శ్రీ మదగ్ని మహాపురాణము - 163 / Agni Maha Purana - 163
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 163 / Agni Maha Purana - 163 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 50
🌻. దేవీ ప్రతిమా లక్షణములు - 3 🌻
లక్ష్మి (వైష్ణవీ శక్తి) కుడిచేతులలో చక్ర-శంఖములను, ఎడమ చేతులలో గదా కమలములను ధరించును. వారాహీ శక్తి మహిషముపై ఎక్కి దండ-శంఖ-చక్ర-గదలను ధరించును. ఐంద్రీశక్తి సహస్ర నేత్రములు గలది. ఐరావతముపై ఎక్కి వజ్రము ధరించి యుండును. ఐంద్రీదేవీ పూజ వలన కార్యసిద్ధి లభించును. చాముండ కండ్లు చెట్టు తొఱ్ఱలవలె లోతుగా ఉండును. శరీరము మాంసరహితమై అస్థి పంజరమువలె నుండును. నేత్రములు మూడు. మాంసహీనమగు శరీరమునందు ఆస్థులు మాత్రమే సారముగ మిగిలియుండును జుట్టుపైకి లేచి ఉండును. అణగి ఉండదు. ఏనుగు చర్మమును ధరించును. ఎడమ చేతులలో కపాలము, పట్టిశము, కుడిచేతులలో శూలము, ఖడ్గము ఉండును శవముపై ఎక్కి ఎముకల ఆభరణములు ధరించును.
వినాయకుని ఆకారము మనుష్యా కారసకదృశముగా నుండును. పొట్ట చాల పెద్దది. ముఖము ఏనుగల ముఖము; తొండము చాల పొడవుగా నుండును. యజ్ఞోపవీతము ధరించి యుండును. ముఖము వెడల్పు ఏడుకళలు. తొండము పొడవు ముప్పదియారు అంగుళములు నాడి (కంఠముపై నున్న ఎముక) విస్తారము పండ్రెండు కళలు, మెడ ఒకటిన్నర కళల ఎత్తు ఉండును. కంఠప్రదేశము విస్తారము ముప్పదియారు. అంగుళములు. గుహ్య ప్రదేశము ఒకటిన్నర అంగుళములు. నాభి-ఊరుపుల విస్తారము పండ్రెండు అంగుళములు. కాళ్లు, పాదాల ప్రమాణము కూడ ఇంతయే. కుడి చేతులలో తన దంతమును, పరుశువును. ఎడమచేతులలో లడ్డు, నల్లకలువ ధరించి యుండును.
మయూరారూఢడై ఉన్న కుమారస్వామికి ఇరువైపుల సుముఖీ, బిడాలాక్షి అనుమాతృకలును, శాఖ-విశాఖులను అనుజులనును నిలచి యుందురు. రెండు హస్తములు, బాలరూపము, కుడిచేతిలో శక్తి, ఎడమ చేతిలో కోడి ఉండును. ముఖములు ఒకటి కాని, ఆరుకాని నిర్మింపవచ్చును. గ్రామములోని విగ్రహమునకు ఆరు లేదా పండ్రెండు హస్తములుండవలెను. వనము నందు స్థాపించు విగ్రహమున మాత్రము రెండు భుజములే ఉండవలెన. ఆరు కుడి భుజములలో శక్తి బాణ-పాశ-ఖడ్గ-గదా-తర్జనీ ముద్రలును, ఎడమ చేతులలో నెమలి పింఛము, ధనస్సు, ఖేటము, పతాక, అభయముద్ర, కుక్కటము ఉండవలెను. రుద్రచర్చిక గజచర్మధరించి ఎడమ చేతిలో కాపాలము, కర్తరి ధరించి, కుడి చేతిలో శూల-పాశములను ధరించి, ముఖమును. ఒక పాదమును ఎత్తి ఉండును. ఈ దేవి అష్ట భూజారూపమున గూడ పూజింపబడును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 163 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 50
🌻Characteristics of an image of the Goddess - 3 🌻
20. (The form of) Lakṣmī should hold the disc, and conch in the right (hand) (and) the mace and lotus in the left (hand). (The form of) Vārāhī should be mounted on the buffalo and hold the stick, conch, sword and goad.
21-25. (The image of) Aindrī conferring success should be represented as having thousand eyes and holding the thunderbolt in the left hand.
Cāmuṇḍā may have three eyes deeply sunken, a skeleton form devoid of flesh, erectly standing hair, emaciated belly, clad in tigerskin and holding a skull and spear in the left hand and a trident and scissor in the right standing on the dead body of a man and wearing a garland of bones. (The image of) Vināyaka should have a human body, big belly, elephant face, big trunk and sacred thread. The mouth measuring 7 kalās in breadth while the trunk should measure 36 finger-breadths in length. The neck should be 12 kalās in girth and 10 kalās in height. The throat-region should be 36 finger (in length). The space about the region of anus should have the breadth of half a finger.
26. (The region of) the navel and thigh should be of twelve (fingers) as also the leg from the ankle to the knee and the feet. He should be represented as holding his own tusk made into an axe in the right hand and the laḍḍuka (a ball of sweet) and lotus flower in the left.
27. (The image of) Skanda, the lord (of the universe) also known as Śākha and Viśākha, (is represented) as a boy possessing two arms and riding a peacock (with the images of) Sumukhī and Viḍālākṣī[2].
28-29. The god may be represented as having a single face or six faces, six hands or twelve hands carrying the spear and a cock in the right hand. In the village or the forest (it should have) two arms. (He should bear) the spear, arrow, noose, nistriṃśa (sword), goad and tarjanī (a kind of weapon) in the six right hands and the spear in the left hand.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment