శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 462 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 462 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀
🌻 462. ‘సురనాయికా’ - 1 🌻
శ్రీమాత దేవతలకు నాయకురాలు అని అర్ధము. 'సుర' లనగా దేవతా ప్రజ్ఞలు, వెలుగుతో కూడిన ప్రజ్ఞలు. ఈ ప్రజ్ఞలు కారణముగనే జీవుడు సుఖపడగలడు. సుఖము, ఆనందము, వికాసము, జ్ఞానము, వైభవము, ప్రశాంతత, దివ్యనుభూతి, దివ్య జ్ఞానము, దివ్యశక్తి, దివ్యశరీరము- యిట్టి శుభ గుణములన్నియూ వెలుగు రూపములైన దేవతల అధీనమున శ్రీమాత యుంచినది. శ్రీదేవి కార్యమే దేవతా కార్యము. వారు యజ్ఞస్వరూపులు. వారి జీవనము యజ్ఞార్థ జీవనము. వారు సహజముగ సాత్త్వికులు. ఇట్టి వారిని నడిపించునది శ్రీమాతయే. వారికి నాయకత్వము వహించి నడిపించు చుండును. శ్రీమాత నారాధించు భక్తులయందు, సత్త్వగుణోపేతమైన దేవతలు మేల్కాంచి వారిని నడిపింతురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻
🌻 462. 'Suranaeika' - 1 🌻
It means Srimata is the leader of deities. As 'sura' is divine prajna, prajna with light. Being of the cause of these prajnas, the living being can be happy. Happiness, joy, development, wisdom, splendor, serenity, divine feeling, divine knowledge, divine power, divine body - all these auspicious qualities are under the sway of the deities who are the forms of light. Sridevi's work is the work of God. They are Yajnasvarupas. Their life is a life of worship. They are natural sattviks. Srimata is the one who leads them. In the devotees of Srimata Naradhinchu, demigods of sattva qualities awaken and guide them.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment