నిర్మల ధ్యానాలు - ఓషో - 278


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 278 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రతిదీ మొదట్లో చీకట్లో పెరుగుతుంది. తల్లి గర్భంలో చీకటి వుంటుంది. అది అవసరం. బిడ్డ పుడతాడు. భౌతికంగా అతను కాంతిలోకి వస్తాడు. కానీ, ఆధ్యాత్మికంగా అతనింకా చీకట్లోనే వుంటాడు. 🍀


మనిషి సాధారణంగా చీకట్లో బతుకుతాడు. మనం చీకట్లోనే పుట్టాం. వాస్తవానికి ఆరంభంలో చీకటి ప్రాథమిక అవసరం. తల్లి గర్భంలో చీకటి వుంటుంది. అది అవసరం. ఎందుకంటే శారీరకంగా ఎదిగే బిడ్డకు చీకటి ఆటంకం కాదు. పసిబిడ్డ మృదువుగా వుంటుంది. మెత్తగా వుంటుంది. అందువల్ల చుట్టు మృదువయిన చీకటి అవసరం.

తల్లి గర్భంలో బిడ్డ రోజుకు ఇరవయి నాలుగ్గంటలూ నిద్రపోతుంది. ఆ తొమ్మిది నెలలు బిడ్డ పెరుగుతుంది. అప్పుడు ఎట్లాంటి ఆటంకం కలగకూడదు. అలా అయితే శక్తి దారి తప్పుతుంది. ప్రతిదీ మొదట్లో చీకట్లో పెరుగుతుంది. నువ్వు విత్తనాన్ని భూమిలో పెడతావు. దానికి గర్భం అవసరం. భూమి గర్భం అవసరం. అక్కడ చీకటి వుంటుంది. బిడ్డ పుడతాడు. భౌతికంగా అతను కాంతిలోకి వస్తాడు. కానీ, ఆధ్యాత్మికంగా అతనింకా చీకట్లోనే వుంటాడు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment