విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 709 / Vishnu Sahasranama Contemplation - 709


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 709 / Vishnu Sahasranama Contemplation - 709🌹

🌻709. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ🌻

ఓం వాసుదేవాయ నమః | ॐ वासुदेवाय नमः | OM Vāsudevāya namaḥ

ఇదం జగత్ వాసయత్యాచ్ఛాదయతి మాయయాయ ।
ఇతి వాసుస్సదేవోఽయం వాసుదేవ ఇతీర్యతే ॥

ఛాదయామి జగద్విశ్వం భూత్యా సూర్య ఇవాంశుభః ।
ఇతిహి శ్రీవ్యాసముని భగవద్వాక్య సంస్మృతేః ॥

తన మాయచే జీవులను వాసించును లేదా కప్పివేయునుగనుక వాసుః. అట్టివాడేయగు దేవుడు వాసుదేవుడు. మహాభారత శాంతి పర్వమునందలి 'నేను నా భూతిచే అనగా మాయచే సూర్యుడు తన కిరణములచేత వలె సర్వజగత్తును కప్పివేయుదును' అను భగవద్ వచనము ఇందులకు ప్రమాణము.


:: విష్ణు పురాణే షష్ఠాంశే పంచమోఽధ్యాయః :

భూతేషు వసతే సోఽన్తర్వసన్త్యత్ర చ తాని యత్ ।
ధాతా విధాతా జగతాం వాసుదేవస్తతః ప్రభుః ॥ 82 ॥

ప్రభువు సమస్త భూతములయందును వ్యాపించి, సర్వభూతములును తనయందే వసించియున్నవాడు. సంసార రచయితయు, రక్షకుడును అయి ఉన్నందున ఆ ప్రభువు వాసుదేవుడని పిలువబడుచున్నాడు.

ఏది నేత్రములులకు గోచరించదో, ఏది స్పర్శేంద్రియము చేత స్పృశించ శక్యము కాదో, ఏది ఘ్రాణేంద్రియము ద్వారా ఘ్రాణమునకు (ముక్కు, వాసన) దొరకదో, ఏది రసేంద్రియమునకు అందక అతీతముగనుండునో, దేనిపై సత్త్వ రజస్ తమస్సులనబడు త్రిగుణముల ప్రభావము ఉండదో, అది సర్వవ్యాపియో సాక్షియై ఉండి సంపూర్ణ జగత్తుయొక్క ఆత్మగా తెలియబడుచున్నది. అన్ని ప్రాణులు నశించినప్పటికి ఏదైతే తాను స్వయముగా నశ్వరము కాదో, ఏది 'అజన్మా,' 'నిత్యము,' 'సనాతనము,' 'నిర్గుణము,' 'నిష్కలంకము'గా చెప్పబడుచున్నదో, ఏది ఇరువదినాలుగు తత్త్వములకు అతీతమై ఇరువదిఐదవ తత్త్వముగా విఖ్యాతినొందినదో, ఏది నిష్క్రియమో, దేనిని పురుషుడు అని పిలిచెదరో, జ్ఞానమయ నేత్రములచేత మాత్రమే ఏది ఎరుంగ యోగ్యమై యుండునో, దేనియందు ప్రవేశించిన ద్విజులు ముక్తులౌదురో అదే సనాతన పరమాత్మ. దానినే వాసుదేవ నామముతో ఎరుంగ వలయును.

332. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

695. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 709🌹

🌻709. Vāsudevaḥ🌻

OM Vāsudevāya namaḥ

इदं जगत् वासयत्याच्छादयति माययाय ।
इति वासुस्सदेवोऽयं वासुदेव इतीर्यते ॥

छादयामि जगद्विश्वं भूत्या सूर्य इवांशुभः ।
इतिहि श्रीव्यासमुनि भगवद्वाक्य संस्मृतेः ॥


Idaṃ jagat vāsayatyācchādayati māyayāya,
Iti vāsussadevo’yaṃ vāsudeva itīryate.

Chādayāmi jagadviśvaṃ bhūtyā sūrya ivāṃśubhaḥ,
Itihi śrīvyāsamuni bhagavadvākya saṃsmr‌teḥ.

He conceals or covers the worlds by māya therefore Vāsuḥ. He devaḥ, too and hence He is Vāsudevaḥ. 'I envelop the entire world as he sun by his rays' mentioned in Mahābhārata Śānti Parva can be a reference here.


:: विष्णु पुराणे षष्ठांशे पञ्चमोऽध्यायः :

भूतेषु वसते सोऽन्तर्वसन्त्यत्र च तानि यत् ।
धाता विधाता जगतां वासुदेवस्ततः प्रभुः ॥ ८२ ॥


Viṣṇu Purāṇa - Section 6, Chapter 5

Bhūteṣu vasate so’ntarvasantyatra ca tāni yat,
Dhātā vidhātā jagatāṃ vāsudevastataḥ prabhuḥ. 82.

The Lord is all pervading; He permeates all the elements and beings and all these are sheltered in Him. Since He is the creator and the protector of the worlds, the Lord is known as Vāsudevaḥ.

332. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

695. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।
र्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।
దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥

Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,
Darpahā darpado’dr‌pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

No comments:

Post a Comment