్టు ఎక్కువ ఉంటుంది.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 90 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 46 🌴*
*46. bhāvanaṁ brahmaṇaḥ sthānaṁ dhāraṇaṁ sad-viśeṣaṇam*
*sarva-sattva-guṇodbhedaḥ pṛthivī-vṛtti-lakṣaṇam*
*The characteristics of the functions of earth can be perceived by modeling forms of the Supreme Brahman, by constructing places of residence, by preparing pots to contain water, etc. In other words, the earth is the place of sustenance for all elements.*
*Different elements, such as sound, sky, air, fire and water, can be perceived in the earth. Another feature of the earth especially mentioned here is that earth can manifest different forms of the Supreme Personality of Godhead. By this statement of Kapila's it is confirmed that the Supreme Personality of Godhead, Brahman, has innumerable forms, which are described in the scriptures. By manipulation of earth and its products, such as stone, wood and jewels, these forms of the Supreme Lord can be present before our eyes. When a form of Lord Kṛṣṇa or Lord Viṣṇu is manifested by presentation of a statue made of earth, it is not imaginary. The earth gives shape to the Lord's forms as described in the scriptures.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 129 / Agni Maha Purana - 129 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 40*
*🌻. అర్ఘ్యదాన-శల్యముల కథనము - 3🌻*
నైరృతిదిక్కున నున్న కోణముందలి అర్ధకోష్ఠముందున్న సురాధిపతి యైన ఇంద్రనకు పసుపునీళ్ళతో అర్ఘ్యమును ఇవ్వవలెను. దాని అర్ధభాగమునందే కోణమునందలి కోష్ఠమునం దున్న ఇద్రజయునకు నెయ్యి అర్ఘ్యముగా ఇవ్వవలెను. చతుష్పదమునందలి మిత్రునకు గుణయుక్త మగు పాయసము సమర్పింపవలెను.
వాయవ్య కోణమున అర్ధకోష్ఠముపై నున్న రుద్రునకు పక్వమాంసమును ఇవ్వవలెను. దాని క్రింద అర్ధకోష్ఠమునం దున్న యక్షునకు (రుద్రదాసునకు) (ద్రాక్షమొదలగు) ఆర్ద్రఫలము లివ్వవలెను. చతుష్పదమునందున్న పర్వతమునకు మాంసాన్నమును, మాషమును బలి ఇవ్వవలెను. మధ్యలో నున్న నాలుగు కోష్ఠములందును బ్రహ్మకొరకై తిలతండులము లుంచవలెను.
చరకిని మాంసఘృతములచేతను, కుమారస్వామిని పులగముచేతను, రక్తముచేతను, విదారిని రక్తకమలముచేతను, కందుర్పుని ఒక ఫలము అన్నముచేతను, పూతనను ఫలపిత్తములచేతను, జంభకుని మాంసరక్తములచేతను, పాపరక్షసుని పిత్త-రక్త-అస్థులచేతను, పలిపిత్సుని మాలికలచేతను, రక్తముచేతను తృప్తిపరుపవలెను.
పిదప ఈశానాది దిక్పాలకులకు రక్తమాసంమును, సమర్పింపవలెను. ఆయా వస్తువులు లభింపనపుడు ఆక్షతలు సమర్పింపవలెను. రాక్షస-మాతృకా. గణ-పిశాచ-పితృ-క్షేత్రపాలాదులకుగూడ ఇచ్ఛానుసారముగా బలిప్రదానము చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 129 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 40*
*🌻 The mode of making the respectful offering to the god - 3 🌻*
15. Respectful offering along with turmeric (is made) to Indra in the lower square in the south-west and rice mixed with ghee (is offered) in the corner square below Indrajaya.
16. Sweet gruel (mixed) with jaggery (is offered) to Indra in four squares and cooked meat (is offered) to Rudra in the corner square in the north-west.
17. In the corner square below that wet fruit (is offered) to Yakṣa, rice meat and black-gram (are offered) to Mahidhara in four squares.
18. Rice and sesamum should be placed in the central square for Brahmā. Carakī (is worshipped) with black-gram and clarified butter and Skanda with a dish composed of milk, sesamum and rice and a garland.
19. Vidārī (a demoness) (is worshipped) with red lotuses, Kandarpa (god of love) with cooked rice and meat, Pūtanā (a demoness) with meat and bile and Jambaka (a demon) with meat and blood.
20. The Iśa (is appeased) with bile, blood and bones, Pilipiñja (a demon) with a garland and blood. Other deities are worshipped with blood and meat and in their absence with unbroken rice.
21. Sacrificial offerings are made to demons, divine mothers, manes and guardian deities of the ground in due order.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 264 / Osho Daily Meditations - 264 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 264. అవగాహన 🍀*
*🕉. ఎక్కడకీ వెళ్లనవసరం లేదు; మనం ఎక్కడున్నామో చూడాలి. అది మీరు తెలుసుకుంటే, మీరు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న చోటనే మీరు ఇప్పటికే ఉన్నారని అకస్మాత్తుగా గుర్తిస్తారు. 🕉*
*ఒకరు ఎలా ఉండాలో అలాగే పుడతారు-ఏదీ జోడించాల్సిన అవసరం లేదు మరియు ఏదీ మెరుగుపరచాల్సిన అవసరం లేదు. మరియు ఏమీ మెరుగుపరచ బడదు. మెరుగు పరచడానికి చేసే అన్ని ప్రయత్నాలు మరింత గందరగోళాన్ని, అయోమయాన్ని సృష్టిస్తాయి తప్ప మరేమీ కాదు. మిమ్మల్ని మీరు ఎంతగా మెరుగుపరుచు కోవడానికి ప్రయత్నిస్తారో, అంతగా మీరు ఇబ్బందులకు గురవుతారు, ఎందుకంటే ఆ ప్రయత్నం మీ వాస్తవికతకు వ్యతిరేకంగా ఉంటుంది. మీ వాస్తవికత అలాగే ఉంది; దాన్ని మెరుగుపరచాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి కేవలం అవగాహనలో పెరుగుతాడు, అస్తిత్వపరంగా కాదు. బిచ్చగాడిలా భావించి, జేబులోకి చూసుకోకుండా జీవించడం చేస్తున్నావు.*
*జీవితాంతం సరిపడా సంపదను అందించగల విలువైన వజ్రాన్ని జేబులో పెట్టుకుని, భిక్షాటన చేస్తూ తిరుగుతున్నావు. ఆ తర్వాత ఒకరోజు జేబులో చెయ్యి పెట్టుకుని, అకస్మాత్తుగా నువ్వు చక్రవర్తివి గుర్తిస్తావు. అస్తిత్వపరంగా ఏదీ మారలేదు, పరిస్థితి అలాగే ఉంది-వజ్రం ముందూ ఉంది, ఇప్పుడూ ఉంది. మారిన ఏకైక విషయం ఏమిటంటే, ఇప్పుడు మీరు దానిని కలిగి ఉన్నారని తెలుసుకున్నారు. కాబట్టి జరిగే అభివృద్ధి అంతా కూడా అవగాహనలో పెరుగుదల, ఉనికిలో కాదు. ఉండటం సరిగ్గా అలాగే ఉంటుంది. ఒక కృష్ణడు లేదా బుద్ధుడు, మీరు లేదా ఎవరైనా, సరిగ్గా అదే స్థితిని కలిగి ఉంటారు, అదే స్థలంలో ఉంటారు. కానీ ఒకరు తెలుసుకుని బుద్ధుడిగా మారతారు, మరొకరు తెలియకుండా ఉండి, బిచ్చగాడుగా మిగిలిపోతారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 264 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 264. AWARENESS 🍀*
*🕉. There is nowhere to go; we just have to see where we are. if you become aware, then you suddenly recognize that you were already there, just where you have been trying to reach. 🕉*
*One is born as one should be-nothing has to be added, and nothing has to be improved. And nothing can be improved. All efforts to improve create more mess and confusion and nothing else. The more you try to improve upon yourself, the more you will be in difficulties, because the very effort goes against your reality. Your reality is as it should be; there is no need to improve it. One simply grows in awareness, not existentially. It is as if you have not looked into your pocket and you think you are a beggar, so you go on begging, and in your pocket you are carrying a valuable diamond that can give you enough treasures for your whole life.*
*Then one day you put your hand in the pocket, and suddenly you are an emperor. Nothing has changed existentially, the situation is the same-the diamond was there before, the diamond is there now. The only thing that has changed is that now you have become aware that you possess it. So all growth is growth in awareness, not in being. Being remains exactly as it is. A Krishna or a Buddha, you or anybody, have exactly the same state, the same space. But one becomes aware and becomes a Buddha, the other remains unaware and remains a beggar.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 412 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।*
*అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀*
*🌻 412. ‘శిష్టపూజితా' - 2🌻*
*అనాచారము మితిమీరినపుడు దండించును. అనాచారమున స్థిరపడిన వారిని కష్ట నష్టముల ద్వారా మెత్తబరిచి ఆచారము నవలంబింప చేయును. సదాచారులు పూజలు మన్నించి అనుగ్రహించును. కొందరిని అనుగ్రహించుట, కొందరిని అనుగ్రహింపకుండుటకు కారణము ధర్మాచరణ యందుగల వ్యత్యాసమే అని తెలియవలెను. ధర్మమును నమ్మి తనను పూజించు వారిని ఎల్లప్పుడూ రక్షించుచుండును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*
*🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita*
*Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻*
*🌻 412. 'Sishta Pujita' - 2🌻*
*When inmorality is excessive, She punishes. Those who are not righteous in their practices are trained by Srimata by way of hurdles and setbacks and then inculcates righteousness in their practices. She accepts the worships of the righteous and blesses them. It should be known that the reason for apparent favoring some and not favoring others is the difference their righteousness. She always protects those who believe in Dharma and worship Her.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment