శ్రీ మదగ్ని మహాపురాణము - 255 / Agni Maha Purana - 255


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 255 / Agni Maha Purana - 255 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 74

🌻. శివ పూజా విధి వర్ణనము - 11 🌻


పిమ్మట ఆ దేవాధి దేవుని శిరస్సుపై అక్షతలను, పవిత్రకమును ఉంచి, హృదయముచే (నమః) అభి మంత్రిత మగు మూలమంత్రమును నూట ఎనిమిది సార్లు జపించవలెను. పిమ్మట కవచము చుట్టినదియు, అస్త్రముచే రక్షితమును అగు అక్షత - కుశలను, పుష్పములను, సమర్పించి ఉద్భవమగు ముద్రతో శివుని - ''ఓ ప్రభూ! గుహ్యాతి గుహ్యమును రక్షించుటకై, నేను చేసిన జపమును గ్రహింపుము దానిచే నీవుండగా, కృపచే నాకు సిద్ధి లభించు గాక'' అని ప్రార్థించవలెను.

భోగేచ్ఛ గల సాధకుడు పై శ్లోకము పఠించుచు, మూలమంత్ర ముచ్చరించుచు కుడి చేతిలో ఆర్ఘ్యోదకము గ్రహించి, దానిని భగవంతుని వరముద్రతో కూడిన హస్తములో విడువవలెను. మరల ఈ విధముగ ప్రార్థించవలెను. ''మహాదేవా! కల్యాణ స్వరూపుడవగు నీ పాదములను శరణు జొచ్చినాను. నేను చేసిన శుభాశుభ కర్మల నన్నింటిని తొలగింపుము. ''హూ క్షః శివుడే దాత. శివుడే భోక్త శివుడే ఈ సకల ప్రపంచము, సర్వత్ర శివునకు జయ మగు గాక. శివుడే నేను'' ఈ రెండు శ్లోకములు చదువుచు చేసిన జపమును శివునకు సమర్పింపవలెను. పిమ్మట పూర్వము చేసిన శివ మంత్రజపములో దశాంశము మరల జపించవలెను. (హోమపూర్తికి ఇది అవసరము) మరల అర్ఘ్యమిచ్చి భగవంతుని స్తుతించవలెను. పిమ్మట అష్టమూర్తి యగు శివునకు ప్రదక్షిణము చేసి సాష్టాంగ ప్రణామము చేయవలెను. నమస్కరించి శివద్యానము చేసి, చేత్రమునందు గాని, అగ్న్యాదులందు గాని శివుని ఉద్దేశించి హోమ - పూజాదులు చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు శివపూజావిధి వర్ణన మను డెబ్బది నాల్గవ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 255 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 74

🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 11 🌻


79-81. “May there be success for me by this by your presence here”. Having recited this verse at first, the worshipper should offer to Śambhu (Śiva) the waters of respect with the right hand with (the repetition of) the principal mantra. Whatever good or bad that I may do O lord! let it be cast off from me who am in the region of Śiva. Hūṃ kṣaḥ O Śaṅkara, Śiva is the giver, Śiva is the enjoyer, Śiva is all this universe.

82. Śiva is victorious everywhere. I am identical with Śiva. After having repeated these two verses, the japa should be dedicated to the lord.

83. One-tenth (should be dedicated) to the limbs of Śiva. Having offered the waters of respect, one should adore (the deity). After circumambulating (the deity), one should bow to the eight-formed (representing the five elements, sun, moon and yajamāna) deity by prostrating (the eight limbs touching the ground). After salutation (the deity) should be worshipped in a picture or in the fire by meditation etc.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment