1) 🌹17, DECEMBER 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 473 / Bhagavad-Gita - 4732 🌹
🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -04 / Chapter 12 - Devotional Service - 04 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 829 / Sri Siva Maha Purana - 829 🌹
🌻. శంఖచూడుని జననము - 3 / The birth of Śaṅkhacūḍa - 3 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 86 / Osho Daily Meditations - 86 🌹
🍀 86. నిర్ణయాలు / 85. DECISIONS 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 512-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 512-2 🌹
🌻 512. 'దధ్యన్నాసక్త హృదయా' - 2 / 512. 'Dadhyannasakta Hrudaya' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 17, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వివాహ పంచమి, Vivah Panchami 🌻*
*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 36 🍀*
*69. మంగల్యచారుచరితః శీర్ణః సర్వవ్రతో వ్రతీ |*
*చతుర్ముఖః పద్మమాలీ పూతాత్మా ప్రణతార్తిహా*
*70. అకించనః సతామీశో నిర్గుణో గుణవాఞ్ఛుచిః |*
*సంపూర్ణః పుండరీకాక్షో విధేయో యోగతత్పరః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : బహిర్ముఖ అంతర్ముఖత్వాలు : చేతన మనలో బహిర్ముఖంగా కేంద్రీకృతమై వుంటున్నందు వల్లనే బాహ్యసత్త యందు మనం నివసించడం జరుగుతూ వున్నది. బాహ్య సత్తలో కలగాపులగపు స్థితిలో ఉండే అన్న, ప్రాణ, మనో, హృక్పురుష చేతనల నిజస్థితిని మనం పూర్తిగా తెలుసుకోవాలంటే, బహిర్ముఖ చేతనను అంతర్ముఖ మొనర్చి అంతస్సత్త యందు కేంద్రీకరించడం అవసరం. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, దక్షిణాయణం,
మార్గశిర మాసము
తిథి: శుక్ల పంచమి 17:34:51
వరకు తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: ధనిష్ట 26:55:05
వరకు తదుపరి శతభిషం
యోగం: హర్షణ 24:35:10
వరకు తదుపరి వజ్ర
కరణం: బవ 06:46:31 వరకు
వర్జ్యం: 08:20:50 - 09:49:58
దుర్ముహూర్తం: 16:16:02 - 17:00:25
రాహు కాలం: 16:21:35 - 17:44:49
గుళిక కాలం: 14:58:21 - 16:21:35
యమ గండం: 12:11:52 - 13:35:07
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:33
అమృత కాలం: 17:15:38 - 18:44:46
సూర్యోదయం: 06:38:56
సూర్యాస్తమయం: 17:44:49
చంద్రోదయం: 10:38:46
చంద్రాస్తమయం: 22:17:36
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: మతంగ యోగం - అశ్వ
లాభం 26:55:05 వరకు తదుపరి
రాక్షస యోగం - మిత్ర కలహం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 473 / Bhagavad-Gita - 473 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -04 🌴*
*04. సన్నియమ్యేన్ద్రియగ్రామాం సర్వత్ర సమబుద్ధయ: |*
*తే ప్రాప్నువన్తి మామేవ సర్వభూతహితే రతా: ||*
*🌷. తాత్పర్యం : సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వల యెడ సమభావము కలిగి పూర్ణముగా ఉపాసించు సర్వభూతహితులైనవారు సైతము అంత్యమున నన్ను పొందుదురు.*
*🌷. భాష్యము : జీవహృదయస్థుడైన పరమాత్మను గాంచుటకై దర్శనము, శ్రవణము, ఆస్వాదనము, కర్మముల వంటి ఇంద్రియపరకర్మల నుండి మనుజుడు విరమింపవలెను. ఆ సమయముననే పరమాత్ముడు సర్వత్రా కలడనెడు అవగాహనకు అతడు రాగలడు. ఈ సత్యదర్శనము పిమ్మట అతడు ఏ జీవిని ద్వేషింపడు. అట్టి భావనలో అతడు బాహ్యతొడుగును గాక ఆత్మను వీక్షించుచుండుటచే మానవునికి, జంతువునకు నడుమ భేదమును గాంచడు. కాని ఇట్టి నిరాకారానుభవ విధానము సామాన్యునకు అత్యంత కఠినమైనది.*
🌹🌹🌹🌹🌹
*🌹 Bhagavad-Gita as It is - 473 🌹*
*✍️ Sri Prabhupada, *📚 Prasad Bharadwaj
*🌴 Chapter 12 - Devotional Service - 04 🌴*
*04. sanniyamyendriya-grāmaṁ sarvatra sama-buddhayaḥ*
*te prāpnuvanti mām eva sarva-bhūta-hite ratāḥ*
*🌷 Translation : The impersonal conception of the Absolute Truth – by controlling the various senses and being equally disposed to everyone, such persons, engaged in the welfare of all, at last achieve Me.*
*🌹 Purport : It is inferred that one has to approach Lord Kṛṣṇa, otherwise there is no perfect realization. Often there is much penance involved before one fully surrenders unto Him. In order to perceive the Supersoul within the individual soul, one has to cease the sensual activities of seeing, hearing, tasting, working, etc. Then one comes to understand that the Supreme Soul is present everywhere. Realizing this, one envies no living entity – he sees no difference between man and animal because he sees soul only, not the outer covering. But for the common man, this method of impersonal realization is very difficult.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 828 / Sri Siva Maha Purana - 828 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 27 🌴*
*🌻. శంఖచూడుని జననము - 3 🌻*
*దేవతలిట్లు పలికిరి - ఓ దేవదేవా! కారణమేమి పుట్టినదో తెలియకున్నది. మేమందరము ఈ బ్రహ్మాండములో తాపమును పొందుచున్నాము. దీనికి కారణమగు తేజస్సు ఏది? చెప్పుము (18). ఓ దీనబంధూ! తాపపీడితమైన మనస్సుగల నీ అనుచరులను నీవు రక్షించెదవు. ఓ రమానాథా! శరణ్యుడవగు నీవు శరణు పొందిన మమ్ములను రక్షింపుము, రక్షింపుము (19).*
*సనత్కుమారుడిట్లు పలికెను- బ్రహ్మాది దేవతల ఈ మాటలను విని శరణాగతవత్సలుడగు విష్ణువు ప్రేమతో నవ్వి ఇట్లు పలికెను (20).*
*విష్ణువు ఇట్లు పలికెను- ఓ దేవతలారా! ఆందోళనను విడనాడి పూర్ణస్వస్థతను పొందుడు. భయపడకుడు. జలప్రళయము రాబోవుట లేదు. ఇది ప్రళయసమయము కాదు (21). నా భక్తుడగు దంభుడనే దానవుడు పుత్రుని గోరి తపస్సును చేయుచున్నాడు. ఆతనికి వరమునిచ్చి ఆ తేజస్సును నేను చల్లార్చ గలను (22).*
*సనత్కుమారుడిట్లు పలికెను - ఓ మునీ! విష్ణువు ఇట్లు పలుకగా బ్రహ్మాది దేవతలందరు ధైర్యమును స్వస్థతను పొంది అన్ని వైపులలో గల తమ తమ స్థానములకు వెళ్లిరి (23). అచ్యుతుడు కూడా దంభుడనే దానవుడు తపస్సు చేయుచున్న పుష్కరమునకు వరమునిచ్చుట కొరకై వెళ్లెను (24).*
*విష్ణువు అచటకు వెళ్లి తన మంత్రమును జపించుచున్న ఆ భక్తుని మధురమగు వచనములతో ఉత్సాహపరిచి 'వరమును కోరుకొనుము' అని పలికెను (25). ఆతడు తన యెదుట నిలబడియున్న విష్ణువును గాంచి ఆయన పలుకులను విని మహాభక్తితో ప్రణమిల్లి పలుమార్లు స్తుతించెను (26).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 828 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 27 🌴*
*🌻 The birth of Śaṅkhacūḍa - 3 🌻*
The gods said'.—
18. “O lord of gods we do not know how this happened to cause this. Please tell us. By what refulgence have all of us been scorched?
19. O friend of the distressed, you are the protector of the distressed and dispirited servants. Save, O lord of Lakṣrnī who are worthy of being sought refuge by us.
Sanatkumāra said:—
20. On hearing these words of Brahmā and other gods, Viṣṇu who is favourably disposed to those who seek refuge, said laughingly and lovingly.
Viṣṇu said:—
21. “O gods, be calm and unperturbed, do not be afraid. No deluge will take place, this is not the time of dissolution.
22. The Asura Dambha a devotee of mine is performing a penance seeking for a son. I shall bestow a boon and quieten him.”
Sanatkumāra said:—
23. O sage, on being consoled thus, Brahmā and other gods became encouraged and they returned to their respective abodes.
24. In order to grant the boon, Viṣṇu went to Puṣkara where Dambha was performing penance.
25. On reaching there Viṣṇu consoled Dambha who was repeating his name and told him the pleasing words—“Mention the boon you wish to be granted.”
26. On hearing his words and seeing Viṣṇu standing in front, the Danava bowed with great devotion and eulogised him again and again.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 86 / Osho Daily Meditations - 86 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 86. నిర్ణయాలు 🍀*
*🕉. ఈ క్షణానికి ప్రతిస్పందించండి. బాధ్యత అంటే అదే. ఎవరో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు అవుననాలా కాదనాలా అని అయోమయంలో ఉన్నారు, కాబట్టి మీరు ఐ చింగ్ దగ్గరకి వెడతారు. 🕉*
*ఇది మీ జీవితం--మీ కోసం నిర్ణయించుకోవడానికి ఐదు వేల సంవత్సరాల క్రితం ఒక పుస్తకాన్ని వ్రాసిన వ్యక్తికి ఎందుకు వదిలివేయాలి? మీ స్వంతంగా నిర్ణయించు కోవడం మంచిది. మీరు పొరపాటు చేసి, దారి తప్పినప్పటికీ, మీ స్వంతంగా నిర్ణయించుకోవడం మంచిది. లేక మీరు తప్పుదారి పట్టనప్పటికీ మరియు ఐ చింగ్ ద్వారా మీరు మరింత విజయవంతమైన జీవితాన్ని గడిపినప్పటికీ, ఇది మంచిది కాదు, ఎందుకంటే మీరు బాధ్యత నుండి తప్పించు కుంటున్నారు. బాధ్యత ద్వారా ఎదుగుతారు.*
*బాధ్యత మీ చేతుల్లోకి తీసుకోండి. కొంతమంది దేవుడికి, మరికొందరు కర్మకు, మరికొందరు విధికి, మరికొందరు ఐ చింగ్‌కు బాధ్యతలు అప్పగిస్తారు. ఇవి తప్పించుకునే మార్గాలు. అయితే పూర్తి బాధ్యతను మన భుజస్కందాలపై వేసుకున్నప్పుడు మనం ఆధ్యాత్మికులం అవుతాము. బాధ్యత విపరీతమైనది, మరియు మీ భుజాలు బలహీనంగా ఉన్నాయి, నాకు తెలుసు. కానీ మీరు బాధ్యతను స్వీకరించినప్పుడు, అవి బలపడతాయి. అవి ఎదగడానికి, బలపడడానికి వేరే మార్గం లేదు.*
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 86 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 86. DECISIONS 🍀*
*🕉. Respond to this moment. That's what responsibility is. Someone would like to marry you. Now you are puzzled as to whether to say yes or no, So you go to the I Ching. 🕉*
*It is your life--why leave it for someone who has written a book five thousand years ago to decide for you? It is better to decide on your own. Even if you err and go astray, it is still better to decide on your own. And even if you don't go astray and you have a more successful life through the I Ching, it is still not good, because you are avoiding responsibility. Through responsibility, one grows.*
*Take responsibility into your hands. These are ways of avoiding. Some people give responsibility to God, others to karma, others to destiny, others to the I Ching. But we become spiritual when we take the whole responsibility on our own shoulders. The responsibility is tremendous, and your shoulders are weak, that I know. But when you take on the responsibility, they will become stronger. There is no other way for them to grow and become stronger.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 512 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 512 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా ।*
*దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥ 🍀*
*🌻 512. 'దధ్యన్నాసక్త హృదయా' - 2🌻*
*పెరుగన్నము తుది అంశముగ భోజనము ముగించుట ఆరోగ్యకరము. ఇతర అంశములను బాగుగ భుజించి పెరుగన్నము క్లుప్తము చేయుదురు. ఇది సరికాదు. రెండు వంతులు యితర భోజనము గావించి ఒక వంతు పెరుగన్నమునకు యేర్పరచుకొనవలెను. పులిసిన పెరుగు, మజ్జిగ వర్ణనీయము. దైవోపాసకులు ఈ విషయమును గ్రహింపవలెను. దేహమునందు ప్రాణము అస్తవ్యస్తమై యుండగ పూజయందు మనసు నిలబడదు. దేహము తగుమాత్రము ఆరోగ్యముగ వుండుట ప్రధానము. ఈ పద్మమందుగల యోగినీ మాతకు దధ్యాన్నము నైవేద్యము పెట్టుట వలన తృప్తి చెందునని చెప్పుటలో పై విషయమును గ్రహింప గలరు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 512 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻105. Medhonishta maduprita bandinyadi samanvita*
*dadyannasakta hrudaya kakini rupadharini ॥ 105 ॥ 🌻*
*🌻 512. 'Dadhyannasakta Hrudaya' - 2🌻*
*It is healthy to end the meal with curdrice. People take other items heavily and take very little curdrice. This is incorrect. Two-third should be other items and one-third should be reserved for curdrice. Fermented curd, buttermilk are describable. Devotees should understand this. If the life in the body is disordered then the mind cannot focus on worship. It is important to keep the body fit and healthy. It is to be observed that the Yogini Mata in this lotus flower is satisfied by an offering of curdrice.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
No comments:
Post a Comment