శ్రీ మదగ్ని మహాపురాణము - 149 / Agni Maha Purana - 149


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 149 / Agni Maha Purana - 149 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 45

🌻. పిండికాది లక్షణము - 2🌻


ముఖము పొడవు ఒక కోణము నుండి మరియొక కోణమువరకు ఎంత ఉండునో సూత్రములో కొలిచి కర్ణ పాశము అంత ఉండునట్లు చేయవలెను. దాని పొడవు పైన చెప్పిన సూత్రము కంటె కొంచెము ఎక్కువ పొడవే ఉండవలెను. రెండు స్కంధములు కొంచెము వంగి ఒక కల తగ్గినట్లు చయవలెను. కంఠము పొడవు ఒకటిన్నర కళల పొడవుండవలెను. వెడల్పు కూడ అంతలో ఉండవలెను. రెండు ఊరువుల విస్తారము కంఠము కంటె ఒక నేత్రము తక్కువ ఉండవలెను. మోకాళ్ల చిప్పలు, పిండలి, పాదములు, పీఠము, నితంబము, కటిభాగము మొదలగు వాటిని యథా యోగ్యముగ కల్పంపవలెను.

చేతి వ్రేళ్లు పెద్దవిగా ఉండవలెను. పరస్పరావరుద్ధములు కాకూడదు. పెద్దవ్రేలి కంటె చిన్న వ్రేళ్లు ఏడవ వంతు తక్కువ ఉండవలెను. పిక్కలు, తొడలు, కటి-వీటి పొడవు క్రమముగా ఒక్కొక్క నేత్రము తక్కువ ఉండవలెను. శరీర మధ్య ప్రాంతము గుండ్రముగా ఉండవలెను. కుచములు దగ్గరగా బలిసి ఉండవలెను. స్తనములు జానెడు ఉండవలెను. కటి ప్రదేశము వాటికంటె ఒకటిన్నర కలలు పెద్దదిగా ఉండవలెను. మిగిలిన చిహ్నములన్నియు వెనుకటివలెనే లక్ష్మికి కుడిచేతిలో కమలము, ఎడమచేతిలో బిల్వఫలము ఉండవలెను. చామరము ధరించిన స్త్రీలు ఆమె పార్శ్వములందు నిలిచి ఉండవలెను. పెద్ద ముక్కుగల గరుత్మంతుడు ఎదుట నిలిచి ఉండవలెను. ఇపుడు చక్రాంకిత (సాలగ్రామాది) మూర్తులను గూర్చి చెప్పెదను.

అగ్నిపురాణమునందు పిండికాది లక్షణమను నలుబదియైదవ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 149 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 45

🌻Characteristics of pedestals and details relating to images - 2 🌻


10. The beautiful ears should be made to be in a line with the corners of the mouth. Then the two shoulders should be made sloping by less than a kalā.

11-12. The neck should be one and a half kalās long and made beautiful by a proportionate width. The thighs, kneejoints, the pedestal, should be broad. The feet, the hinder part, the bullocks and the hips should be made as prescribed. The fingers should measure less than the seventh part of the above and should be long and not crooked.

13. The shank, thigh and the hip would be one netra[1] less in length. The middle part and the sides should have the same roundness. The two breasts (should be) fully developed and plump.

14-15. The beasts should be made to measure a tāla. The waist should be one and a half kalās. The other marks should be the same as before. A lotus (should be placed) on the right hand and a bilva (fruit) on the left (hand). (There should be) two maidens on the sides holding chowries in their hands. (The image of) Garuḍa should have a long nose. I shall then describe those which bear the marks of a disc.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment