శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 5


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 5🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।
దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀

🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀

🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 5 🌻


అక్షమాల యనగా అక్షములతో కూడిన చక్రము అని కూడ అర్థము. కేంద్రము నుండి పరిధికి, స్థూలము నుండి సూక్ష్మమునకు, లోపలి నుండి వెలుపలకు ప్రజ్ఞా ప్రసారము చేయునది చక్రము. అట్లే వెలుపల నుండి లోపలకు, స్థూలము నుండి సూక్ష్మమునకు, పరిధి నుండి కేంద్రమునకు ఆకర్షించు తత్త్వమీ చక్రమున కున్నది. ఇట్లు పురోగమనము, తిరోధానము చక్ర వ్యూహముగ శ్రీమాత నిర్వహించు చుండును. శ్రీమాత ధరించు చక్రమునకు ఆకర్షణ, వికర్షణము లున్నవి. జీవులను వెలుపలకు లోపలకు ప్రవేశింపజేసి లోపల వెలుపల అను భేదమును నశింపజేసి జీవుల నుద్ధరించుట నిర్వర్తించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 485 to 494 - 5 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya
danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻

🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya
mahavirendra varada rakinyanba svarupini ॥ 101 ॥ 🌻

🌻 Description of Nos. 485 to 494 Names - 5 🌻


Akshamala also means wheel with axles. Chakra transmits wisdom from center to range, from subtle to gross, from inside to outside. Same way this chakra has the attraction from the outside to the inside, from the gross to the subtle, from the range to the center. Thus progress and retreat are managed by Srimata. Chakra worn by Shrimata has attraction and repulsion. Bringing living beings outside and inside and destroying the difference between inside and outside, she performs the upliftment of living beings.



Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment