నిర్మల ధ్యానాలు - ఓషో - 338


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 338 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. జీవితం శాశ్వతమైంది. మనం ఎప్పుడు యిక్కడే వున్నాం. ఎప్పుడూ యిక్కడే వుంటాం. మనం మరణం లేని వాళ్ళం. శరీరం మారుతూ పోతూ వుంటుంది. మనం శరీరం కాము, మనసూ కాము. గాఢమయిన ధ్యానం ఆ విషయం కనిపెడుతుంది. 🍀


ఆధునిక మానవుడు ఎంత హడావుడిగా వున్నాడంటే అతనికి కూర్చునే సమయం కూడా లేదు. విశ్రాంతికి అతనికి సమయం లేదు. నీకు విశ్రాంతి తీసుకునే సమయం లేకపోతే నువ్వు విలువైన దానికి అర్హుడు కావు. వాస్తవమేమిటంటే మనం దేన్ని గురించీ మరీ ఎక్కువగా బాధపడాల్సిన పన్లేదు. జీవితం శాశ్వతమైంది. మనం ఎప్పుడు యిక్కడే వున్నాం. ఎప్పుడూ యిక్కడే వుంటాం.

మనం మరణం లేని వాళ్ళం. శరీరం మారుతూ పోతూ వుంటుంది. మనం శరీరం కాము, మనసూ కాము. గాఢమయిన ధ్యానం ఆ విషయం కనిపెడుతుంది. మనం చైతన్యం, మెలకువ, మనం ఈ ఆటకు సాక్షీభూతులం. నువ్వొకసారి ఆ సాక్షీభూతాన్ని అనుభవానికి తెచ్చుకుంటే తేనె మాధుర్యాన్ని చవి చూస్తావు. రసవాదులు పరిశోధించే తేనె అదే.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment