శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 - 7
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 - 7 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 99. పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ ।
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀
🌻 484. 'డాకినీశ్వరీ' - 7 🌻
ఈ పదహారు శక్తులు పదహారు దళముల యందుండును. ఈ పదహారు శక్తులును సంస్కృత భాషయందలి పదహారు అచ్చులుగ తెలియబడుచున్నవి. అవి 'అ' నుండి 'అః' వరకు పదహారు అక్షరములు. అచ్చులు అమృత మయములు. వాని వలననే హల్లులు ఆధారపడి యుండును. అచ్చులు లేని హల్లులు పలుకుటకు వీలుపడదు. ఉదాహరణకు 'హ' అనినపుడు 'హ్ + అ' అయి వున్నది. అట్లే 'రి' అనినపుడు 'ర్ + ఇ' అయి వున్నది అట్లు హరి యందు హ్, అ, ర్, ఇ వున్నవి. అట్లు అచ్చులు లేని హల్లులు పలుక ప్రయత్నించుటకు వీలుపడదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 484 -7 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 Payasanna priya tvaksdha pashuloka bhayankari
amrutadi mahashakti sanvruta dakinishvari ॥ 99 ॥ 🌻
🌻 484. 'Dakinishwari' - 7 🌻
These sixteen powers are sixteen petals. These sixteen powers are known as sixteen vowels in Sanskrit language. They are sixteen letters from 'A' to 'Ah'. Vowels are nectars. Consonants depend on him. Consonants without vowels cannot be pronounced. For example, when 'Ha' is 'H + A'. So when 'ri' is 'r + e' then Hari has h, a, r and e. It is not possible to attempt to pronounce consonants without such vowels.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment