శ్రీ శివ మహా పురాణము - 799 / Sri Siva Maha Purana - 799
🌹 . శ్రీ శివ మహా పురాణము - 799 / Sri Siva Maha Purana - 799 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 22 🌴
🌻. శివ జలంధరుల యుద్ధము - 3 🌻
మహజ్ఞాని యగు సన్న్యాసి, యుద్ధములో శత్రువును ఎదుర్కొని మరణించు వాడు సూర్యమండలమును దాటి పరమపదము (మోక్షము) ను పొందుట నిశ్చయము (18). బుద్దిమంతులు ఎప్పుడైననూ, ఎక్కడనైననూ మృత్యువునకు భయపడరాదు. ఏలయన, సర్వ ఉపాయములచేతనైననూ మృత్యువు నుండి తప్పించుకొనుట సంభవము కాదు (19). ఓ వీరులారా! పుట్టిన ప్రాణులకు దేహముతో బాటు మృత్యువు కూడ పుట్టుచున్నది. ఈనాడు గాని, లేదా వందసంవత్సరముల తరువాతనైననూ ప్రాణులు మరణించుట నిశ్చయము (20). కావున మృత్యుభయమును పారద్రోలి ఆనందముతో యుద్దములో పాల్గొనుడు. అట్లు చేయుట వలన ఇహపరములలో అన్ని విధములుగా పరమానందము లభించుననుటలో సందేహములేదు (21).
సనత్కుమారుడిట్లు పలికెను - ఆతడిట్లు పలికి తన వీరులకు పరిపరి విధముల బోధించిననూ, వారు ధైర్యమును పట్జజాలక భయపడి యుద్ధమునుండి శీఘ్రముగా పారిపోయిరి (22). అపుడు మహావీరుడు, సముద్రపుత్రుడనగు జలంధరుడు తన సైన్యము పలాయనమును చిత్తగించు చుండుటను గాంచి మిక్కిలి కోపమును పొందెను (23). అపుడు క్రోథముతో నిండిన హృదయముగల జలంధరుడు భయంకరమగు పిడుగును బోలిన ధ్వనితో రుద్రుని యుద్ధమునకు ఆహ్వానించెను (24).
జలంధరుడిట్లు పలికెను - ఓ జటా ధారీ! ఇపుడు నీవు నాతో యుద్ధమును చేయుము. వీరిని సంహరించుట వలన నీకు లాభమేమి? నీకు గల కొద్ది పాటి బలమును నాకు చూపించుము (25).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 799 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 22 🌴
🌻 Description of Jalandhara’s Battle - 3 🌻
18. The wandering recluse of supreme knowledge and wisdom as well as he who dies fighting face to face, attain the greatest region after breaking through the solar sphere.
19. No sensible man should ever be afraid of death. Death is inevitable notwithstanding all the remedies employed to ward it off.
20. O heroes, death is congenital to any being born. Either today or at the end of a hundred years all living beings are sure to die.
21. Hence, cast off all fear for death. Come and fight in war joyously. In every respect there is certainly a great bliss here and hereafter.
Sanatkumāra said:—
22. Saying this, he tried to encourage his heroes in several ways. But the frightened demons did not regain courage. They fled from the battle in a trice.
23. On seeing his army on the rout, the heroic son of the ocean Jalandhara became very furious.
24. Then the infuriated Jalandhara challenged for a battle in a stentorian voice like the sound of fierce thunderbolt.
Jalandhara said:—
25. O ascetic, fight with me now. What is the use of slaying these? Show me what little strength you have.
Continues....
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment