శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 464 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 464 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 464 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 464 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀
🌻 464. 'కాంతిమతి' - 2 🌻
ఒక దినమున వున్నట్లు మనస్సు ఇంకొక దినమున నుండదు. అమితోత్సాహము కలిగిన వెనుక అమిత దుఃఖానుభవము కలుగ వచ్చును. ఇట్లు జీవులకు సుఖదుఃఖముల ననుభవింప జేయునది మనస్సే. దివ్యమున కున్ముఖముకాని మనస్సు ఈ విధముగ సతమత మగుచుండును. నిజముగ చంద్రునికి కళలున్నవా? భూమి జీవుల కట్లు కనిపించును. భూమిపై నున్న మానవులకు చంద్రుని హెచ్చు తగ్గులు, గ్రహణములు గోచరించును. అది భూమికి, చంద్రునికి, సూర్యునికి గల కోణముపై ఆధారపడి యున్నది. చంద్రు డెప్పుడునూ పూర్ణచంద్రుడే. ఇది తెలియవలెనన్నచో భూమి కక్ష్యను దాటవలెను. భూమి కక్ష్యను దాటిన మానవులకు చంద్రుడు అన్ని దినముల యందు పూర్ణమగు కాంతితోనే గోచరించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 464 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻
🌻 464. 'Kantimati' - 2 🌻
The mind is not the same as it is on the next day. There can be great sadness behind the great enthusiasm. It is the mind that makes these living beings experience joy and sorrow. A mind that is not oriented to the divine will remain in this way. Does the moon really have phases? It appears like that to the creatures of earth. The ups and downs of the moon and eclipses are visible to humans on earth. It depends on the angle of earth, moon and sun. The moon is always full moon. If we want to realise this, we have to cross the earth's orbit. For those who have crossed the limits of Earth's orbit, the moon is always full.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment