శ్రీ మదగ్ని మహాపురాణము - 263 / Agni Maha Purana - 263
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 263 / Agni Maha Purana - 263 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 75
🌻. శివ పూజాంగ హోమ విధి - 8 🌻
యజ్ఞాగ్నికిని,శివునకును తనతో నాడీసంధానము చేసి శక్త్యను సారముగ మూలమంత్రముతో అంగసహితముగ దశాంశహోమము చేయవలెను. ఒక్కొక్క కర్షప్రమాణము గల ఘృత-క్షీర-మధులను,శుక్తిప్రమాణము గల పెరుగును. చారెడు పాయసమును హోమము చేయవలెను. లాజలు, సర్వభక్ష్యములు పిడికిలి ప్రమాణమున గ్రహించి హోమము చేయవలెను. మూలములు మూడు ముక్కలు ఒక ఆహుతిగా ఈయవలెను-ఫలములో వాటిప్రమాణ మెంత ఉండునో అంతే చేయవలెను. అన్నము ప్రమాణము గ్రాసములో సగము. చిన్న (కిన్‌మిస్ వంటి) వాటిని పర్యాయమునకు ఐదేసి గ్రహించి హోమము చేయవలెను. చెరకు ఒక కణుపు గ్రహించవలెను. లతలు రెండేసి అంగుళము లుండవలెను. పుష్పపత్రముల ప్రమాణము వాటి ప్రమాణము ననుసరించి ఉండవలెను. సమిధలు పది అంగుళములు పొడవుండవలెను.
కర్పూర-చందన-కేసర-కస్తూరీ-యక్షకర్దమములు కలాయ ప్రమాణమున (శనగగింజంత) ఉండవలెను. గుగ్గులు రేగి గింజంత ఉంచడవలెను. కందముల ఎనిమిదవ వంతుతో ఒక ఆహుతి చేయవలెను. ఈ విధముగ ఆలోచించి, యథావిధిగ ఆహుతుల నీయవలెను. ఈ విధముగ ప్రణవముతోను, బీజాక్షరములతోను హోమము సుసంపన్న మగు నటుల చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 263 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 75
🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 8 🌻
46. Having established a union among the god of the sacrificial fire, god Śiva and his soul situated in his arteries, (the worshipper) should offer oblations with the principal mantra befitting one’s capacity and using one-tenth of mantras as a. supplement.
47. A kārṣika (a particular weight) of the clarified butter, milk and honey and a śukti (twice that of kārṣika) of the curd and a handful of sweet porridge (should be) offered.
48-49. The worshipper should offer as deemed fit the oblation with all the eatables, a handful of fried grains, three pieces of roots and an equal number of fruits. Five halfmouthfuls of cooked rice, bits of sugarcane of the length of a span and stems of sacrificial creepers measuring two fingers in length should be offered into the fire.
50. The oblations of flowers and leaves should be according to their own measure. The sacrificial twigs should measure ten fingers in length. The camphor, sandal, saffron, musk and an ointment made of camphor, aggallochum and kakkola in equal parts (should also be offered).
51. (The worshipper) should make an oblation of the kalāya (a leguminous seed) and guggulu (a fragrant (gum-resin) of the size of the kernel of the jujube fruit and eight parts of the roots as laid down.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment