శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 495 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 495 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 102. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥ 🍀
🌻 495. 'మణిపూరాబ్జ నిలయా' - 1 🌻
మణిపూర మను పదిరేకుల పద్మము నందు వసించునది శ్రీమాత అని అర్జము. మణిపూర పద్మము నాభి యందుండును. పది రేకులతో కూడి యుండును. అందు ఐదు రేకులు (దళములు) అధోముఖముగను ఐదు రేకులు ఊర్ధ్వముఖముగను యుండును. అధోముఖపు దళములు బహిర్ మనస్సుగను, ఊర్ధ్వముఖపు దళములు అంతర్ మనస్సుగను పనిచేయును. మణిపూరక పద్మము కారణముగ లోపల, బైట అంత రంగము, బహిరంగము అను భేదము శ్రీమాత సృష్టించును. బహిరంత రంగముల దృష్టి కలవారు ఋషులు, యోగులు. కేవలము బాహ్యదృష్టి కలవారు సామాన్య జీవులు. వీరిని పశువులందురు. పశువులు, పశ్యకులని పేర్కొందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻102. Manipurabja nilaya vadanatraya sanyuta
vajradikayudhopeta dayaryadibhiravruta ॥ 102 ॥ 🌻
🌻 495. Manipurabja - 1 🌻
Srimata is the one who who resides in the ten-petalled lotus called Manipura. The lotus of Manipura is in the navel. It consists of ten petals. There are five petals facing downwards and five petals facing upwards. The downward petals act as the outer mind and the upward petals act as the inner mind. It's because of Manipuraka Padma that Srimata creates the difference such as inner, outer, inner space and outer space. Sages and yogis have the vision of inner and outer realms. The ordinary beings have only outward vision. These are called Animals. Animals are called Pashyakulu.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment