🍀 08, JANUARY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀

🌹🍀 08, JANUARY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 08, JANUARY 2023 SUNDAY, ఆదివారం, భాను వాసరే నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 308 / Bhagavad-Gita -308 🌹 7వ అధ్యాయము, జ్ఞాన విజ్ఞాన యోగము -28వ శ్లోకము.
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 155 / Agni Maha Purana - 155 🌹 🌻. చతుర్వింశతి మూర్తి స్తోత్రము - 2 / Adoration of twenty-four forms of Viṣṇu - 2 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 020 / DAILY WISDOM - 020 🌹 20. చేతనా మనస్సు అంతిమ అంశంగా పనిచేస్తుంది / 20. The Conscious Mind Acts as the Ultimate Subject 🌻*
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 285 🌹
6) 🌹. శివ సూత్రములు - 22 / Siva Sutras - 22 🌹 🌻 7. జాగ్రత్ స్వప్న సుషుప్త భేదే తుర్యాభోగ సంభవః. - 2 / 7. Jāgrat svapna suṣupta bhede turyābhoga sambhavaḥ. - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹08, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀. సూర్య మండల స్త్రోత్రం - 3 🍀*

3. యన్మండలం దేవగణైః సుపూజితం | 
విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |
తం దేవదేవం ప్రణమామి సూర్యం | 
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ 

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : దివ్యశక్తి నిర్ణయం అమలు కొరకు మన ఆత్మ నిత్య జాగరితమై వుండి, లోపల నుంచి గాని, బయట నుంచి గాని మనలను తప్పుదారి పట్టింప జూచే దివ్యేతర ప్రవృత్తులను ప్రతిఘటింప బూనుకోవాలి. 🍀* 

🌷🌷🌷🌷🌷

శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పౌష్య మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 07:08:35
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: పుష్యమి 30:06:12 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: వైధృతి 09:42:50 వరకు
తదుపరి వషకుంభ
కరణం: కౌలవ 07:07:34 వరకు
వర్జ్యం: 12:07:20 - 13:55:12
దుర్ముహూర్తం: 16:27:51 - 17:12:27
రాహు కాలం: 16:33:25 - 17:57:02
గుళిక కాలం: 15:09:48 - 16:33:25
యమ గండం: 12:22:33 - 13:46:10
అభిజిత్ ముహూర్తం: 12:00 - 12:44
అమృత కాలం: 22:54:32 - 24:42:24
సూర్యోదయం: 06:48:03
సూర్యాస్తమయం: 17:57:02
చంద్రోదయం: 19:09:50
చంద్రాస్తమయం: 07:52:25
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: శ్రీవత్స యోగం - ధన
లాభం , సర్వ సౌఖ్యం 30:06:12 వరకు
తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 308 / Bhagavad-Gita - 308 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 28 🌴*

*28. యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ |*
*తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతా: ||*

🌷. తాత్పర్యం :
*పూర్వజన్మము లందు, ప్రస్తుత జన్మము నందు పుణ్యకార్యములను చేయుచు పాపములను పూర్తిగ నశింప జేసికొనిన మనుజులు ద్వంద్వ మోహముల నుండి విడివడినవారై నా సేవ యందు దృఢవ్రతముతో నెలకొనెదరు.*

🌷. భాష్యము :
దివ్యమైన ఆధ్యాత్మికస్థితిని పొందుటకు అర్హతను కలిగినవారు ఈ శ్లోకమున పేర్కొనబడినవారు. పాపులు, నాస్తికులు, మూర్ఖులు, వంచకులైనవారికి కోరిక మరియు ద్వేషములనెడి ద్వంద్వములను దాటుటకు దుస్సాధ్యము. కేవలము ధర్మనియమాను సారముగా జీవనము గడుపుచు పుణ్యముగా వర్తించి పాపఫలమును నశింపజేసికొనినవారే భక్తిమార్గమును చేపట్టి క్రమముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని శుద్ధజ్ఞానమును పొందు స్థాయికి ఎదగగలరు. తదుపరి వారు క్రమముగా ఆ భగవానుని తలచుచు సమాధిమగ్నులు కాగలరు. ఆధ్యాత్మికస్థితి యందు నెలకొనుటకు ఇదియే సరియైన పద్ధతి. శుద్ధభక్తుల సంగమములో కృష్ణభక్తిరసభావన ద్వారా ఇట్టి ఉద్ధారము సాధ్యపడగలదు. మాహాభక్తుల సాంగత్యమున మనుజుడు భ్రాంతి నుండి విడివడుటయే అందులకు కారణము.

ఎవరేని నిజముగా ముక్తిని వాంఛించినచో భక్తులకు సేవను గూర్చవలెనని శ్రీమద్భాగవతము (5.5.2) నందు తెలుపబడినది (మహాత్సేవం ద్వారమాహు: విముక్తే: ). కాని భౌతికభావన కలిగిన కామ్యకర్మరతులతో సంగత్వము కలిగినవాడు తమస్సుకు చేరు మార్గమును చేపట్టినవాడగును (తమోద్వారం యోషితాం సంగిసంగమ్). కనుకనే బద్ధజీవులను భ్రాంతి నుండు తప్పించుటకే కృష్ణభక్తులు జగమంతటను సంచరించుచుందురు. శ్రీకృష్ణభగవానుని దాసత్వమనెడి తమ నిజస్థితిని మరచుటన్నది ఆ భగవానుని నియమమోల్లంఘనమని నిరాకారవాదులు ఎరుగజాలరు. కనుకనే మనుజుడు తన సహజస్థితియైన శ్రీకృష్ణుని దాసత్వమున తిరిగి నెలకొననంతవరకు ఆ భగవానుని అవగతము చేసికొనుట గాని, దృఢవ్రతముతో ఆ దేవదేవుని భక్తియుతసేవ యందు పూర్ణముగా నిలుచుట గాని సంభవింపదు.

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 308 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 7 - Jnana Yoga - 28 🌴*

*28. yeṣāṁ tv anta-gataṁ pāpaṁ janānāṁ puṇya-karmaṇām*
*te dvandva-moha-nirmuktā bhajante māṁ dṛḍha-vratāḥ*

🌷 Translation : 
*Persons who have acted piously in previous lives and in this life and whose sinful actions are completely eradicated are freed from the dualities of delusion, and they engage themselves in My service with determination.*

🌹 Purport :
Those eligible for elevation to the transcendental position are mentioned in this verse. For those who are sinful, atheistic, foolish and deceitful, it is very difficult to transcend the duality of desire and hate. 

Only those who have passed their lives in practicing the regulative principles of religion, who have acted piously, and who have conquered sinful reactions can accept devotional service and gradually rise to the pure knowledge of the Supreme Personality of Godhead. Then, gradually, they can meditate in trance on the Supreme Personality of Godhead. 

That is the process of being situated on the spiritual platform. This elevation is possible in Kṛṣṇa consciousness in the association of pure devotees, for in the association of great devotees one can be delivered from delusion.

It is stated in the Śrīmad-Bhāgavatam (5.5.2) that if one actually wants to be liberated he must render service to the devotees (mahat-sevāṁ dvāram āhur vimukteḥ); but one who associates with materialistic people is on the path leading to the darkest region of existence (tamo-dvāraṁ yoṣitāṁ saṅgi-saṅgam). All the devotees of the Lord traverse this earth just to recover the conditioned souls from their delusion. 

The impersonalists do not know that forgetting their constitutional position as subordinate to the Supreme Lord is the greatest violation of God’s law. 

Unless one is reinstated in his own constitutional position, it is not possible to understand the Supreme Personality or to be fully engaged in His transcendental loving service with determination.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 155 / Agni Maha Purana - 155 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 48*

*🌻. చతుర్వింశతి మూర్తి స్తోత్రము - 2🌻*

యుద్ధ కుశలుడైన ప్రద్యుమ్నుడు చక్ర-శంఖ-గదా-పద్మములను ధరించును. అనిరుద్ధుడు చక్రగదా శంఖపద్మములను అతుడు మనలను రక్షించుగాక. సురేశ్వరుడైన పురుషోత్తముడు చక్ర-కమల-శంఖ-గదలను ధరించును. అధోక్షజుడు పద్మ-గదా-శంఖ-చక్రములను ధరించును. అతడు ఘమ్ములను రక్షించుగాక. నృసింహుడు చక్ర- పద్మ - గదా - శంఖములను ధరించును. నేను అతనికి నమస్కరించుచున్నాను. 

గదా-పద్మ-చక్ర-శంఖములను ధరించు అచ్యుతుడు మిమ్ములను రక్షించుగాక. శంఖ-గదా-చక్ర-పద్మములను ధరించు, బాలవటుడైన వామనుడు, పద్మ-చక్ర-శంఖ-గదలను ధరించు జనార్దనుడు, శంఖ-గదా-చక్ర-గదలను ధరించు, యజ్ఞస్వరూపుడైన శ్రీహరి, శంఖ-గదా-పద్మ-చక్రములను ధరించు కృష్ణుడు నాకు భోగములను, మోక్షమును ప్రసాదించుగాక. 

  వాసుదేవుడు ఆదిమూర్తి. వాసుదేవుని నుండి సంకర్షణుడు ఆవిర్భవించెను. సంకర్షణుని నుంéడి ప్రద్యుమ్నడు, ప్రద్యుమ్నుని నుండి అనిరుద్ధుడు ఆవిర్భవించెను. వీరిలో ఒక్కరొక్కరు క్రమముగ కేశవాదిమూర్తి భేదమున మూడేసి రూపములలో ఆవిర్భవించిరి. (అనగా వాసుదేవుని నండి కేశవ - నారాయణ - మాధవమూర్తులు, సంకర్షణుని నుండి గోవింద- విష్ణు - మధుసూదనమూర్తులు, ప్రద్యుమ్నుని నుండి త్రివిక్రమ - వామన - శ్రీధరమూర్తులు, అనిరుద్ధుని నుండి హృషీకేశ - పద్మనాభ - దామోదరమూర్తులు ఆవిర్భవించినవి). ఇరువది నాలుగు మూర్తుల స్తోత్రముతో కూడిన ఈ ద్వాదశాక్షర స్తోత్రమును చదువువారును. వినువారును నిర్మలులై, సంపూర్ణ మనోరథములను పొందుదురు.

విశేషాంశము: ఈ స్తోత్రములో ఇరువది నాలుగు మూర్తుల స్వరూపముమ వర్ణించు మొదటి పండ్రెండు శ్లోకములలోని మొదటి అక్షరములను కలిపి చదివినోచో ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అను ద్వానశాక్షరి ఏర్పడును అందుచే దానికి "ద్వాదశాక్షరీ స్తోత్రము" అనియు, "చతుర్వింశతి మూర్తి స్తోత్రము" అనియు పేర్లు.

అగ్ని మహాపురాణము నందు చతుర్వింశతిమూర్తి స్తోత్రమను నలుబది ఎనిమిదివ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 155 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 48
*🌻Adoration of twenty-four forms of Viṣṇu - 2 🌻*

8. Lord Pradyumna is one who holds a mace, disc, conch and mace as well as a lotus. May Aniruddha, who wields the disc, mace, conch and lotus protect us.

9. May Puruṣottama, the Lord of celestials, who holds disc, lotus, conch and mace (protect you). May Adhokṣaja who wields lotus, mace, conch and disc protect you.

10. I salute that Lord Nṛsiṃha, who wields disc, lotus, mace and conch. May Acyuta, who holds mace, lotus, disc and conch, protect you all.

11. So also (may) Upendra, who is of the form of a child and (who holds) the disc and lotus, (protect you). And (may) Janārdana, who wields lotus, disc, conch and mace (protect you).

12. May Hari, who holds conch, lotus, disc as well as (mace) kaumodakī yield me enjoyment and emancipation. May Kṛṣṇa, who holds conch, mace, lotus and disc give enjoyment and emancipation.

13. The first manifestation was that of Vāsudeva. Then Saṅkarṣaṇa manifested. Pradyumna manifested from Saṅkarṣaṇa. Aniruddha appeared from Pradyumna.

14. Each one of the (above) forms was divided into three forms such as Keśava and others. One who reads or hears this hymn consisting of twelve letters on the twenty-four forms gets free from impurity and gets all things.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 20 / DAILY WISDOM - 20 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 20. చేతనా మనస్సు అంతిమ అంశంగా పనిచేస్తుంది 🌻*

*ఇప్పటి భౌతిక ప్రపంచం, దాని అవగాహన కేవలం సాపెక్షమైన విషయాల మీద ఆధార పడి ఉండటం వల్ల, సత్యం కాలేదు. దాని రూపం అవాస్తవమైనది. ఎందుకంటే రూపం అనేది విషయ వస్తువులపై కేంద్రీకరించ బడిన చైతన్యాల యొక్క ఊహా జనితం కాబట్టి. ఈ చైతన్యాల యొక్క మూలం విశ్వ మనస్సు. అది అనేక స్థాయిల అభివ్యక్తి లో ఈ సమస్త విషయ వస్తువులకు సృష్టికర్త.*

*ప్రపంచలో వ్యక్తమయ్యే ప్రతి పదార్థం, ఆ మాటకొస్తే వ్యక్తమయ్యే ప్రపంచం, అసలు వ్యక్తం అవడం అనే గుణం సైతం భ్రాంతికరమైనవి అని అర్థం చేసుకోవాలి. వ్యక్తమవడం భ్రాంతి కానీ పదార్థం భ్రాంతి కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 20 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 20. The Conscious Mind Acts as the Ultimate Subject 🌻*

*The world of objects in its presented state is false, being dependent on relative perceptions; its form is unreal because form is an imaginary construction of the objectified centres of consciousness in the universe driven by potent desire-impulses. The Cosmic Mind acts as the ultimate subject whose consciousness is the creator of all norms, in all the degrees of manifestation.*

*The worldness in what is manifested, or, in other words, the very act or process of manifestation itself, is to be construed in the sense of what is illusory, though the world-essence or the ultimate substance of the world is eternal. It is the form and not the essence that is unreal.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 285 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. వ్యక్తి నిరంతరం గానం చేసే స్థితిలో వుండాలి. ఏ క్షణమయినా సూర్యోదయం కావచ్చు. నువ్వు దాన్ని ఆహ్వానించాలి. స్వీకరించే గుణంతో వుండాలి. చురుగ్గా వుండాలి. 🍀*

*వ్యక్తి తన హృదయ రంద్రాల్ని తెరిచి అస్తిత్వాన్ని ఆహ్వానించిన స్థితికి పాట ప్రాధాన్యం వహిస్తుంది. పాట ప్రతీకాత్మకం. అది బాధ కాదు. పక్షులు ఉదయాన్నే పాట పాడుతాయి. అట్లా వ్యక్తి నిరంతరం గానం చేసే స్థితిలో వుండాలి. ఉదయాన్నే సూర్యోదయంలో ఉత్సాహంగా గానం చెయ్యడానికి సిద్ధంగా వుండాలి.*

*ఏ క్షణమయినా సూర్యోదయం కావచ్చు. నువ్వు దాన్ని ఆహ్వానించాలి. స్వీకరించే గుణంతో వుండాలి. చురుగ్గా వుండాలి. అతిథి ఏ సమయంలోనైనా రావచ్చు. పాట పాడే పక్షులు సూర్యుడికి ఆహ్వానం పలకడానికి సిద్ధంగా వుండాలి. పూలు విచ్చుకుంటాయి. గాలికి చెట్లు కదుల్తాయి. సమస్త ప్రపంచం సజీవంగా సంచలిస్తుంది. కొత్త రోజుని ఆహ్వానించడానికి సిద్ధపడుతుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 022 / Siva Sutras - 022 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 7. జాగ్రత్ స్వప్న సుషుప్త భేదే తుర్యాభోగ సంభవః. - 2 🌻*
*🌴. మెలకువ (జాగ్రత్), స్వప్న (స్వప్న), గాఢమైన నిద్ర (సుషుప్త) వంటి విభిన్న స్థితులలో కూడా నాల్గవ స్థితి తుర్య యొక్క పారవశ్యం, ఆనందం ఉంది. 🌴*

*ఒక వ్యక్తిలో ఆధ్యాత్మిక పరివర్తన జరిగినప్పుడు, భౌతిక అవగాహన మరియు ఆధ్యాత్మిక అవగాహన రెండూ కలిసే స్థానం ఉంటుంది. ఆ స్థానం నుండి, ఆధ్యాత్మిక మార్గంలో పైకి కదలిక ప్రారంభమైనప్పుడు, ఒకరి అహం కరిగి పోతుంది. ధ్యానంలో ఖచ్చితంగా సాధించ వలసినది ఇదే. అహం తొలగిపోవడం ప్రారంభించి నప్పుడు, అది ఆత్మ యొక్క సార్వత్రిక వైఖరికి దారి తీస్తుంది.*

*బ్రహ్మం యొక్క సర్వవ్యాప్త స్వభావం యొక్క జ్ఞానం వికసించడం ప్రారంభించినప్పుడు చైతన్యం యొక్క నాల్గవ దశ చైతన్యం యొక్క ఇతర మూడు ప్రాపంచిక దశలలో ప్రబలంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఒకరు అజ్ఞానం వల్ల అహంకారంతో కట్టుబడి ఉంటారు. అహంకారం కరిగిపోవడం ప్రారంభించినప్పుడు, అజ్ఞానం యొక్క బలం కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది, ఆత్మ యొక్క సాక్షాత్కారానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ పరివర్తన తురీయ దశలో జరుగుతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 022 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 7. Jāgratsvapnasuṣuptabhede turyābhogasambhavaḥ. - 2 🌻*
*🌴. During different states of consciousness as waking (jāgrat), dreaming (svapna), profound sleep (suṣupta), there is the delight and enjoyment of the Fourth State (turya) 🌴*

*When spiritual transformation happens in a person, there is a meeting point between the material awareness and the spiritual awareness. Beginning from that point, when the upward movement in the spiritual path really begins, one’s ego begins to dissolve. When ego begins to fade away, it leads to universal attitude of the soul, when the knowledge of the omnipresent nature of the Brahman begins to unfold. This is what is to be precisely practiced in meditation.*

*The fourth stage of consciousness continues to prevail in the other three mundane stages of consciousness, as one is bound by ajñānā (ignorance) and consequent eogtism. When ego begins to get dissolved, the spell of ajñānā also begins to fade away, paving the way for the realisation of the Self. This transformation happens in the stage of turya.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

No comments:

Post a Comment