🌹 29, JUNE 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 29, JUNE 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 29, JUNE 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
*🍀. తొలి ఏకాదశి - దేవశయని ఏకాదశి - చాతుర్మాస దీక్ష శుభాకాంక్షలు - Devshayani Ekadashi, Chaturmasya Deeksha Good Wishes 🍀*
2) 🌹 కపిల గీత - 198 / Kapila Gita - 198🌹 
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 08 / 5. Form of Bhakti - Glory of Time - 08 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 790 / Vishnu Sahasranama Contemplation - 790 🌹 
🌻790. ఉద్భవః, उद्भवः, Udbhavaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 751 / Sri Siva Maha Purana - 751 🌹
🌻. జలంధరుని జన్మ, వివాహము - 4 / The birth of Jalandhara and his marriage - 4 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 005 / Osho Daily Meditations - 005 🌹 
🍀 05. పునరాలోచనా జ్ఞానం / 05. RETROSPECTIVE WISDOM 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 462 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 1 🌹 
🌻 462. ‘సురనాయికా’ - 1 / 462. 'Suranaeika' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 29, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*🍀. తొలి ఏకాదశి - దేవశయని ఏకాదశి - చాతుర్మాస దీక్ష శుభాకాంక్షలు - Devshayani Ekadashi, Chaturmasya Deeksha Good Wishes 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : దేవశయని ఏకాదశి, చాతుర్మాస్య దీక్ష, Devshayani Ekadashi, Chaturmasya Deeksha, 🌺*

*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 12 🍀*

*23. స్థూలసూక్ష్మో నిరాకారో నిర్మోహో భక్తమోహవాన్ |*
*మహీయాన్పరమాణుశ్చ జితక్రోధో భయాపహః*
*24. యోగానందప్రదాతా చ యోగో యోగవిశారదః |*
*నిత్యో నిత్యాత్మవాన్ యోగీ నిత్యపూర్ణో నిరామయః*

🌻 🌻 🌻 🌻 🌻

🌹. తొలి ఏకాదశి - దేవశయని ఏకాదశి - చాతుర్మాస దీక్ష 🌹

*ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి. దీనినే దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి అతి ముఖ్యమైన ఏకాదశులలో ఒకటి. ఇది విష్ణు శయనోత్సవం. శంఖ చక్రగదా పద్మాలను ధరించి లక్ష్మీదేవి పాదములొత్తుచుండగా ఆదిశేషునిపై శయనించి ఉన్న ప్రతిమను పూజించాలి.*

*త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం!*
*విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్వం స చరాచరమ్!!*

*🍀. నేటి సూక్తి : యోగసాధన ముఖ్యలక్ష్యం - చేతనలో మార్పు సాధించడమే యోగసాధన ముఖ్యలక్ష్యం. నీలో దాగి వున్న నత్యచేతన ముసుగు తొలగించి క్రమేణా ఆ చేతనను అభివ్యక్త పరచుకొంటూ రావడమే నీవు చేయవలసినది. అలా చేసినప్పుడే తొలుత ఈశ్వర స్పర్శనూ, తుదకు ఈశ్వర సంయోగాన్నీ నీవు పొందగలుగుతావు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాఢ మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 26:43:43 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: స్వాతి 16:31:55 వరకు
తదుపరి విశాఖ
యోగం: సిధ్ధ 27:44:22 వరకు
తదుపరి సద్య
కరణం: వణిజ 15:00:52 వరకు
వర్జ్యం: 22:02:20 - 23:37:00
దుర్ముహూర్తం: 10:07:50 - 11:00:29
మరియు 15:23:41 - 16:16:20
రాహు కాలం: 13:58:09 - 15:36:51
గుళిక కాలం: 09:02:02 - 10:40:44
యమ గండం: 05:44:37 - 07:23:20
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:45
అమృత కాలం: 07:32:22 - 09:10:18
సూర్యోదయం: 05:44:37
సూర్యాస్తమయం: 18:54:15
చంద్రోదయం: 14:51:26
చంద్రాస్తమయం: 01:45:43
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: స్థిర యోగం - శుభాశుభ
మిశ్రమ ఫలం 16:31:55 వరకు 
తదుపరి వర్ధమాన యోగం - 
ఉత్తమ ఫలం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🍀. తొలి ఏకాదశి - దేవశయని ఏకాదశి - చాతుర్మాస దీక్ష శుభాకాంక్షలు - Devshayani Ekadashi, Chaturmasya Deeksha Good Wishes 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹. తొలి ఏకాదశి - దేవశయని ఏకాదశి - చాతుర్మాస దీక్ష 🌹*

*ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి. దీనినే దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి అతి ముఖ్యమైన ఏకాదశులలో ఒకటి. ఇది విష్ణు శయనోత్సవం. శంఖ చక్రగదా పద్మాలను ధరించి లక్ష్మీదేవి పాదములొత్తుచుండగా ఆదిశేషునిపై శయనించి ఉన్న ప్రతిమను పూజించాలి.*

*త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం!*
*విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్వం స చరాచరమ్!!*

*ఈ ఏకాదశీ వ్రతం మూడు రోజులు చేయాలి. అంటే రోజూ శేషశాయిని అర్చించడం, ఏకాదశినాడు ఉపవసం, ద్వాదశి పారణ, త్రయోదశినాడు గీత నృత్యాదులతో అర్చన చేయాలి.*

*కొందరు ఈ రోజునుండే చాతుర్మాస్య వ్రతాచరణ చేస్తారు. కొన్ని సంప్రదాయాలలో ద్వాదశినుండి ఆచరిస్తారు. ఇవి గృహస్థులకు చాతుర్మాస్య వ్రతారంభ దినాలు.*

*ఈ వ్రతాచరణ ప్రకారం - నారాయణుని పూజించి ఈ శ్లోకం చదవాలి.*

త్వయి సుప్తే జగన్నాథ, జగత్సుప్తం భవేదిదం!
విబుద్ధే చ విబుధ్యేత, ప్రసన్నో మే భవాచ్యుత!!
చతురో వార్షికాన్ మాసాన్ దేవ స్యోత్థాపనావధి!
శ్రావణే వర్జయేచ్ఛాకం దధి భాద్రపదే తథా!!
దుగ్ధమాశ్వయుజే మాసి కార్తికే ద్విదళం త్యజేత్!
ఇమం కరిష్యే నియమం నిర్విఘ్నం కురుమేచ్యుత!!
ఇదం వ్రతం మయాదేవ గృహీతం పురతస్తవ!
నిర్విఘ్నం సిద్ధిమాయాతు ప్రసాదాత్త రమాపతే!!
గృహీతేస్మిన్ వ్రతేదేవ పంచత్వం యదిమే భవేత్!
తదా భవతు సంపూర్ణం ప్రసాదాత్తే జనార్దన!!

*ఈ చాతుర్మాసంలో శ్రావణంలో శాకాన్ని (కూర), భాద్రపదమాసంలో పెరుగు, ఆశ్వయుజ మాసంలో పాలను, కార్తికమాసంలో పప్పును వదలాలి అని విద్వాంసులన్నారు.*

*🌹. చాతుర్మాస దీక్ష 🌹* 

*ఆషాఢ శుద్ధ ఏకాదశి ఏకాదశి నుండి కార్తీక మాసం లో వచ్చే ప్రభోదిని ఏకాదశి వరకు చాతుర్మాస దీక్ష ను ఆచరిస్తారు.*

*🌻. చాతుర్మాస్యం: వ్రత నియమాలు 🌻* 

*ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్ వ్రతచర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్ దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః*

*చాతుర్మాస్యాన్ని అన్ని ఆశ్రమాల (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస) వారు పాటించవచ్చు. కుల, వర్గ నియమాలు కానీ, లింగ వివక్ష కానీ లేదు. చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది.*

 *🌻. చాతుర్మాస్య వ్రతం పాటించే విధానం 🌻* 

*చాతుర్మాస వ్రతము పాటించేవారు. ఆహార నియమాలలో భాగంగా -- శ్రావణ మాసంలో ఆకుకూరలను  భాద్రపద మాసంలో పెరుగును
ఆశ్వయుజ మాసంలో పాలను  కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పెట్టాలి .. వాటిని ఆహారముగా ఏ మాత్రము స్వీకరించ కూడదు. పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చును.*
  
*భాగవతం వంటి గాథలు వింటూ ఆథ్యాత్మిక చింతనతో ఈ నాలుగు నెలలూ గడపాలి. ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు.ఈ కాలంలో అరుణోదయవేళ స్నానం చేయడం అవసరం. వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి. ఇష్టదేవతలకు చెందిన దివ్యమంత్రాన్ని అక్షరలక్షలుగా జపించాలి. ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి. యోగసాధన చేయడం శ్రేయస్కరం. దానధర్మాది కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి.*

🌸 *జై శ్రీమన్నారాయణ* 🌸
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 198 / Kapila Gita - 198 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 08 🌴*

*08. అభిసంధాయ యో హింసాం దంభం మాత్సర్యమేవ వా|*
*సంరంభీ భిన్నదృగ్భావం మయి కుర్యాత్స తామసః॥*

*తాత్పర్యము : భేదదృష్టి గలిగి, క్రోధమును వహించు వాని హృదయము నందు హింస, దంభము, అసూయ మొదలగు భావములతో చేయబడు భక్తి తామసము అనబడును.*

*వ్యాఖ్య : మరి తామసుడంటే ఎవరు. హింసనే మనసులో పెట్టుకుని భక్తికి ఉపక్రమించేవాడు. కోపము కలవాడై (సంరమ్భీ ), ధంభముతో (పూజ చేస్తున్నట్లు కనపడే వారు) , మాత్సర్యముతో (నేనే పూజ చేస్తున్నా) చేస్తాడు. ఇలా హింసతో, ధంభముతో, మాత్సర్యముతో మూడు రకాలుగా ఉంటుంది తామస భక్తి. దీనికి మూలము కోపము. పరమాత్మను కోపముతో పూజిస్తాడు. ఇవన్నీ ఎందుకు పుడతాయంటే (భిన్నదృగ్) పరమాత్మ వేరు ప్రపంచం వేరు అనే భావన ఉండటమే. ధంభమంటే లేనిదాన్ని ఉన్నట్లు చూపడం. తామస భక్తికి మూలం భేధ దృష్టి. అలాంటి భావన నా యందు ఉంచితే అది తామస భక్తి.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 198 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 5. Form of Bhakti - Glory of Time - 08 🌴*

*08. abhisandhāya yo hiṁsāṁ dambhaṁ mātsaryam eva vā*
saṁrambhī bhinna-dṛg bhāvaṁ mayi kuryāt sa tāmasaḥ*

*MEANING : Devotional service executed by a person who is envious, proud, violent and angry, and who is a separatist, is considered to be in the mode of darkness.*

*PURPORT : It has already been stated in the Śrīmad-Bhāgavatam, First Canto, Second Chapter, that the highest, most glorious religion is the attainment of causeless, unmotivated devotional service. In pure devotional service, the only motive should be to please the Supreme Personality of Godhead. That is not actually a motive; that is the pure condition of the living entity. In the conditioned stage, when one engages in devotional service, he should follow the instruction of the bona fide spiritual master in full surrender. The spiritual master is the manifested representation of the Supreme Lord because he receives and presents the instructions of the Lord, as they are, by disciplic succession. It is described in Bhagavad-gītā that the teachings therein should be received by disciplic succession, otherwise there is adulteration. To act under the direction of a bona fide spiritual master with a motive to satisfy the Supreme Personality of Godhead is pure devotional service. But if one has a motive for personal sense gratification, his devotional service is manifested differently. Such a man may be violent, proud, envious and angry, and his interests are separate from the Lord's.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 790 / Vishnu Sahasranama Contemplation - 790🌹*

*🌻790. ఉద్భవః, उद्भवः, Udbhavaḥ🌻*

*ఓం ఉద్భవాయ నమః | ॐ उद्भवाय नमः | OM Udbhavāya namaḥ*

*ఉత్కృష్టం స్వేచ్ఛయా జన్మ భజతి కేశవః ।*
*యతోవా జన్మాపగత ముద్గతం యత్ తదుద్భవః ॥*

*పరమాత్ముడు తన ఇచ్ఛతోనే ఆయా అవతారములయందు ఉత్కృష్టమగు జన్మమును పొందుచున్నాడు. ఈతడే సర్వకారణుడగుటచే ఈతనికి జన్మము అపగతముగ నైనది అనగా లేనిదిగా అయినది.*

373. ఉద్భవః, उद्भवः, Udbhavaḥ

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 790🌹*

*🌻790. Udbhavaḥ🌻*

*OM Udbhavāya namaḥ*

उत्कृष्टं स्वेच्छया जन्म भजति केशवः ।
यतोवा जन्मापगत मुद्गतं यत् तदुद्भवः ॥

*Utkr‌ṣṭaṃ svecchayā janma bhajati keśavaḥ,*
*Yatovā janmāpagata mudgataṃ yat tadudbhavaḥ.*

*He assumes a superior incarnation of His own free will. Or as He is the case of all, there can be no birth for Him.*

373. ఉద్భవః, उद्भवः, Udbhavaḥ

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
*उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥*
*ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥*
*Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,Arko vājasanaḥ śr‌ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥*

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 751 / Sri Siva Maha Purana - 751 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 14 🌴*
*🌻. జలంధరుని జన్మ, వివాహము - 4 🌻*

*సనత్కుమారుడిట్లు పలికెను -*

*బ్రహ్మ ఇట్లు పలికి శుక్రుని ఆహ్వానించి ఆ బాలకుని రాజ్యాభిషిక్తుని చేసెను. ఆయన సముద్రుని వద్ద సెలవు తీసుకొని అంతర్ధానమును జెందెను (30). అపుడు ఆ బాలకుని చూచి వికసించే నయనములు గల ఆ సముద్రుడు ఆ కుమరుని తీసుకొని ఆనందముతో స్వగృహమునకు వెళ్లెను (31). ఆనందముతో నిండిన మనస్సు గల సముద్రుడు సర్వావయవముల యందు అందగాడు, ఉల్లాసమును కలిగించువాడు, మహాద్భుతమగు తేజస్సు గలవాడు అగు తన బాలకుని అనేకములగు చక్కని ఉపాయములతో పెంచి పోషించెను (32). అపుడు సముద్రుడు కాలనేమియను గొప్ప రాక్షసుని పిలిచి అతని కుమార్తెయగు వృందను జలంధరునకిచ్చి వివాహమును చేయుమని గోరెను (33). రాక్షసశ్రేష్ఠుడు, వీరుడు, బుద్ధి మంతుడు, తన పనిలో నిపుణుడు అగు కాలనేమి సముద్రుని కోరిక యోగ్యముగా నున్నదని తలంచెను. ఓ మహర్షీ (34) సముద్రపుత్రుడు, వీరుడునగు జలంధరునకు ఆతడు ప్రాణప్రియురాలగు తన కుమార్తెనిచ్చి వేదోక్తవిధానముతో వివాహమును చేసెను (35). వారిద్దరి వివాహములో అపుడు గొప్ప ఉత్సవము జరిగెను. ఓ మహర్షీ ! నదులు, నదములు, సమస్తరాక్షసులు ఆనందమును పొందిరి (36).*

*భార్యతో గూడియున్న కుమారుని చూచి సముద్రుడు మిక్కలి ఆనందించి, బ్రాహ్మణులకు, మరియు ఇతరులకు యథావిథిగా దానమునిచ్చెను (37). పూర్వము దేవతలచే పరిజితులై పాతాళమునందు తలదాచుకొనిన రాక్షసులు నిర్భయముగా భూమండలమునకు వచ్చి ఆతనిని ఆశ్రయించిరి (38). సముద్రపుత్రుడగు ఆతనికి తన కుమార్తెను కన్యాదానము చేసిన కాలనేమి, మరియు ప్రముఖులగు ఇతరరాక్షసులు మిక్కిలి ఆనందమును పొందినవారై, దేవతలను నిర్జించుట కొరకు ఆతని కొలువులో చేరిరి (39). వీరుడు, సముద్రపుత్రుడు, రాక్షసవీరులలో శ్రేష్ఠుడు అగు ఈ జలంధరుడు మిక్కిలి సుందరియగు భార్యను పొంది, శుక్రుని ప్రభావముచే ఇంద్రియ జయముగలవాడై రాజ్యము నేలెను (40).*

*శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు యుద్ధ ఖండలో జలంధరుని పుట్టుక, వివాహము అనే పదునాల్గవ అధ్యాయము ముగిసినది (14).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 751🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 14 🌴*

*🌻 The birth of Jalandhara and his marriage - 4 🌻*

Sanatkumāra said:—
30. After saying so he called Śukra and performed his coronation. Brahmā then took leave of the ocean and disappeared.

31. Thereafter the ocean with blooming eyes saw the son, took him to his abode joyously.

32. With a joyous heart he nurtured the boy with diverse great means. The boy grew into a beautiful youth of exquisite limbs and wonderful splendour.

33. Then the ocean invited the great Asura Kālanemi and requested him to give his daughter named Vṛndā in marriage to his son.

34. O sage, the heroic Asura Kālanemi,[2] foremost among the Asuras, intelligent and efficient in his activities, welcomed the request of the ocean.

35. He gave his beloved daughter to Jalandhara, the brave son of the ocean, in marriage performing the nuptial rites according to the Brāhma style.[3]

36. O sage, great festivities were held in the marriage. The rivers and Asuras were happy.

37. The ocean too became extremely happy seeing his son united to a bride. In accordance with the rules he made charitable gifts to the brahmins and others.

38. Those Asuras who had been formerly defeated by the gods and had sought shelter in Pātāla came fearlessly to the Earth and resorted to him.

39. Kālanemi and other Asuras were pleased after giving the daughter in marriage to the son of the ocean. In order to defeat the gods they resorted to him.

40. The heroic son of the ocean, Jalandhara, foremost among the Asura warriors, received a very beautiful lady as his wife and he ruled over the kingdom with the support of Śukra.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 05 / Osho Daily Meditations  - 05 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 05. పునరాలోచనా జ్ఞానం 🍀*

*🕉 . వేరేదేదీ బాధ్యత తీసుకోదు. మీరే చూడండి. మీరు క్షణంలో జ్ఞానవంతులైతే, సమస్య ఉండదు. కానీ ఆ క్షణం పోయినప్పుడు అందరూ జ్ఞానవంతులే. పునరాలోచనా జ్ఞానానికి విలువ లేదు. 🕉*

*మీరు పోరాడి, నస పెట్టి, తిట్టిన తర్వాత, మీరు జ్ఞానవంతులయ్యి దానిలో ప్రయోజనం లేదని గమనిస్తే, అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇది నిరర్థకం - మీరు ఇప్పటికే హాని చేసారు. ఈ జ్ఞానం కేవలం నకిలీ జ్ఞానం. మీరు అర్థం చేసుకున్నట్లుగా ఇది మీకు అనుభూతిని ఇస్తుంది. అది అహంకారం చేసే మోసం. ఈ జ్ఞానం సహాయం చేయదు. మీరు ఒక పని చేస్తున్నప్పుడు, ఆ క్షణంలోనే, ఏకకాలంలో, మీకు అవగాహన ఏర్పడాలి మీరు చేస్తున్నది పనికిరానిదని. అది జరుగుతున్నప్పుడే చూడగలిగితే మీరు ఆ పని చెయ్యలేరు. తమ ఎరుకకు వ్యతిరేకంగా ఎప్పటికీ వెళ్లలేరు. దానికి వ్యతిరేకంగా వెళితే, ఆ ఎరుకే కాదు. ఇంకేదో తప్పుగా అర్ధమయ్యింది.*

*కాబట్టి గుర్తుంచుకోండి, వెరే ఎవరూ బాధ్యత తీసుకోరు. సమస్య ఏదో మీలో మరుగుతోంది. మీరు ఇష్టపడే వ్యక్తి అత్యంత దగ్గరగా ఉంటారు. మీరు దానిని రోడ్డుపై ప్రయాణిస్తున్న అపరిచితుడిపై విసిరేయలేరు, కాబట్టి మీరు మీ అర్ధంలేని వాటిని విసిరి, కురిపించే వ్యక్తి మీ సన్నిహితుడు అవుతాడు. కానీ దానిని నివారించాలి, ఎందుకంటే ప్రేమ చాలా సున్నిత మయినది. అతిగా చేస్తే ప్రేమ కనుమరుగవుతుంది. మరొకరు ఎప్పుడూ బాధ్యత వహించరు. ఇది మీలో శాశ్వత అవగాహన యొక్క స్థితిగా మార్చడానికి ప్రయత్నించండి, మీరు మరొకరిలో ఏదైనా తప్పు పట్టడం ప్రారంభించినప్పుడల్లా దాన్ని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, ఆ విషయం అక్కడే వదిలేయండి. మరియు క్షమించమని అడగండి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 05 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 05. RETROSPECTIVE WISDOM 🍀*

*🕉 The other is never responsible. Just watch. If you become wise in the moment, there will be no problem. But everybody becomes wise when the moment is gone. Retrospective wisdom is worthless.  🕉*

*When you have fought and nagged and bitched and then you become wise and see that there was no point in it, it is too late. It is meaningless-you have already done the harm. This wisdom is just pseudo-wisdom. It gives you a feeling "as if" you have understood. That is a trick of the ego. This wisdom is not going to help. When you are doing the thing, at that very moment, simultaneously, the awareness should arise, and you should see that what you are doing is useless. If you can see it when it is there, then you cannot do it. One can never go against one's awareness, and if one goes against it, that awareness is not awareness. Something else is being mistaken for it.*

*So remember, the other is never responsible for anything. The problem is something boiling within you. And of course the one you love is closest. You cannot throw it on some stranger passing on the road, so the closest person becomes the place where you go on throwing and pouring your nonsense. But that has to be avoided, because love is very fragile. If you do it too much, if you overdo it, love can disappear. The other is never responsible. Try to make this such a permanent state of awareness in you that whenever you start finding something wrong with the other, remember it. Catch yourself redhanded, and drop it then and there. And ask to be forgiven.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 462 - 1  / Sri Lalitha Chaitanya Vijnanam  - 462  - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।*
*కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀*

*🌻 462. ‘సురనాయికా’ - 1 🌻* 

*శ్రీమాత దేవతలకు నాయకురాలు అని అర్ధము. 'సుర' లనగా దేవతా ప్రజ్ఞలు, వెలుగుతో కూడిన ప్రజ్ఞలు. ఈ ప్రజ్ఞలు కారణముగనే జీవుడు సుఖపడగలడు. సుఖము, ఆనందము, వికాసము, జ్ఞానము, వైభవము, ప్రశాంతత, దివ్యనుభూతి, దివ్య జ్ఞానము, దివ్యశక్తి, దివ్యశరీరము- యిట్టి శుభ గుణములన్నియూ వెలుగు రూపములైన దేవతల అధీనమున శ్రీమాత యుంచినది. శ్రీదేవి కార్యమే దేవతా కార్యము. వారు యజ్ఞస్వరూపులు. వారి జీవనము యజ్ఞార్థ జీవనము. వారు సహజముగ సాత్త్వికులు. ఇట్టి వారిని నడిపించునది శ్రీమాతయే. వారికి నాయకత్వము వహించి నడిపించు చుండును. శ్రీమాత నారాధించు భక్తులయందు, సత్త్వగుణోపేతమైన దేవతలు మేల్కాంచి వారిని నడిపింతురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 462 - 1  🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika*
*Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻*

*🌻 462. 'Suranaeika' - 1 🌻*

*It means Srimata is the leader of deities. As 'sura' is divine prajna, prajna with light. Being of the cause of these prajnas, the living being can be happy. Happiness, joy, development, wisdom, splendor, serenity, divine feeling, divine knowledge, divine power, divine body - all these auspicious qualities are under the sway of the deities who are the forms of light. Sridevi's work is the work of God. They are Yajnasvarupas. Their life is a life of worship. They are natural sattviks. Srimata is the one who leads them. In the devotees of Srimata Naradhinchu, demigods of sattva qualities awaken and guide them.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

No comments:

Post a Comment