కపిల గీత - 184 / Kapila Gita - 184


🌹. కపిల గీత - 184 / Kapila Gita - 184 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 38 🌴

38. దేహోఽపి దైవవశగః ఖలు కర్మ యావత్ స్వారంభకం ప్రతిసమీక్షత ఏవ సాసుః|
తం సప్రపంచమధిరూఢసమాధియోగః స్వాప్నం పునర్న భజతే ప్రతిబుద్ధవస్తుః॥


తాత్పర్యము : ఆత్మస్వరూప సాక్షాత్కారముసు పొందిన యోగి తన ప్రారబ్ధకర్మానుభవము ముగియునంత వరకూ ప్రాణసహితుడై శరీరమును ధరించి యుండును. అతనికి పరమాత్మతో అఖండ సంయోగము ఏర్పడి యున్నందున మేల్కొనువాడు, స్వప్సదృశ్యములను మిథ్యగా భావించినట్లు అతడు సాంసారిక విషయములను అసత్తుగా భావించును. తిరిగి సంసార బంధమున చిక్కుకొనడు.

వ్యాఖ్య : ఈ శరీరం కూడా మనం ఆచరించిన పుణ్య పాప కర్మలకు అనుగుణమైన శరీరం పరమాత్మ ఇస్తే వస్తుంది. ఆ కర్మల ఫలితాన్ని అనుభవించడానికే ఏ శరీరం అణువైనదైతే ఆ శరీరం ఇస్తాడు. మనమే ప్రాణమూ (సాసుః) ఇంద్రియమూ మనసూ బుద్ధి ఉన్నవరకూ, ఈ శరీరముతో అనుభవించే వాటిగురించీ, కర్మల గురించీ ఆలోచిస్తూ ఉంటాము. ఆ ఆలోచనకు కావలసిన ఉపకరణాలు మాత్రం పరమాత్మే ఇస్తాడు. మరి ఆ పాపం చేసేవాటిని పరమాత్మ ఎందుకిచ్చాడు? విత్తనం భూమిలో పడ్డప్పుడు ఎలాంటి విత్తనం పడితే అలాంటి చెట్టు వస్తుంది. పూర్వ జన్మలో ఆచరించిన కరమ సంస్కారానికి తగిన శరీరం ఇస్తాడు. అది మారాలనటే సిద్ధుల సంపర్కం కావాలి. అదే సత్సంగం. పరమాత్మకు దయ కలిగితే అలాంటి వారితో సంగం కలిగిస్తాడు.

ఎంత వరకూ శరీర సంబంధం విడిచిపెట్టదో అంతవరకూ దేహాత్మాభిమానం పోదు, ఆత్మ సాక్షాత్కారం కలగదు. ఆత్మ స్వరూప సాక్షాత్కారం కలగడం అనేది, ఈ శరీరమూ ప్రాణము పోయిన తరువాతనే. అంటే ప్రారబ్ధ కర్మ కూడా పోయిన తరువాతనే. కొందరు సిద్ధులకి మాత్రం ఈ శరీరం ఉన్నా వారికి ఆత్మ స్వరూపజ్ఞ్యానం మోక్షం కలుగుతుంది. ఒక సారి అలాంటి సాక్షాత్కారం కలిగితే, కలలో కన్న వస్తువులను పొందలేనట్లుగా, వారు సంసారాన్ని పొందలేరు. వాస్తవముగా ఈ బ్రతుకంతా ఒక స్వప్నములాంటిది. అలాంటి వారు మళ్ళీ దేహ సంబంధాన్ని పొందరు. మళ్ళీ సంసారానికి రారు ("నన్ను పొందిన తరువాత వాడు మరలా పుట్టడు - గీత)


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 184 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 4. Features of Bhakti Yoga and Practices - 38 🌴

38. deho 'pi daiva-vaśagaḥ khalu karma yāvat svārambhakaṁ pratisamīkṣata eva sāsuḥ
taṁ sa-prapañcam adhirūḍha-samādhi-yogaḥ svāpnaṁ punar na bhajate pratibuddha-vastuḥ


MEANING : The body of such a liberated yogī, along with the senses, is taken charge of by the Supreme Personality of Godhead, and it functions until its destined activities are finished. The liberated devotee, being awake to his constitutional position and thus situated in samādhi, the highest perfectional stage of yoga, does not accept the by-products of the material body as his own. Thus he considers his bodily activities to be like the activities of a body in a dream.

PURPORT : The gross body is made of the gross elements of matter, and the subtle body is made of mind, intelligence, ego and contaminated consciousness. If one can accept the subtle body of a dream as false and not identify oneself with that body, then certainly an awake person need not identify with the gross body. As one who is awake has no connection with the activities of the body in a dream, an awakened, liberated soul has no connection with the activities of the present body. In other words, because he is acquainted with his constitutional position, he never accepts the bodily concept of life.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment