DAILY WISDOM - 24 - 24. The Perception of Unity . . . / నిత్య ప్రజ్ఞా సందేశములు - 24 - 24. ఐక్యత యొక్క అవగాహన . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 24 / DAILY WISDOM - 24 🌹

🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 24. ఐక్యత యొక్క అవగాహన అమరత్వ స్థితికి దారితీస్తుంది 🌻

లోపభూయిష్టమైన అంతర్గత సాధనాల వల్ల, అడ్డుపడే మానసిక స్థితుల వల్ల సత్యం సత్యంగా ప్రకాశించదు. ఈ పరిమితులను అధిగమిస్తే ఇంకా విస్తారమైన వాస్తవికత, గొప్ప స్వేచ్ఛ మరియు పూర్తి జీవితానికి దారితీస్తుంది. ప్రతి జీవిలో శాశ్వతంగా ఉండాలని, అన్ని విషయాలను తెలుసుకోవాలని, ప్రతిదానిపై ఆధిపత్యం చెలాయించాలని మరియు అత్యున్నత ఆనందాన్ని అనుభవించాలని ఒక సాధారణ కోరిక మరియు ప్రేరణ ఉంటాయి.

ఏకత్వాన్ని గుర్తించకపోవడం( ద్వైతం) స్వీయ వినాశనానికి దారితీసే మార్గం అని ఉపనిషత్తులు ఉద్ఘాటిస్తాయి. ఏకత్వాన్ని అనుభూతి చెందడంతో అత్యున్నత స్థితికి చేరుకుంటారు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 24 🌹

🍀 📖 The Realisation of the Absolute 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 24. The Perception of Unity Leads to the State of Immortality 🌻


Truth does not shine as Truth, owing to the inner instruments, the clogging psychological modifications. The crossing the barrier of these limiting adjuncts seems to lead one to a vaster reality, greater freedom and fuller life. There is a common desire-impulse in every being to exist forever, to know all things, to domineer over everything, and to enjoy the highest happiness.

The statement of the Upanishads that the cognition of manifoldness is the path leading to self-destruction is adorned by the supreme exhortation that the perception of Unity leads to the exalted state of Immortality.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹




No comments:

Post a Comment