🍀🌹 04, APRIL 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 04, APRIL 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 350 / Bhagavad-Gita - 350 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 12 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 197 / Agni Maha Purana - 197 🌹 🌻. అధివాసనము - 4 / Preliminary consecration of an image (adhivāsana) - 4 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 062 / DAILY WISDOM - 062 🌹 🌻 2. వస్తువులను ఎవ్వరూ స్వాధీనం చేసుకోలేరు. / 2. Things Cannot be Possessed by Anyone 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 327 🌹
6) 🌹. శివ సూత్రములు - 64 / Siva Sutras - 64 🌹
🌻. 20. భూత సంధాన భూత పృథక్త్వా విశ్వ సంఘటః - 3 / 20. Bhūta sandhāna bhūta pṛthaktva viśva saṃghaṭṭāḥ - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 04, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*🍀. మహావీర జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Mahavir Jayanti to All 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మహావీర జయంతి Mahavir Jayanti🌻*
*🍀. అపరాజితా స్తోత్రం - 12 🍀*
*25. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా |*
*నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః*
*26. యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా |*
*నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : అంతర్ముఖ బహిర్ముఖత్వాలు - ఏకాంతంగా ప్రశాంత చిత్తుడపై ఉన్నప్పుడే అంతర్ముఖుడవై లోనికి చొరబారి ఏకాగ్రతాసాధన చెయ్యి. బయటి శబ్దాలు నీ ఏకాగ్రతకు భంగం కలిగించ రాదు. ఆ ఏకాగ్రత నుండి హఠాత్తుగా బహిర్ముఖుడవయ్యే యెడల, కొంచెము సేపు ఒక విధమైన గుండెదడ మొదలైనవి నీకు కలుగవచ్చు. అందుచే బహిర్ముఖుడవై కనులు తెరిచేముందు కొలది క్షణాలు ప్రశాంతుడవై వుండడం మంచిది. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
చైత్ర మాసం
తిథి: శుక్ల త్రయోదశి 08:06:47
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 09:37:56
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: వృధ్ధి 27:39:27 వరకు
తదుపరి ధృవ
కరణం: తైతిల 08:04:48 వరకు
వర్జ్యం: 17:20:48 - 19:03:52
దుర్ముహూర్తం: 08:36:57 - 09:26:21
రాహు కాలం: 15:24:32 - 16:57:10
గుళిక కాలం: 12:19:16 - 13:51:54
యమ గండం: 09:14:00 - 10:46:38
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:43
అమృత కాలం: 02:37:48 - 04:22:36
మరియు 27:39:12 - 29:22:16
సూర్యోదయం: 06:08:45
సూర్యాస్తమయం: 18:29:47
చంద్రోదయం: 17:05:38
చంద్రాస్తమయం: 05:01:12
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: ధూమ్ర యోగం - కార్య
భంగం, సొమ్ము నష్టం 09:37:56 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 350 / Bhagavad-Gita - 350 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 12 🌴*
*12. మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతస: |*
*రాక్షసీమాసురీం చైవ ప్రకృతిమ మోహినీం శ్రితా: ||*
🌷. తాత్పర్యం :
*ఆ విధముగా మోహపరవశులైన వారు దానవ, నాస్తికభావములచే విమోహితులగుదురు. అట్టి భ్రాంతస్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞానసముపార్జన లన్నియును వ్యర్థములగును.*
🌷. భాష్యము :
*తమను తాము కృష్ణభక్తిభావన యందు మరియు భక్తియుతసేవ యందు నిలిచియున్నవారిగా భావించుచునే అంతరంగమున మాత్రము దేవదేవుడైన శ్రీకృష్ణుని పరతత్త్వముగా అంగీకరింపని భక్తులు పెక్కురు గలరు. భగవద్ధామప్రాప్తి యను భక్తియోగఫలమును అట్టి వారెన్నడును రుచిచూడలేరు.*
*అదే విధముగా కామ్యకర్మలందు, పుణ్యకర్మలందు మగ్నులైనవారు మరియు భౌతికబంధముల నుండి ముక్తిని వాంచించువారు సైతము దేవదేవుడైన శ్రీకృష్ణుని నిరసించు కారణముగా కృతకృత్యులు కాజాలరు. వేరుమాటలలో శ్రీకృష్ణుని యెడ అపహాస్య భావముతో వర్తించువారే దానవస్వభావులు లేదా నాస్తికస్వభావులు అయినట్టివారు. భగవద్గీత యందలి సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు అట్టి దానవప్రవృత్తి కలవారు కృష్ణుని శరణునొందరు. కనుక పరతత్త్వమును అవగాహన చేసికొన యత్నించు వారు మానసికకల్పనలు సాధారణజీవుడు మరియు శ్రీకృష్ణుడు ఏకమే, సమానమే అనెడి మిథ్యానిర్ణయమునకు వారిని చేర్చును.*
*అట్టి మిథ్యాభావనలో వారు ప్రస్తుతము దేహము ప్రక్రుతిచే కప్పబడియున్నదనియు, భౌతికదేహము నుండి ముక్తిని బడసినంతనే భగవానుడు మరియు తమ నడుమ భేదముండదనియు భావింతురు. కాని శ్రీకృష్ణునితో ఏకము కావలెననెడి వారు ప్రయత్నము భ్రాంతి కారణముగా వ్యర్థమగును. అట్టి దానవ, నాస్తికప్రవృత్తితో కూడియున్న జ్ఞానము వ్యర్థమని ఈ శ్లోకమున సూచించబడినది. అనగా వేదాంతసూత్రములు, ఉపనిషత్తులు వంటి వేదవాజ్మయమునందలి జ్ఞానసముపార్జనము దానవ, నాస్తికప్రవృత్తి గలవారికి సదా వ్యర్థమే కాగలదు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 350 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 12 🌴*
*12 . moghāśā mogha-karmāṇo mogha-jñānā vicetasaḥ*
*rākṣasīm āsurīṁ caiva prakṛtiṁ mohinīṁ śritāḥ*
🌷 Translation :
*Those who are thus bewildered are attracted by demonic and atheistic views. In that deluded condition, their hopes for liberation, their fruitive activities, and their culture of knowledge are all defeated.*
🌹 Purport :
*There are many devotees who assume themselves to be in Kṛṣṇa consciousness and devotional service but at heart do not accept the Supreme Personality of Godhead, Kṛṣṇa, as the Absolute Truth. For them, the fruit of devotional service – going back to Godhead – will never be tasted. Similarly, those who are engaged in fruitive pious activities and who are ultimately hoping to be liberated from this material entanglement will never be successful either, because they deride the Supreme Personality of Godhead, Kṛṣṇa.*
*In other words, persons who mock Kṛṣṇa are to be understood to be demonic or atheistic. As described in the Seventh Chapter of Bhagavad-gītā, such demonic miscreants never surrender to Kṛṣṇa. Therefore their mental speculations to arrive at the Absolute Truth bring them to the false conclusion that the ordinary living entity and Kṛṣṇa are one and the same.*
*With such a false conviction, they think that the body of any human being is now simply covered by material nature and that as soon as one is liberated from this material body there is no difference between God and himself. This attempt to become one with Kṛṣṇa will be baffled because of delusion. Such atheistic and demoniac cultivation of spiritual knowledge is always futile.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 197 / Agni Maha Purana - 197 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 59*
*🌻. అధివాసనము - 4 🌻*
*ఓ సురశ్రేష్ఠా! దానిపై ప్రణవసహితకార (హం) న్యాసము చేయవలెను. "ఓం ఆం నమ! పరమేష్ఠ్యాత్మనే" ఓం ఆం నమః పురుషాత్మనే, ఓం వాం నమో నిత్యాత్మనే, ఓం నాం నమో విశ్వాత్మనే ఓం వం నమః సర్వాత్మనే" అనునవి ఐదు శక్తులు. ప్రథమ శక్తిని స్నానమునందును-ఆసకర్మయందు, ద్వితీయశక్తిని, శయనమునందు తృతీయ శక్తిని, యానకర్మయందు చతుర్థశక్తిని, అర్చనాకాలమునందు పంచమశక్తిని వినియోగించవలెను. ఈ ఐదును ఉపనిషత్తులు. వీటి మధ్యయందు మంత్రమయు డగు శ్రీహరిని ధ్యానించి క్షకారము (క్షం)ను న్యాసము చేయవలెను.*
*ఏ మూర్తి స్థాపింపబడుచున్నదో ఆ మూర్తికి సంబంధించిన మూలమంత్రము న్యాసము చేయవలెను. "విష్ణు స్థాపన చేసినపుడు) "ఓం నమో బగవతే వాసుదేవాయ" అనునది మూలమంత్రము. ఈ మూలమంత్రముయొక్క ఒక్కొక్క అక్షరమును శిరస్సు, నాసిక, లలాటము, ముఖము, కంఠము, హృదయము, భుజములు, పిక్కలు, పాదములు-వీటియందు క్రమముగ న్యాసము చేయవలెను. పిమ్మట శిరస్సుపై కేశవుని, ముఖముపై నారాయణుని, కంఠముపై మాధవుని, భుజములపై గోవిందుని, హృదయముపై విష్ణువును, పృష్ఠభాగమున మధుసూదనుని, జఠరమున వామనుని, కటిపై త్రివిక్రముని, పిక్కలపై శ్రీధరుని, దక్షిణభాగమున హృషీకేశుని, చీలమండలపై పద్మనాభుని, పాదములపై దామోదరుని న్యాసము చేసి, పిమ్మట హృదయాదిషడంగన్యాసములు చేయవలెను. సత్ఫురుషులలో శ్రేష్ఠుడ వైన బ్రహ్మదేవా! ఇది ఆదిమూర్తి విషయమున చెప్పిన సాధారణన్యాసము.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 197 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 59*
*🌻Preliminary consecration of an image (adhivāsana) - 4 🌻*
29. Oṃ, Vāṃ, salutations to the eternal being! Nāṃ, salutations to the soul of the universe! Oṃ, vāṃ, salutations to the soul of all beings! Thus the five forms of energies have been described.
30. The first one (of the above five syllables) should be used for the place, the second one for the seat, the third one for the bed, and the fourth one for the drink.
31. The fifth one is used at every worship. These (five mystic syllables) are known as the five upaniṣads. The syllable huṃ should be placed in the middle after having contemplated on Hari, composed of mystic syllables.
32. Whichever form of the deity is being installed one should assign the particular principal mystic syllable of that form afterwards. The principal syllable of Vāsudeva is Oṃ, salutations to Lord Vāsudeva!
33. (The different forms of the god) should be (mentally) assigned to (the different parts of the body such as) the head, nose, forehead, face, neck, heart, arms, shanks and feet in order. (The manifestation known as) Keśava should be assigned to the head (of the image).
34. Nārāyaṇa should be assigned to the face, Madhava to the neck, Govinda to the arms, (and) Viṣṇu to the heart.
35. Madhusūdana should be assigned to the hinder part, Vāmana to the belly, Trivikrama to the hip (and) Śrīdhara to the shank.
36. Hṛṣīkeśa (should be assigned) on the right side, Padmanābha on the ankle, Dāmodara on the feet.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 62 / DAILY WISDOM - 62 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 2. వస్తువులను ఎవ్వరూ స్వాధీనం చేసుకోలేరు. 🌻*
*నశ్వరమైన ఈ జగత్తులో వస్తువులు ఎలా ఉన్నాయంటే వాటిని ఎవరూ స్వాధీనం చేసుకోలేరు. ఈ యజమాని అనే భావన మనస్సులో ఒక విచిత్రమైన భావన. ఈ భావన ఎంత అబద్ధమో మనకు బాగా తెలుసు. మీరు ఆలోచనలో తప్ప మీరు దేనికీ యజమానులు కారు. కాబట్టి, మనం ఆస్తి యొక్క యాజమాన్యం అని దేనినైతే పిలుస్తామో, ఇది కేవలం మనస్సు యొక్క స్థితి. నేను మీకు చాలా చిన్న స్థూల ఉదాహరణ ఇవ్వగలను: అక్కడ ఒక పెద్ద విస్తీర్ణంలో ఒక భూమి ఉందనుకుందాం. దానిలోనే వ్యవసాయ ఆధారితమైన విస్తారమైన పొలం ఉంది అనుకుందాం.*
*ఈ రోజు అది ఒకరి యాజమాన్యంలో ఉంది, మరియు రేపు అది ఆస్తి బదిలీ ద్వారా వేరొకరి యాజమాన్యంలో ఉంటుంది. ఇప్పుడు, ఈ ఆస్తి బదిలీ అంటే ఏమిటి? నిజానికి, ఇది ఎప్పుడూ ఎక్కడికీ బదిలీ చేయబడలేదు. ఇది దాని స్వంత స్థలంలోనే ఉంది. ఇది ప్రజల ఆలోచనలలో ఒకరి నుంచి ఇంకొకరికి బదిలీ చేయబడింది అంతే. కాబట్టి, మీకు నచ్చినా, నచ్చకపోయినా మనం యాజమాన్యం అని, నాది అని పిలుచుకునే విషయం అప్పటి సమూహం అందరూ కలిసి ఒప్పుకున్న ఒక మానసిక ఒప్పందం తప్ప మరొకటి కాదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 62 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻2. Things Cannot be Possessed by Anyone 🌻*
*The arrangement of things is such, in the temporal realm, that things cannot be possessed by anyone. The idea of possession is a peculiar notion in the mind. You know very well how false the idea of possession is. You cannot possess anything except in thought. So, what we call ownership of property, is a condition of the mind. I can give you a very small gross example: There is a large expanse of land, a vast field which is agricultural in itself.*
*Today you say, it is owned by ‘A’, and tomorrow it is owned by ‘B’, by transfer of property. Now, what do you mean by this transfer of property? It has never been transferred. It is there in its own place. It has been transferred in the ideas of people. The whole question of ownership, or psychologically put—like or dislike, is a condition of the mind which is an arrangement of psychological values, agreed upon by a group of people who have decided that this should be the state of affairs.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 327 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. శరీరంలో వుండడం బంధమే. అది పరిమితం, నువ్వు అపరిమితానివి. పెద్ద ప్రపంచాన్ని చిన్ని శరీరంలో ఒదిగించడం. అందువల్లే నిరంతర ఆందోళన, అసహనం. 🍀*
*అన్ని కోరికలూ అదృశ్యమయ్యాకా నువ్వు శరీరానికి తిరిగి రావు. నువ్వు అనంత చైతన్యంలో భాగమవుతావు. దాన్ని తూర్పు దేశాల్లో నిర్వాణమంటారు. విశ్వ చైతన్య మంటారు. అప్పుడు ఏ శరీరంలోనూ అవసరముండదు. ఎట్లాంటి జైలుతో పని వుండదు. అది అంతిమ స్వేచ్ఛ. శరీరంలో వుండడం బంధమే. అది పరిమితం, నువ్వు అపరిమితానివి. పెద్ద ప్రపంచాన్ని చిన్ని శరీరంలో ఒదిగించడం. అందువల్లే నిరంతర ఆందోళన, అసహనం. మనిషి స్పష్టంగా ఆ స్పృహతో వుండడు.*
*కానీ ప్రతి ఒక్కరిలో ఏదో పొరపాటు జరిగిందన్న భావన కనిపిస్తుంది. కారణం మనం అనంతం. మన శరీరం అల్పం. చైతన్యం నీకు శరీరం నించీ విముక్తి కలిగిస్తుంది. నువ్వు శరీరం కాదని నువ్వు గుర్తించిన మరుక్షణం నీ కోరికలు మాయమై నీ శరీరం కూడా అదృశ్యమవుతుంది. చైతన్యం కాంతిలా పని చేస్తుంది. కోరికలు చీకటిలా మాయమవుతాయి.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 064 / Siva Sutras - 064 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻. 20. భూత సంధాన భూత పృథక్త్వా విశ్వ సంఘటః - 3 🌻*
*🌴.సంకల్ప శక్తి ద్వారా యోగి తన అవగాహనను కేంద్రీకరించి మూలకాలను తన శరీరం నుండి మరియు ఇతరుల నుండి వేరు చేయగలడు. అతను స్థలం మరియు సమయం యొక్క పరిమితుల నుండి విముక్తి పొందగలడు. 🌴*
*ఒక యోగి తన శరీరాన్ని తన చైతన్యం నుండి వేరు చేయగలిగినప్పుడు, అతను దాహం, ఆకలి, అనారోగ్యాలు మొదలైనవాటిని అనుభవించడు ఎందుకంటే ఇవి భౌతిక శరీరానికి సంబంధించినవి మాత్రమే. అతను తన శుద్ధి చేయబడిన చైతన్యంలో నివసిస్తున్నాడు, ఇది స్థూల రూపాలతో ఏ విధంగానూ సంబంధం కలిగి ఉండదు. విశ్వసంఘటతని ఉపయోగించడం ద్వారా, అటువంటి యోగి కాలాన్ని మరియు స్థలాన్ని అధిగమించగలడని సూచించడానికి శివుడు ఎంచుకున్నాడు. అతను గతాన్ని అన్వేషించగలడు, వర్తమానాన్ని అనుభవించగలడు మరియు భవిష్యత్తును అంచనా వేయగలడు.*
*రోగనిర్ధారణ చేసిన సమస్యతో ఎవరైనా అతనిని సంప్రదించినట్లయితే, ఒక యోగి ఆ సమస్యపై ఏకాగ్రతతో దానిని పరిష్కరించ గలుగుతాడు. దాని విషయంలో భవిష్యత్తు గురించి తెలుసుకుని, తదనుగుణంగా, అతను విపత్తును నివారించడానికి నివారణలను సూచిస్తాడు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 064 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 20. Bhūta sandhāna bhūta pṛthaktva viśva saṃghaṭṭāḥ - 3 🌻*
*🌴. By will power the yogi can concentrate his awareness and separate the elements from his own body and that of others. He can become free from the limitations of space and time. 🌴*
*When a yogi is able to segregate his body from his consciousness, he does not experience thirst, hunger, ailments, etc as these pertain only to the physical body. He lives in his purified form of consciousness, which in no way gets associated with gross forms. By using viśvasaṃghaṭṭāḥ, Shiva has chosen to indicate that such a yogi can transcend time and space. He can explore past, feel the present and predict the future.*
*If someone approaches him, with an prognosticated issue, a yogi is able to fix his concentration on that issue and come to know of the future and accordingly, he suggests remedies to avoid catastrophe.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
No comments:
Post a Comment