నిర్మల ధ్యానాలు - ఓషో - 314
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 314 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రయాణం ప్రేమతో మొదలవుతుంది. జ్ఞానోదయంతో అంతమవుతుంది. మన సొంత సంకల్పం, సొంత విధి విధానం అంటూ ఏమీ లేదు. అంతా మన సంకల్పం, మన విధానం అనడంలోనే దుఃఖమంతా వుంది. ప్రార్ధన అంటే మానవ సంకల్పంలోని నిషఫలతని గుర్తించడం. 🍀
మనమీ అనంత సముద్రంలో భాగాలం. కానీ చిన్ని అలలం. అక్కడ మన సొంత సంకల్పం, సొంత విధి విధానం అంటూ ఏమీ లేదు. అంతా మన సంకల్పం, మన విధానం అనడంలోనే దుఃఖమంతా వుంది. ప్రార్ధన అంటే మానవ సంకల్పంలోని నిష్ఫలతని గుర్తించడం. అనంత సంకల్పానికి అవనతుడయినవాడు 'అంతా నీ యిష్టప్రకారమే జరుగుతుంది. నీ రాజ్యమే నెలకొల్పబడుతుంది' అంటాడు.
అస్తిత్వం పైన అపార ప్రేమ వున్నపుడే అది వీలవుతుంది. అందువల్ల నేను ప్రయాణం ప్రేమతో మొదలవుతుంది. జ్ఞానోదయంతో అంతమవుతుంది. అంటాను. ఆ మధ్యలో వున్నది ప్రార్థనే. ఏది ఎలా సాగితే అలా సాగనీ అన్న భావనే.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment