DAILY WISDOM - 93 - 2. The Universal Urge is Really the Spiritual Impetus / నిత్య ప్రజ్ఞా సందేశములు - 93 - 2. విశ్వవ్యాప్త కోరిక నిజంగా ఆధ్యాత్మిక ప్రేరణ




🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 93 / DAILY WISDOM - 93 🌹

🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 2. విశ్వవ్యాప్త కోరిక నిజంగా ఆధ్యాత్మిక ప్రేరణ 🌻


ఆధ్యాత్మికంగా ఎదగాలనేది విశ్వం మనకు ఎల్లప్పుడూ ఇచ్చే ప్రేరణ. నిజానికి ఆ ప్రెరణని నిర్దుష్టంగా ఆధ్యాత్మికం అని అనాల్సిన అవసరం లేదు. ఎదగాలనే ఇచ్ఛ, సంకల్పం విశ్వం లోని ప్రతి జీవికి ఉంటుంది. ఆ సామూహిక సంకల్పమే ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క ప్రేరణ అని చెప్పవచ్చు. భౌతికంగా చూస్తే ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే ఆ సంకల్పం పైకి ప్రస్ఫుటంగా కనిపించకపోవచ్చు. కానీ కనిపించదు కాబట్టి లేదు అని మనం అనలేము.

కేవలం పైకీ కనిపించేది మాత్రమే మనం కాదు. అవసరం వచ్చినప్పుడు పైకి ప్రకటితమయ్యే మనలోని అంతర్లీన సమర్ధతలు, సంకల్పాలు సైతం మనలోని భాగమే. అవి ఈ జన్మలో ప్రకటితమవ్వచ్చు, పూర్వ లేదా వచ్చే జన్మలలో కావచ్చు. ఈ అధ్యామిక ఎదుగుదల పట్ల మనకున్న ప్రేరణ నిజానికి విశ్వవ్యాప్తమైనది. వ్యక్తిగతమైనది కాదు. కనీసం సమాజ స్థాయిలో సామూహికమైనది కూడా కాదు. విశ్వవ్యాప్తమైనది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 93 🌹

🍀 📖 The Ascent of the Spirit 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 2. The Universal Urge is Really the Spiritual Impetus 🌻


The Universal Urge is really the Spiritual Impetus, and we need not use the word ‘spiritual’ to designate it. An all-consuming impulse towards a Common Aim is what may be regarded as the spiritual aspiration or the basic urge of the individual. It may not be visible in the proper intensity or proportion at certain given levels of experience, but that an expected percentage of it is not visible on the surface is not a reason why one should not give it the credit it deserves.

All that we are inside does not come to the surface of our conscious life, as we all very well know; yet, we are that which is there ready to come to the surface of our mind one day or the other as the motivating force of our lives, whether in this life or in the lives to come. The urges of human nature are really universal in their comprehension; they are not individual, they are not even social in the sense in which we try to define society.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment