✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 16 🌴
16. వక్తుమర్హస్యశేణ దివ్యా హ్యాత్మవిభూతయ: |
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్టసి ||
🌷. తాత్పర్యం :
నీవు ఏ దివ్యవిభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందును వ్యాపిచి యుందువో వాటన్నింనిటిని దయతో నాకు విశదముగా తెలియజేయుము.
🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చిన తన అవగాహనచే అర్జునుడు సంతుష్టి చెందియే ఉన్నట్లుగా ఈ శ్లోకమున గోచరించుసునది. కృష్ణుని కరుణ వలన అతడు స్వానుభావమును, బుద్ధిని, జ్ఞానమును మరియు వాని ద్వారా తెలిసికొనదగిన సర్వవిషయములను ఏరుగజాలి శ్రీకృష్ణుని దేవదేవునిగా అవగతము చేసికొనగలిగెను. తనకెటువంటి సందేహము లేకున్నను ఇచ్చట అర్జునుడు శ్రీకృష్ణుని సర్వవ్యాపకక లక్షణమును వివరింపుమని అడుగుచున్నాడు.
శ్రీకృష్ణభగవానుని ఈ సర్వవ్యాపక లక్షణమునకే సామాన్యజనులు, ముఖ్యముగా నిరాకారవాదులు ఎక్కువ ప్రాముఖ్యము నొసగుటయే అందులకు కారణము. కనుకనే వివిధశక్తుల ద్వారా శ్రీకృష్ణుడు ఏ విధముగా సర్వవ్యాపియై యుండునో అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. ఈ ప్రశ్నను అర్జునుడు సామాన్యజనుల పక్షమున అడిగినట్లుగా ప్రతియొక్కరు గుర్తింపవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 388 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 16 🌴
16. vaktum arhasy aśeṣeṇa divyā hy ātma-vibhūtayaḥ
yābhir vibhūtibhir lokān imāṁs tvaṁ vyāpya tiṣṭhasi
🌷 Translation :
Please tell me in detail of Your divine opulences by which You pervade all these worlds.
🌹 Purport :
In this verse it appears that Arjuna is already satisfied with his understanding of the Supreme Personality of Godhead, Kṛṣṇa. By Kṛṣṇa’s grace, Arjuna has personal experience, intelligence and knowledge and whatever else a person may have, and through all these agencies he has understood Kṛṣṇa to be the Supreme Personality of Godhead. For him there is no doubt, yet he is asking Kṛṣṇa to explain His all-pervading nature.
People in general and the impersonalists in particular concern themselves mainly with the all-pervading nature of the Supreme. So Arjuna is asking Kṛṣṇa how He exists in His all-pervading aspect through His different energies. One should know that this is being asked by Arjuna on behalf of the common people.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment