శ్రీ మదగ్ని మహాపురాణము - 182 / Agni Maha Purana - 182


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 182 / Agni Maha Purana - 182 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 56

🌻. దశదిక్పతియాగ ము - 2 🌻

ఉంగరములు మొదలగు ఆభరణములిచ్చి, ప్రార్థించి మూర్తిపాలకులగు విద్వాంసులను సత్కరించి వారిని చతురస్రములు, అర్ధచంద్రాకారములు, గోలాకారములు, లేదా పద్మసదృశములు అగు కుండములపై కూర్చుండ పెట్టవలెను. పూర్వాది దుక్కులతోరణములకు అశ్వత్థ-ఉదుంబర-వట-ప్లక్షదారువులను ఉపయోగింపవలెను. తూర్పుద్వారమునకు 'సుశోభన' మని పేరు. దక్షిణద్వారము 'సుభద్రము' , పశ్చిమద్వారము 'సుకర్మ' ఉత్తరద్వారము' సుహోత్రము'. ఆ తోరణస్తంభములన్నియు ఐదుహస్తుముల ఎత్తు ఉండవలెను. వీటిని స్థాపించి "స్యోనా పృథివీనో" అనే మంత్రముచే పూజించవలెను. తోరణస్తంభముల మూల భాగములందు మంగళకరమైన చూత పల్లవ - యవాంకురాద్యంకురములున్న కలశలు స్థాపింపవలెను. తోరణస్తంభముపై సుదర్శన చక్రము స్థాపింపవలెను. నేర్పుగల విద్వాంసుడు ఐదు అడుగుల ఐదు హస్తముల ధ్వజముకూడ స్థాపింపవలెను. దీన వెడల్పు పదునారు అంగుళములుండవలెను. ఓ సురశ్రేష్ఠా! ఆ ధ్వజదండము ఏడుహస్తముల ఎత్తు ఉండవలెను. పూర్వాది దిశలందు ధ్వజములపై అరుణవర్ణము, అగ్ని (ధూమ్రవర్ణము), కృష్ణ-శుక్ల-పీత-రక్త-శ్వేత వర్ణములు ఉండవెలను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 182 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 56

🌻Five divisions of installation - 2 🌻

6. The expert idol-worshippers should be established in front of each pit (intended for the rite). (They should be endowed) with rings, bracelets and other things.

7. Logs of the pippala, udumbara, vaṭa trees (should be planted) at the doorways of the place for the sake of arches. The place may be quadrangular, semi-circular, circular or lotusshaped.

8. Log of the fig tree should adorn the east, of the subhadra the south, of the sukarma and suhotra the northern and western doorways respectively.

9. The pitchers having young sprouts of mango trees should be placed five cubits apart at the toot of each one of the supporting columns of the arches and be worshipped with the sacred syllables syonā pṛthivī[1].

10. The sudarśana (disc of Viṣṇu) should be placed at the top. A wise man has to make the banner five cubits long.

11-12. It should be made sixteen fingers broad. O excellent among the celestials! the height should be seventeen cubits in the alternative. The pit should be duly reddish, flame-coloured,. black, white, yellow, deep red, white and (again) white..


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment