శ్రీ శివ మహా పురాణము - 666 / Sri Siva Maha Purana - 666
🌹 . శ్రీ శివ మహా పురాణము - 666 / Sri Siva Maha Purana - 666 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 18 🌴
🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 4 🌻
బ్రహ్మ (నేను), పార్వతి, సమస్త దేవతలు మరియు సమస్త గణములు పరమానందముతో ఆయనను పూజించిరి (26). బ్రహ్మ, విష్ణువు, ఇతర దేవతలందరు కలిసి పార్వతిని ఆనందింప జేయుట కొరకై ఆమెతో ఆ గణేశుడే సర్వాధ్యక్షుడని విన్నవించిరి (27). మిక్కిలి ప్రసన్నమైన మనస్సు గల శివుడు సర్వకాలముల యందు సుఖము నిచ్చే అనేకవరములను గణేశునకు మరల ఇచ్చెను (28).
శివుడిట్లు పలికెను -
ఓ పార్వతీ పుత్రా! నేను సంతసించితిని. సందేహము లేదు.నేను సంతసించినచో జగత్తు సంతసించును. విరోధులు ఎవ్వరూ ఉండరు (29). నీవు శక్తి పుత్రుడవు. గొప్ప తేజశ్శాలివి. నీవు బాలుడవే అయిననూ మహా పరాక్రమమును ప్రదర్శించితివి గాన, సర్వదా సుఖముగా నుండుము (30).
విఘ్నములను పోగొట్టుటలో నీ పేరు ప్రసిద్ధి గాంచును. నీవు నా గణములన్నింటికి అధ్యక్షుడవై పూజలను గైకొనుము (31). శంకరుడిట్లు పలికి వెంటనే పూజా విధిని నిర్ణయించి, అనేకములగు ఆశీర్వచనములను గణేశునకు పలికెను (32).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 666🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 18 🌴
🌻 Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 4 🌻
26. I, Brahmā, and Pārvatī too worshipped him. He was then worshipped by all the gods and Gaṇas with great joy.
27. In order to gratify Pārvatī, Gaṇeśa was proclaimed as the presiding officer by all, Brahmā, Viṣṇu, Śiva and others.
28. Again, with a joyful mind, several boons were granted by Pārvatī to him, always favourable to all in the world.
Śiva said:—
29. “O son of Pārvatī, I am pleased, there is no doubt about it. When I am pleased the entire universe is pleased. None will be against the same.
30. Since, even as a boy you showed great valour as Pārvatī’s son, you will remain brilliant and happy always.
31. Let your name be the most auspicious in the matter of quelling obstacles. Be the presiding officer of all my Gaṇas and worthy of worship now.”
32. After saying this, Śiva laid down several modes of worship and granted benedictions instantaneously.
Continues....
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment