✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 06 🌴
06. యథాకాశస్థితో నిత్యం వాయు: సర్వత్రగో మహాన్ |
తథా సర్వాణి భూతాని మత్థ్సానీత్యుపధారయ ||
🌷. తాత్పర్యం :
సర్వత్రా వీచునట్టి ప్రచండవాయువు సదా ఆకాశము నందే స్థితిని కలిగియుండునట్లు, సృజింపబడిన సమస్తజీవులు నా యందు స్థితిని కలిగియున్నవని గ్రహింపుము.
🌷. భాష్యము :
బ్రహ్మాండమైన విశ్వము ఏ విధముగా శ్రీకృష్ణభగవానునిపై ఆధారపడియున్నదో తెలియుట సామాన్యమానవునికి దాదాపు ఊహాతీత విషయము. కాని మన అవగాహనకు తోడ్పడు ఉపమానము నొకదానిని భగవానుడు ఒసగుచున్నాడు. మనము ఊహింపగలిగిన వానిలో అత్యంత ఘనమైనది ఆకాశము. అట్టి ఆకాశమున వాయువే అతి గొప్పదైనది. అది ప్రతిదాని చలనమును పభావితము చేయగలదు. ఆ విధముగా వాయువు అతిఘనమైనను ఆకాశమునందే స్థితిని కలిగియుండును. అది ఆకాశపరధిని దాటక దాని యందే ఒదిగియుండును. అదేవిధముగా అధ్భుతమైన సృష్టులన్నియును శ్రీకృష్ణభగవానుని సంకల్పము చేతనే స్థితిని కలిగియుండి అతనికి లోబడి వర్తించును. సాధారణముగా చెప్పబడునట్లు భగవానుని ఆజ్ఞ లేనిదే తృణము కూడా కదలదు. అనగా ఆ భగవానుని సంకల్పము చేతనే సమస్తము నడుచుచున్నది.
అతని సంకల్పము చేతనే సర్వము సృష్టింపబడి, పోషింపబడి, అంత్యమున నశించిపోవుచున్నది. అయినను వాయువు యొక్క కార్యకలాపములకు ఆకాశము అతీతముగా నున్నట్లు, శ్రీకృష్ణభగవానుడు సమస్తము నుండి వేరుగా నున్నాడు. “భగవానుని భయము చెట్నీ వాయువు వీచుచున్నది” అని తైత్తరీయోపనిషత్తు (2.81) నందు తెలుపబడినది (యద్భీషా వాత: పవతే). అదే విధముగా బృహదారణ్యకోపనిషత్తు (3.8.9) నందు కూడా “దేవదేవుని నేతృత్వములో అతని దివ్య శాసనము చేతనే సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహములు చలించుచున్నవి” యని తెలుపబడినది ( ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యచంద్రమసౌ విధ్రుతౌ తిష్టత ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ద్యావాపృథివ్యౌ విద్రుతౌ తిష్టత: ).
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 344 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 06 🌴
06 . yathākāśa-sthito nityaṁ vāyuḥ sarvatra-go mahān
tathā sarvāṇi bhūtāni mat-sthānīty upadhāraya
🌷 Translation :
Understand that as the mighty wind, blowing everywhere, rests always in the sky, all created beings rest in Me.
🌹 Purport :
For the ordinary person it is almost inconceivable how the huge material creation is resting in Him. But the Lord is giving an example which may help us to understand. The sky may be the biggest manifestation we can conceive. And in that sky the wind or air is the biggest manifestation in the cosmic world. The movement of the air influences the movements of everything. But although the wind is great, it is still situated within the sky; the wind is not beyond the sky. Similarly, all the wonderful cosmic manifestations are existing by the supreme will of God, and all of them are subordinate to that supreme will. As we generally say, not a blade of grass moves without the will of the Supreme Personality of Godhead.
Thus everything is moving under His will: by His will everything is being created, everything is being maintained, and everything is being annihilated. Still He is aloof from everything, as the sky is always aloof from the activities of the wind. In the Upaniṣads it is stated, yad-bhīṣā vātaḥ pavate: “It is out of the fear of the Supreme Lord that the wind is blowing.” (Taittirīya Upaniṣad 2.8.1) In the Bṛhad-āraṇyaka Upaniṣad (3.8.9) it is stated, etasya vā akṣarasya praśāsane gārgi sūrya-candramasau vidhṛtau tiṣṭhata etasya vā akṣarasya praśāsane gārgi dyāv-āpṛthivyau vidhṛtau tiṣṭhataḥ. “By the supreme order, under the superintendence of the Supreme Personality of Godhead, the moon, the sun, and the other great planets are moving.”
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment