శ్రీ శివ మహా పురాణము - 781 / Sri Siva Maha Purana - 781


🌹 . శ్రీ శివ మహా పురాణము - 781 / Sri Siva Maha Purana - 781 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 19 🌴

🌻. దూత సంవాదము - 5 🌻


మహాదేవుడిట్లు పలికెను- ఓ గణశ్రేష్ఠా! బ్రాహ్మణుడు, దూత, శరణు జొచ్చినవాడు అగు ఈ రాహువును శిక్షించవలదు. శరణుజొచ్చిన వారిని రక్షించవలెను సుమా!(38)

సనత్కుమారుడిట్లు పలికెను- కరుణాంతరంగుడగు పార్వతీపతి ఇట్లు పలుకగా ఆ కింకరుడు బ్రాహ్మణుడను మాటను విన్న వెంటనే రాహువును విడిచిపెట్టెను (39). ఆపుడా పురుషుడు రాహువును ఆకాశములో విడిచి పెట్టి శివుని సమీపమునకు వచ్చి ఆ మహాదేవునితో దీనమగు వచనములతో నిట్లనెను (40).

పురుషుడిట్లు పలికెను- ఓ దేవదేవా! మహాదేవా ! కరుణానిధీ! శంకరా! శరణాగతవత్సలుడవగు నీవు దొరికిన ఆహారమును నేను విడిచిపెట్టునట్లు చేసితిని (41). ఓ స్వామీ! ఆకలి నన్ను బాధించుచున్నది. నేను మలమల మాడి పోవుచున్నాను. ఓ దేవదేవా! నేను ఏమి తినవలెను? ఓ ప్రభూ! నన్ను ఆజ్ఞాపించుము (42).

సనత్కుమారుడిట్లు పలికెను- గొప్ప లీలలను ప్రకటించువాడు, తన భక్తులకు హితము చేయు ఉత్కంఠ గలవాడు నగు ఆ మహాప్రభుడు ఆ పురుషుని ఈ మాటలను విని ఇట్లు బదులిడెను (43).

మహేశ్వరుడిట్లు పలికెను- నీవు మిక్కిలి ఆకలి గొని యున్నచో, ఆకలి నిన్ను బాధించుచున్నచో, నీవు నీ కాళ్లు చేతుల మాంసమును వెంటనే చక్కగా భక్షించుము (44).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 781🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 19 🌴

🌻 Jalandhara’s emissary to Śiva - 5 🌻



Sanatkumāra said:—

37. O sage, on hearing the words of the brahmin, the great lord, favourite of the distressed and helpless, spoke to his Gaṇa.


The great lord said:—

38. “Leave off this brahmin Rāhu, the emissary who has sought refuge. O excellent Gaṇa, those who seek shelter shall be protected, not punished.”


Sanatkumāra said:—

39. Commanded thus by the lord of Pārvatī, of sympathetic temperament, the Gaṇa set Rāhu free, immediately on hearing the word brahmin.

40. After leaving off Rāhu, the gaṇa came near Śiva and pleaded to the great lord in piteous words.


The gaṇa said:—

41. O great lord, O lord of the gods, O Śiva the merciful, O deity favourable to the devotees, my prey has been taken away.

42. O lord, I am tormented by hunger. So I am utterly emaciated. O lord of the gods, what shall be eaten by me? Please command me, O lord.


Sanatkumāra said:—

43. On hearing these words of the being, the great lord of wonderful sports, eager to help his own persons, replied.


The great lord said:—

44. “If you are badly in need of food, if hunger torments you, eat up immediately the flesh of your own hands and feet.”



Continues....

🌹🌹🌹🌹🌹




No comments:

Post a Comment