శ్రీ మదగ్ని మహాపురాణము - 201 / Agni Maha Purana - 201


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 201 / Agni Maha Purana - 201 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 60

🌻. వాసుదేవ ప్రతిష్ఠా విధి - 1 🌻


హయగ్రీవుడు చెప్పెను - బ్రహ్మదేవా! పిండికాస్థాపనము కొరకై, విద్వాంసుడు దేవాలయములోని గర్భగృహమును ఏడు భాగములుగా విభజింపవలెను. ప్రతిమను బ్రహ్మభాగము నందు స్థాపింపవలెను. దేవ-మనుష్య-పిశాచ భాగములయందెన్నుడు స్థాపింపగూడదు. బ్రహ్మభాగములో కొంతభాగము విడచి, దేవభాగమనుష్య భాగములలో కొన్ని భాగములు గ్రహించి, ఆ భూమిపై ప్రయత్న పూర్వకముగ పిండికను స్థాపింపవలెను. నపుంసక శిలపై రత్నన్యాసము చేయవలెను. నృసింహమంత్రముతో హోమము చేసి ఆ మంత్రముతోనే రత్నన్యాసము కూడ చేయవలెను. వ్రీహులు, రత్నములు లోహము మొదలగు ధాతువులు, చందనము మొదలగు పదార్థములను పూర్వాది దిశలందును. మద్యభాగమునందును ఉంచిన కుండములలో, తన అభిరుచి ననుసరించి ఉంచవలెను.

పిమ్మట ఇంద్రాది మంత్రములతో పూర్వాది దిశలలో నున్న గుంటలను గుగ్గులముచే కప్పి, రత్నన్యాస విధి పూర్తియైన పిదప గురుశలాకలతో కూడిన కుశసమూహముల చేతను, సహదేవమను ఓషధి చేతను ప్రతిమను బాగుగా రాయవలెను. బైటను, లోపలను తగు సంస్కారములు చేసి పంచగవ్యములతో శుద్ధి చేయవలెను. పిమ్మట కుశోదకము, నదీజలము, తీర్థజలము ఆ ప్రతిమపై ప్రోక్షించవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 201 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 60

🌻Mode of installation of the image of Vāsudeva - 1 🌻



The Lord said:

1. One should divide the length of adytum into seven parts for the installation of the pedestal. The wise man should fix the image on the part of Brahman.

2-3. (One should) never (fix it) in the parts (presided over) by the celestials, mortals and goblins, leaving out the part (presided over by) Brahman. The pedestal should be carefully fixed off the regions of celestials and mortals. Gems should be imbedded in the case of a hermaphrodite stone.

4-5. Having performed oblation with (the mantra sacred to) Narasiṃha (the man-lion form of Viṣṇu), the gems. should be placed with (the repetition of) the same (mantra). Rice grains, gems, three (kinds of) minerals, iron and other metallic substances, sandal wood etc., should be placed in the nine holes commencing with the east at the centre as one likes. Then the holes should be filled with the guggulu (a kind of fragrant gum resin) with (the recitation of) the mantras—indra etc.

6. After having performed the insertion of gems, the preceptor should rub the image with sticks of sahadeva (tree) and bunches of darbha (grass).

7. The outer and inner surface (of the image) should be cleansed and then purified with the pañcagavya (the five things got from a cow). Water should be sprinkled with the darbha. grass as well as with the waters of the river.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment