DAILY WISDOM - 126 : 5. The Aim of Philosophy is Direct Experience / నిత్య ప్రజ్ఞా సందేశములు - 126 : 5. తత్వశాస్త్రం యొక్క లక్ష్యం ప్రత్యక్ష అనుభవం



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 126 / DAILY WISDOM - 126 🌹

🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 5. తత్వశాస్త్రం యొక్క లక్ష్యం ప్రత్యక్ష అనుభవం 🌻


తత్వశాస్త్రం అనేది విశ్వంలోని విషయాల యొక్క ఆదిభౌతిక కారణాల ఆధారంగా, వాటివాటి అర్థాలు మరియు విలువల యొక్క ఒక సమగ్ర వివరణ. లోతైన ధ్యానం మరియు సాక్షాత్కారాల ద్వారా ఋషులు ఇచ్చిన జ్ఞానం యొక్క బలమైన పునాదులపై నిలబడటం ద్వారా తత్వశాస్త్రం ఆదిభౌటిక విషయాలకు అర్థం చెబుతుంది. అందువల్ల, తత్వశాస్త్రం యొక్క మూలం అలాగే లక్ష్యం కూడా ప్రత్యక్ష అనుభవం మాత్రమే. దీనికి మధ్యవర్తిత్వం ఉండదు. ఇంద్రియాల ద్వారా అనుభవం కాదు. తర్కానికి అందదు.

ఈ ప్రపంచంలో మనం సాధారణంగా పొందే జ్ఞానమంతా మధ్యవర్తిత్వంతో కూడుకున్నదే. ఎందుకంటే దీనికి జ్ఞాని, జ్ఞాత మరియు జ్ఞానం అనే ట్రిపుటి అవసరం. ఈ జ్ఞాన పద్ధతి ద్వారా, వాస్తవికత యొక్క అచంచలమైన జ్ఞానాన్ని పొందడం మనకు సాధ్యం కాదు, ఎందుకంటే జ్ఞానంలో మధ్యవర్తిత్వం శాశ్వతత్వం యొక్క లక్షణాలను ఆస్వాదించదు. మధ్యవర్తి జ్ఞానం యొక్క తాత్కాలిక స్వభావం మొత్తం శాస్త్ర ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది, ఎందుకంటే ఈ శాస్త్ర ప్రపంచం ఇంద్రియ బంధమైనది. విజ్ఞాన శాస్త్రం ఇంద్రియాలపై చాలా ఎక్కువ ఆధార పడుతుంది. దానివల్ల ఇంద్రియాల లోపాలకు, పరిమితులకు, ఈ విజ్ఞాన శాస్త్రం కూడా లోనవుతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 126 🌹

🍀 📖 The Philosophy of Life 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 5. The Aim of Philosophy is Direct Experience 🌻


Philosophy is a general exposition of the ultimate concepts, meanings and values of the things of the universe, by a resort to their final causes which range beyond the reach of the senses. It becomes possible for philosophy to concern itself with metaphysical essences by resting on the strong foundation of the testimony given by sages to deep meditation and realisation. Hence, the source as well as the aim of philosophy is direct experience, non-mediate, super-sensory and super-logical.

All knowledge that we ordinarily obtain in this world is mediate, for it requires the operation of the triune process of the knower, knowledge and the known. By this method of knowing, it is not possible for us to acquire an unshakable knowledge of reality, for mediacy in knowledge does not enjoy the characteristics of permanency. The transitory nature of mediate knowledge affects the whole world of science, for this latter is sense-bound. We need not point out here that science lays too must trust in the validity of sense perception and thus gets vitiated by the gross limitations to which the senses are obviously subject.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment