శ్రీ మదగ్ని మహాపురాణము - 140 / Agni Maha Purana - 140


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 140 / Agni Maha Purana - 140 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 43

🌻. ఆలయ ప్రాసాద దేవతాస్థాపన శాంత్యాది వర్ణనము - 3🌻


ప్రతిమలను నిర్మించుటకై అడవిలోనికి వెళ్లి వనయాగము ప్రారంభిపవలెను. అచట ఒక కుండము త్రవ్వి, దానిని అలికి, మండపముపై విష్ణుమూర్తిని పూజింపవలెను. విష్ణువునకు బలి సమర్పించి ప్రతిమా నిర్మాణకర్మ యందు ప్రయోగించు టంకము మొదలగు శస్త్రములను పూజించవలెను. హోమము చేసిన పిమ్మ బియ్యపు నీళ్ళతో అస్త్ర మంత్రమును (అస్త్రాయఫట్‌) ఉచ్చరించుచు ఆ శిలను తడుపవలెను. న

రసింహ మంత్రముతో దానికి రక్షచేసి మూలమంత్రముతో (ఓం నమోనారాయణాయ) పూజచేయవలెను. పూర్ణాహుతి హోమము చేసిన పిమ్మట ఆచార్యుడు భూతములకు బలి సమర్పింపవలెను. అచట కనబడకుండ నివసించు జంతువులు, రాక్షసులు, యక్షులు సిద్ధులు మొదలగు వారికందరకు పూజలు చేసి ''కేశవుని ఆజ్ఞచే మేము ప్రతిమల కొరకై ఈయాత్రపై వచ్చితిమి. శ్రీమహావిష్ణుని కార్యము మీ కార్యముకూడ అగును అందుచే మేమిచ్చిన ఈ బలిచే తృప్తులై మీరు వెంటనే ఈ స్థానమును విడచి, కుశల పూర్వకముగ మరొక చోటికి వెళ్ళుడు'' అని చెప్పుచు క్షమా ప్రార్థన చేయవలెను.

ఈ విధముగ ప్రార్థింపబడిన వారందరును ప్రసన్నులై సుఖముగ ఆ స్థానమును విడిచి మరొక ప్రదేశమునకు వెళ్ళి పోవుదారు. పిమ్మట శిల్పులతో కలసి యజ్ఞ చరువును భక్షించి రాత్రి నిద్రించు సమయమున స్వప్న మంత్రమును ఈ విధముగ జపించవలెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana - 140 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 43

🌻 Installation of deities in the temples - 3 🌻


16. One should go to the forest and perform the forest rites for the sake of an image. After having bathed and plastering a shed Hari should be worshipped there.

17. After having made the offering of the victim, the (stonecutter’s) chisel used for the work should be worshipped. Having offered homa (pouring of clarified butter into the fire), water mixed with rice should be sprinkled over the image with the implement (chisel).

18. Having made the protective spell it should be worshipped with basic sacred syllable of lord Nṛsiṃha. After having made the offering to fire the final oblation should be made. Then offerings to the goblins should be given by the preceptor.

19. Having worshipped the good (spirits), the demons, guhyakas (a class of attendant-gods of Kubera), and accomplished souls and others who may be residing there, should be requested to forgive.

20. (They should be addressed as follows). “This journey (has been undertaken) by us for the image of Viṣṇu by the command of Keśava. Any work done for the sake of Viṣṇu, should also be your (concern).”

21. “Being always pleased with this offering (you) repair quickly to some other place quitting this place for good”.

22. Being informed thus (these beings) go to another place in good cheer and satisfied. Having eaten the sacrificial porridge along with the sculptors, he should repeat in the night the following sacred syllables (inducing) sleep.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment