నిర్మల ధ్యానాలు - ఓషో - 330


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 330 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ధ్యానం చేసే పని శరీరం, మనసు, హృదయం మధ్య ఘర్షణ నివారించి సమన్వయించడం, కలపడం. ఒక దాని పట్ల యింకొకటి సమశృతిలో సాగేలా చెయ్యడం. అప్పుడు నీకు అనంత శక్తి వస్తుంంది. 🍀

నువ్వు నీ లోపల జరుగుతున్న దాన్ని గమనిస్తే ఆశ్చర్యపోతావు. శరీరం 'చాలు చాలా తినకు, నాకు ఎక్కువయి పోయింది' అంటుంది. మనసు 'ఐస్క్రీం అద్భుతంగా వుంది. యింకొంచెం తిను' అంటుంది. హృదయం 'అదెంత అందంగా వుంది' అంటుంది. మనసు ' నీకు బుర్ర లేదు, నీకు పిచ్చి పట్టింది అంటుంది. ఎప్పుడు హృదయం ప్రేమలో పడితే మనసు 'ఇది గుడ్డితనం' అంటుంది. హృదయం ఎటు వెళ్ళినా మనసు తప్పుపడుతుంది. వాటి ప్రపంచాలు వేరు.

ధ్యానం చేసే పని శరీరం, మనసు, హృదయం మధ్య ఘర్షణ నివారించి సమన్వయించడం, కలపడం. ఒక దాని పట్ల యింకొకటి సమశృతిలో సాగేలా చెయ్యడం. అప్పుడు నీకు అనంత శక్తి వస్తుంంది. కారణం ఘర్షణ వుండదు. ఆ శక్తి నీకు రెక్కల్ని యిచ్చి అనంతం వేపు సాగిపోయేలా చేస్తుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment