శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 419 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 419 -2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 419 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 419 -2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀

🌻 419. 'జడాత్మికా’ - 2🌻


"ఈశ్వరః సర్వభూతానాం, హృద్దేశే తిష్ఠతి", "ఈశావాస్య మీదం జగత్”, “వాసుదేవ సర్వమితి" అను సూక్తులు సతతము ఆస్తిక జనులు వినుచునే యుందురు. పండితులు చెప్పుచునే యుందురు. కాని ఎవ్వరునూ ఆచరించరు. అట్టి ఆచరణ గలవారు కోటి కొక్కరుందురేమో! కేవలము యోగీశ్వరులే అట్లుండగలరు. వారే సమదర్శనులు. వారు జడమును అనాదరణ చేయరు. అందు కూడ దైవమున్నాడన్న ఎఱుక కలిగి యుందురు.

ఇటీవలి కాలమున రామకృష్ణ పరమహంస, మాస్టర్ ఇ.కె. అట్టి సమదర్శనమును ప్రదర్శించిరి. మరెందరో కూడా అట్లు యుండి యుండ వచ్చును. శ్రీమద్భగవద్గీత, భాగవతము అందించు సారాంశమిదియే. నామరూపాత్మకమైన జగత్తును నిరసింపక సమస్తమును దైవముగా చూచుట జడశక్తిః, జడాత్మికా అను నామముల నుండి గ్రహింప వచ్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 419 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika
Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻

🌻 419. 'Jadatmika' - 2🌻


Theistic people are constantly hearing the sayings like 'Ishvarah Sarvabhutanam, Hriddeshe Tishthati', 'Ishavasya Aamam Jagat', 'Vasudeva Sarvamiti'. Scholars keep saying them. But no one practices. There are probably only one in a millions who practice like that! Only yogis can be like that. They are the equanimous. They do not disrespect inertia. They believe that there is a God even in inertia.

In recent times Ramakrishna Paramahamsa, Master E.K. showed such equanimity. Others may be like that. Srimad Bhagavad Gita, Bhagavata provides the same essence. Seeing everything as divine without objecting to the nominal physical world can be understood from the names Jadashaktih and Jadatmika.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment