కపిల గీత - 213 / Kapila Gita - 213


🌹. కపిల గీత - 213 / Kapila Gita - 213 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 23 🌴

23. ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః|
భూతేషు బద్ధవైరస్య న మనః శాంతిమృచ్ఛతి॥


తాత్పర్యము : ప్రాణులలో అంతరాత్మగా ఉన్న భగవంతుని గుర్తింపక, బాహ్యముగానున్న భేదములను దర్శించు దురభిమాని అనవరతము రాగద్వేష దూషితుడగు చుండును. అందువలన, అతడు ఇతరులను ద్వేషించు చుండును. అట్లొనర్చుట తనలోనున్న భగవంతుని ద్వేషించుటే యగును. అట్టివానికి ఎన్నడును మనశ్శాంతి లభింపదు.

వ్యాఖ్య : పరమాత్మని ఆరాధిస్తూ కొందరిని ద్వేషిస్తారు. అంటే వారిలో ఉన్న నన్ను ద్వేషించినట్లే. ఎదుటివారి శరీరములో అంతర్యామిగా ఉన్న నన్ను ద్వేషించి, "వీడు శత్రువు", "పరమాత్మ నా ఎదురుగా ఉన్న విగ్రహములోనే ఉన్నాడు. పక్కనున్న ప్రాణిలో పరమాత్మ లేడు" అని తలుస్తాడు. ఇతరులతో వైరం పెట్టుకున్నవారు మనశ్శాంతిని పొందలేరు. వారి మనసుకి ఉన్న మురికి తొలగదు. మన ఇంట్లో స్వామికి ఆరాధన చేయడములో ఉద్దేశ్యం, ఆరాధన చేయని వాళ్ళని నిందించమని కాదు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 213 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 5. Form of Bhakti - Glory of Time - 23 🌴

23. dviṣataḥ para-kāye māṁ mānino bhinna-darśinaḥ
bhūteṣu baddha-vairasya na manaḥ śāntim ṛcchati


MEANING : One who offers Me respect but is envious of the bodies of others and is therefore a separatist never attains peace of mind, because of his inimical behavior towards other living entities.

PURPORT : In this verse, two phrases, bhūteṣu baddha-vairasya ("inimical towards others") and dviṣataḥ para-kāye ("envious of another's body"), are significant. One who is envious of or inimical towards others never experiences any happiness. A devotee's vision, therefore, must be perfect. He should ignore bodily distinctions and should see only the presence of the part and parcel of the Supreme Lord, and the Lord Himself in His plenary expansion as Supersoul. That is the vision of a pure devotee. The bodily expression of a particular type of living entity is always ignored by the devotee. It is expressed herein that the Lord is always eager to deliver the conditioned souls, who have been encaged within material bodies. Devotees are expected to carry the message or desire of the Lord to such conditioned souls and enlighten them with Kṛṣṇa consciousness. Thus they may be elevated to transcendental, spiritual life, and the mission of their lives will be successful.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment