శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 -3
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 -3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 99. పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ ।
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀
🌻 484. 'డాకినీశ్వరీ' - 3 🌻
ఇందు విశుద్ధి చక్రము ఆకాశ తత్వమునకు సంబంధించినది. అందు శబ్దము ప్రధానమగు గుణము. విశుద్ధి చక్రమందున్న శ్రీమాతను డాకినీ దేవి అని పిలుతురు. ఈ డాకినీ దేవి పదునాలుగు దళములు గల పద్మము యొక్క కర్ణిక యందు పాటలీపుష్పముతో సమానమైన రంగు కలిగి యుండును. ఈ పుష్పము కేంద్రమున తెల్లని రంగు చుట్టునూ ఎఱుపు రంగుతో కూడి సుకుమారముగ నుండును. డాకినీ దేవి మూడు కన్నులు కలదియై యుండును. ఖట్వాంగమను ఆయుధమును ధరించును. ఖట్వాంగ మనగా వెన్నెముకకు తగిలించిన పుట్టెవలె గోచరించు ఆయుధము. మిగిలిన మూడు హస్తముల యందు పాశము, అంకుశము, వరముద్ర ధరించి యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 484 -3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 Payasanna priya tvaksdha pashuloka bhayankari
amrutadi mahashakti sanvruta dakinishvari ॥ 99 ॥ 🌻
🌻 484. 'Dakinishwari' - 3 🌻
In this, Vishuddhi Chakra is related to Akasha Tattva. Here sound is the main quality. Sri Mata in Vishuddhi Chakra is called Dakini Devi. This Dakini Devi has the same color as a palm flower in the atrium of a fourteen-armed lotus. This flower has a red color around the white color in the center. Dakini Devi has three eyes. Wears the weapon by name Khatwanga. Khatwanga is a weapon that looks like a sword attached to our spine. In the remaining three hands he wears Pasha, Ankusha and Varamudra.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment