శ్రీ మదగ్ని మహాపురాణము - 231 / Agni Maha Purana - 231


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 231 / Agni Maha Purana - 231 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 69

🌻. స్నాన విధానము - స్నాపనోత్సవము - 1 🌻


అగ్నిదేవుడు పలికెను.: 'బ్రహ్మదేవా! ఇపుడు నేను స్నానోత్సవమునుగూర్చి సవిస్తరముగా చెప్పెదను. ప్రాసాదము ఎదుట మండపము క్రింద మండలముపై కలశములు ఉంచవలెను. ప్రారంభమునందు అన్ని కర్మలు చేయు నపుడును శ్రీహరి ధ్యానము పూజహోమములు చేయవలెను. పూర్ణాహుతితో పాటు వెయ్యి లేక నూటఎనిమిది హోమములు చేయవలెను. స్నానద్రవ్యములు తీసికొని వచ్చి కలశవిన్యాసము చేయవలెను. కంఠసూత్రయుక్త కుంభములను అధివాసనము చేసి మండలముపై ఉంచవలెను.

చతురస్రమండలము నిర్మించి దానిని పండ్రెండు రేఖలచే విభజించవలెను. ప్రక్క నున్న రేఖను తుడిచివేయువలెను. ఈ విధముగ ఆ మండలమపై నాలుగు దిక్కులందును తొమ్మిదేసి కష్ఠకములు స్థాపించి వాటిని పూర్వాదిక్రమమున వరిపిండి మొదలైన వాటితో నింపవలెను. పిమ్మట విద్వాంసుడు కుంభముద్రతో పూర్వాది దిక్కులందున్న నవకమునందు కలశ లుంచవలెను. పుండరీకాక్ష మంత్రముతో వాటిలో దర్భ లుంచవలెను. సర్వరత్నములును ఉంచి ఉదకపూర్ణకుంభమును మధ్యభాగమునందుంచి. మిగిలిన ఎనిమిది కుంభములో క్రమముగ యవ-వ్రీహి-తిల-నీవార-శ్యామాక-కులత్థ-ముద్గ-శ్వేత సర్షపములు వేసి ఎనిమిది దిక్కులందును. స్థాపింపవలెను. పూర్వదిక్కునందున్న నవకమునందు మధ్య ఘృతపూర్ణకుంభ ముంచవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana - 231 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 69

🌻 Mode of conducting the bathing festival (snāna) - 1 🌻

The Fire (Lord) said:

1. O Brahman! Listen! I shall describe in detail (the mode of conducting) the bathing festival. The pitchers should be placed in a drawn figure in the shed in front of the temple.

2. First of all, God Hari (Viṣṇu) should be contemplated, propitiated and offered oblations before doing anything. One should offer oblations hundred or thousand times along with the final one.

3. The materials for bathing [i.e., snāna-dravya] should then be brought and the pitchers also should be placed. The pitchers to the necks of which threads have been tied should be made fragrant and they should be held in a circle.

4. A square should be drawn and divided into eleven compartments. The gruel should be placed at the centre, the adjacent parts having been cleaned.

5. The nine angular points commencing with east should be filled with powdered rice etc., and the pitcher should be brought by the wise man after having formulated the kumbha mudrā[1].

6. Darbha grass should be put on them with the puṇḍarīkākṣa (an epithet of Viṣṇu) (lotus-eyed) mantra. A pitcher filled with water and containing all gems should be placed in the middle.

7. The barley, paddy, sesamum, uncultivated rice, śyāmāka (grains), horse gram, green gram and white mustard seeds. (should be put) in the eight directions in order.

8-9. A pitcher filled with ghee should be placed in the middle of the eastern side in the midst of nine pitchers. The remaining pitchers should be filled with the decoctions of the (barks of) palāśa, aśvattha, nyagrodha, bilva, udumbara, śirīṣa, jambū, śamī and kapittha. The central pitcher in the nine pitchers in the south-east should be filled with honey.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment