నిర్మల ధ్యానాలు - ఓషో - 309


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 309 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రేమ అన్నది నీకు కొత్త కోణాన్ని యిస్తుంది. అది నిన్ను మరింత సౌందర్యభరితంగా మారుస్తుంది. నీకు తెలియని యితర విషయాల పట్ల నీకు స్పృహ కలిగిస్తుంది. మనుషుల ప్రతి చలనం పట్ల నిన్ను చైతన్యవంతుణ్ణి చేస్తుంది. 🍀


ప్రేమ కవిత్వానికి చెందిన అత్యున్నతరూపం. కవిత్వమంటే కవితలు రాయడం కాదు. కవిత్వ జీవితాన్ని అనుభవించనివాడు కూడా కవిత్వం రాయవచ్చు. కవితల్ని రాయడానికి టెక్నిక్ అవసరం. అతను టెక్నీషియన్ కావచ్చు. కవి కావాల్సిన పన్లేదు. వందమంది కవుల్లో తొంభయి తొమ్మిది మంది టెక్నిషియన్లే. అది ప్రతి కళకీ వర్తిస్తుంది. చిత్రకారులు, శిల్పులు యిలా అందర్లో వంద మందిలో తొంభయి తొమ్మిది మంది టెక్నీషియన్లే.

నిజమైన కవి కవితలు రాయాల్సిన పన్లేదు. అతను రాయవచ్చు. రాయకపోవచ్చు. చిత్రకారుడు, శిల్పి తదితర కళాకారులూ అంతే. వాళ్ళు రాగరంజితమయిన జీవితాల్తో వెలిగిపోతారు. శిల్పం శిల్పిగా, సంగీతం సంగీతకారుడిగా, చిత్రకళ చిత్రకారుడుగా మారతాయి. కళలో జీవించడమంటే అదే. నేను ప్రేమ అన్నది కవిత్వం అనడంలో అర్థమది. అది నీకు కొత్త కోణాన్ని యిస్తుంది. అది నిన్ను మరింత సౌందర్యభరితంగా మారుస్తుంది. నీకు తెలియని యితర విషయాల పట్ల నీకు స్పృహ కలిగిస్తుంది. మనుషుల ప్రతి చలనం పట్ల నిన్ను చైతన్యవంతుణ్ణి చేస్తుంది. ప్రతివ్యక్తిలో అసాధారణ ప్రతిభ వుంది. ప్రతిమనిషి ఒక గొప్ప కథ, గొప్ప నవల ప్రతిమనిషి తనకు తను ఒక ప్రపంచం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment