శ్రీ మదగ్ని మహాపురాణము - 143 / Agni Maha Purana - 143


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 143 / Agni Maha Purana - 143 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 44

🌻. వాసుదేవ ప్రతిమా లక్షణము - 2🌻

ఆరు సూత్రములను మూడు కక్షల అంతరముచే ఉంచవలెను. మరల మధ్య సూత్రమును విడిచివేసి కేవల సూత్రములను మాత్రమే ఉపయోగింపవలెను. లలాట-నాసికా-ముఖముల విస్తారము నాలుగు అంగుళములుండవలెను. కంఠ విస్తారము చెవుల విస్తారము కూడా నాలుగు అంగుళములే ఉండవలెను. రెండు ప్రక్కల చెక్కిళ్ళు రెండేసి అంగుళముల వెడల్పు ఉండవలెను. బుగ్గ కూడ రెండు అంగుళము లుండవలెను. పూర్తి విస్తారము ఆరు అంగుళములుండవలెను.

లలాట విస్తారము ఎనిమిది అంగుళములుండవలెను. రెండు ప్రక్కల శంఖ ప్రదేశములు రెండేసి అంగుళముల విస్తారము కలిగియుండి వాటిపై వెండ్రుకలు కూడ ఉండవలెను. చెవులకు నేత్రములకు మధ్య నాలుగు అంగుళముల వ్యవధానముండవలెను. చెవులు పృథుకములు రెండేసి అంగుళములు నిర్మింపవలెను. కనుబొమ్మలకు సమాన సూత్రముననున్న భాగమునకు "కర్ణ స్రోతస్సు" అనిపేరు. గుచ్చిన (కుట్టిన) చెవులు ఆరు అంగుళములు, కుట్టనివి నాలుగు అంగుళములు ఉండవలెను. లేదా కుట్టిన, చెవులైనను కుట్టనిచెవులైనను , బుగ్గతో సమానము ఆరు అంగుళములు ఉండవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 143 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 44

🌻Characteristics of the image of Vāsudeva - 2 🌻


11. Six lines should be laid in between the armpits and the lower part of the spine. These lines alone should be marked clearly omitting the central line.

12. The forehead, the nose and the mouth should be made (to measure) four aṅgulas. The neck and the two ears should be made (to measure) four aṅgulas long.

13. The cheeks so also the chin should be made (to measure) two aṅgulas broad. The forehead is said to be eight aṅgulas broad.

14. Over that the temples (sides of the forehead) should be made two aṅgulas endowed with curbs. The intervening space between the eyes and ears is said to be four aṅgulas.

15. The ears should be two aṅgulas wide. (The interspace between) the ears and the ends of eye-lashes (should be) two and a half units. The cavity in the ear is spoken to be in the same line as the eyebrows.

16. A pierced ear (should be) six aṅgulas and an unpierced (ear) (should be) four aṅgulas equal to the chin. (Or it should be) six aṅgulas whether it is pierced or not pierced.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment