నిర్మల ధ్యానాలు - ఓషో - 292


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 292 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. వాస్తవంతో వుంటే బాధ వుండదు. ఆనందం వుంటుంది. నీ సంకల్పాన్ని వదిలిపెడితే నువ్వు సంపన్నుడవుతావు. అప్పుడు అనంతమే నీతో వుంటుంది. సమస్తమూ మనతో సాహచర్యం చేస్తే మనం విజేతలం అవుతాము. 🍀

మనం ప్రత్యేకమైన వునికితో వున్నట్లు నమ్ముతాం. అది నమ్మకమే. వాస్తవం కాదు. నమ్మకం వాస్తవానికి వ్యతిరేకంగా వెళితే అది బాధలు సృష్టిస్తుంది. కారణం మనం కారణం కాని దాన్ని పట్టుకుంటాం. వాస్తవంతో వుంటే బాధ వుండదు. ఆనందముంటుంది. ఆకు తనకు ప్రత్యేకత వుందని భావిస్తే అది వేరవుతుంది. దానికి చెట్టుతో సంబంధం లేదు. అప్పుడు సమస్య వస్తుంది. ఘర్షణ మొదలవుతుంది. దాని శక్తి కేంద్రం నించీ వేరవుతుంది. చెట్టు అకుకు తల్లి. అంతే కాదు దాని వేళ్ళు భూమిలో వున్నాయి. అది సమస్త భూమికి ప్రాధాన్యం వహిస్తుంది. అది గాలిని పీలుస్తుంది. దానికి సూర్యుడితో, నక్షత్రాలతో సంబంధముంది.

చెట్టుతో ఘర్షించడమంటే విశ్వంతో ఘర్షించడం. చిన్ని ఆకు అనంత విశ్వంతో ఘర్షించడం. ఆ వుద్దేశమే తెలివితక్కువది. మనిషి చేస్తున్నదదే. నదిని పక్కకు తోయడానికి ప్రయత్నిస్తున్నాడు. సన్యాసమంటే నదిలో ఘర్షించడం మానెయ్యడం. నదితో సాగడం. నదిని నిన్ను స్వీకరించడానికి అనుమతించడం. ఘర్షించకుండా సాగడాన్ని గ్రహించడం. సన్యాసత్వానికి అర్ధమది. 'ఆమోదించి సాగడమే' దాని కర్థం. నీ సంకల్పాన్ని వదిలిపెడితే నువ్వు సంపన్నుడవుతావు. అప్పుడు అనంతమే నీతో వుంటుంది. సమస్తమూ మనతో సాహచర్యం చేస్తే మనం విజేతలం అవుతాము.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment