DAILY WISDOM - 128 : 7. The Reality that is Established in Philosophy / నిత్య ప్రజ్ఞా సందేశములు - 128 : 7. తత్వశాస్త్రంలో స్థిరపడిన వాస్తవికత




🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 128 / DAILY WISDOM - 128 🌹

🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 7. తత్వశాస్త్రంలో స్థిరపడిన వాస్తవికత 🌻


తత్వంలో స్థిరపడిన వాస్తవాన్ని లోతైన ధ్యాన స్థితిలో మాత్రమే అనుభవించగలం. ఇక్కడ చైతన్యం మరియు అస్తిత్వం ఒకటౌతాయి. అదిగా అవడం తప్ప దానిని అనుభూతి చెండలేము. విశ్వ చైతన్యానికి విషయ-వస్తువు సంబంధం లాంటిదేమీ లేదు. దానిని పూర్తిగా అద్వైత భావనలో అర్థం చేసుకోగలరు లేదా అస్సలు అర్థం చేసుకోలేరు. అంతేకాని మధ్యేమార్గం లేదు. ఇంద్రియాలు, తెలివితేటలు మరియు హేతువాదం దాని స్వభావాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి లేదా అనుభవంలో గ్రహించే ప్రయత్నంలో అస్సలు పనికిరావు.

పరమాత్మ యొక్క సాక్షాత్కారంలో వ్యక్తి యొక్క మనస్సు దాని అన్ని ద్వంద్వత్వ వర్గాలతో కలిపి పూర్తిగా అధిగమించబడుతుంది. మనస్సు వాస్తవికత యొక్క లక్షణాలలో పాలుపంచుకోదు. దానికి స్పృహ లేదు మరియు ప్రకృతిలో విశ్వవ్యాప్తం కాదు. మనస్సు అనేది ఒక బలహీనమైన వస్తుపరమైన, చేతన లేని వస్తువు. ఇది భౌతిక స్వభావం కలిగిన బాహ్య ప్రపంచాన్ని గ్రహించడంలో వ్యక్తి యొక్క సాధనంగా మాత్రమే పనిచేస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 128 🌹

🍀 📖 The Philosophy of Life 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 7. The Reality that is Established in Philosophy 🌻


The Reality that is established in philosophy is to be experienced in the state of deep meditation. Here consciousness and being become one. There is no way of entering into communion with it except by being it. There is no such thing as subject-object relationship in regard to the consciousness of what is universal. Either one knows it fully in non-dualistic communion or does not know it at all. The senses, the understanding and the reason are powerless instruments in one’s attempt at perfectly comprehending its nature or realising it in experience.

In the realisation of the Supreme Being the mind of the individual is completely transcended, together with all its dualistic categories. The mind does not partake of the characteristics of Reality. It is not conscious and also not universal in nature. The mind is a feeble objective insentient evolute acting as the individual’s instrument in the perception of the external world, which is physical in nature.



Continues...

🌹 🌹 🌹 🌹 🌹




No comments:

Post a Comment