🌹 . శ్రీ శివ మహా పురాణము - 804 / Sri Siva Maha Purana - 804 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 23 🌴
🌻. పాతివ్రత్య భంగము - 2 🌻
అది చెడు శకునమని గుర్తించి ఆమె భయభీతురాలై ఏడుస్తూ గోపురములయందు, ప్రాసాద ఉపరి-భాగమునందు, మరియు ఇతర స్థలములలో ఎక్కడైననూ సుఖమును పొందలేకపోయెను (9). అపుడా యువతి ఇద్దరు సఖురాండ్రతో గూడి నగరోద్యానవనమునకు వచ్చెను. ఆమె అక్కడ విహరించియు ఏ స్థలమునందైననూ సుఖమును పొందలేదు (10) అపుడా జలంధరుని భార్య నిరాశతో ఉద్వేగముతో నిండిన మనస్సు గలదై తనకు తెలియకుండగనే ఆ వనములో ఒక భాగమునుండి మరియొక భాగమునకు తిరుగజొచ్చెను (11). అట్లు తిరుగాడుచున్న ఆ సుందరి అతిభయంకరాకారులు, సింహముఖము గలవారు, కోరలతో ప్రకాశించువారు అగు ఇద్దరు రాక్షసులను చూచెను (12).
ఆమె వారిని చూచి చాల భయపడి పారిపోతూ, శిష్యులతో గూడి శాంతముగా మౌనముగా కూర్చుండియున్న తపస్వని ఒకనిని గాంచెను (13). ఆమె భయముతో తన లతవంటి బాహువును ఆతని కంఠము చుట్టూ వేసి 'ఓ మునీ! నిన్ను శరణు పొందినాను; నన్ను రక్షింపుము' అని పలికెను (14). రాక్షసులచే తరుమబడి మిక్కిలి భయపడియున్న ఆమెను గాంచి అపుడా ముని వెంటనే హుంకారమాత్రముచే ఆ భయంకర రాక్షసులు పారిపోవునట్లు చేసెను (15). వారిద్దరు ఆతని హుంకారమునకు భయపడి వెనుకకు మరలుటను గాంచి ఆ జలంధరపత్ని మనస్సులో మిక్కిలి ఆశ్చర్యమును పొందెను. ఓ మునీ! (16) అపుడా బృంద తొలగిన భయము గలదై ఆ ముని వర్యునకు సాష్టాంగ ప్రణామమాచరించి చేతులు జోడించి ఇట్లు పలికెను (17).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 804 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 23 🌴
🌻 Outraging the modesty of Vṛndā - 2 🌻
9. On realising that it was a bad portent, the terrified lady began to cry. She did not feel happy at all in the spacious terraces and towers of the palace.
10. With two of her friends she then went to the park in the city. Even there she did not find herself at ease.
11. Then she, the dejected gloomy wife of Jalandhara, wandered from forest to forest. She was not conscious of even herself.
12. The wandering lady saw two demons of terrible leonine faces with shining curved fanglike teeth.
13. Terrified much on seeing them, the lady fled from there and saw an ascetic of calm countenance observing silence and accompanied by his disciple.
14. Putting her tender creeperlike hands round his neck due to fright she gasped out—“O sage, save me. I have sought refuge in you.”
15. Seeing the agitated lady followed by the demons the sage drove them back with a loud bellowing sound of “Hum”.
16. O sage, seeing them routed and terrified by the mere Huṃkāra, the wife of the king of Daityas was struck with a great wonder in her heart.
17. Freed from the fear she bowed down to the great sage with palms joined in reverence and prostrated herself in front of him. Vṛndā then spoke.
Continues....
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment