🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 2🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।
దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀
🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀
🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 2 🌻
ఇచ్చట గల దేవి రెండు ముఖములు గలది. రెండు ముఖములనగా పంచభూతములలోని ఆకాశము, వాయు తత్త్వములు కలిగినది. అని తెలియవలెను. విశుద్ధి ఆకాశ తత్త్వమునకు, అనాహతము ఆకాశ వాయుతత్త్వములకు నిలయము. అట్లే అవరోహణ క్రమమున మూలాధారము వరకు చేరినపుడు పంచతత్త్వములు అవతరించి యుండును. ఆకాశమున మిగిలిన నాలుగు తత్త్వములు ఇమిడి యున్నవి. అట్లే అనాహత మందలి వాయు తత్త్వమున పదార్థము, నీరు, అగ్ని ఇమిడి యున్నవి. ఆకాశమొక ముఖముగాను, వాయువు ఒక ముఖముగాను, రెండు ముఖములతో శ్రీమాత అనాహతమున యున్నదని తెలియవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 485 to 494 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya
danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻
🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya
mahavirendra varada rakinyanba svarupini ॥ 101 ॥ 🌻
🌻 Description of Nos. 485 to 494 Names - 2 🌻
The goddess here has two faces. Akasha and Vayu Tattvams of Panchabhutas are the two faces. Vishuddhi is the home of Akasha Tattva and Anahata is the home of Akasha and Vayutattva. In the same way in descending order, when moolaadhara is reached, the Panchatattvas will appear. The sky contains the remaining four tattvas. Similarly the Vayu Tattva in Anaahata includes matter, water and fire. It should be known with sky as one face and air as another face, Srimata in Anahata has two faces.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment