శ్రీమద్భగవద్గీత - 465: 11వ అధ్., శ్లో 51 / Bhagavad-Gita - 465: Chap. 11, Ver. 51

 

🌹. శ్రీమద్భగవద్గీత - 465 / Bhagavad-Gita - 465 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 51 🌴


51. అర్జున ఉవాచ

దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్ధన |
ఇదానీమస్మి సంవృత్త: సచేతా: ప్రకృతిం గత: ||



🌷. తాత్పర్యం : ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్యరూపమును గాంచినంత ఇట్లు పలికెను: ఓ జనార్ధనా! అత్యంత సుందరమైన ఈ నీ మానవరూపమును గాంచి శాంతచిత్తుడవై నా సహజస్వభావమును పొందితివి.

🌷. భాష్యము : దేవదేవుడైన శ్రీకృష్ణుడు సహజముగా ద్విభుజుడని ఈ శ్లోకమునందలి “మానుషం రూపం” అను పదము స్పష్టముగా తెలుపుచున్నది. శ్రీకృష్ణుడు సామాన్యమానవుడే యనెడి భావనలో ఆ దేవదేవుని అపహాస్యము చేయువారు అతని దివ్యస్వభావమును ఎరుగనివారని ఇచ్చట నిరూపించబడినది. శ్రీకృష్ణుడు సాధారణ మానవుడే యైనచో తొలుత విశ్వరూపమును, ఆ పిదప చతుర్భుజనారాయణ రూపమును చూపుట అతనికెట్లు సాధ్యమగును?

కనుక శ్రీకృష్ణుని సామాన్యమావవునిగా భావించుచు, నిరాకరబ్రహ్మమే శ్రీకృష్ణునిలో నుండి పలుకుచున్నదని వ్యాఖ్యానించుచు పాఠకుని తప్పుద్రోవ పట్టించువారు నిక్కము జనులకు గొప్ప అన్యాయము చేసిన వారగుదురు. ఈ విషయమే భగవద్గీత యందు ఇచ్చట స్పష్టముగా తెలుప బడినది. శ్రీకృష్ణుడు వాస్తవముగా విశ్వరూపమును మరియు చతుర్భుజనారాయణ రూపమును ప్రదర్శించినపుడు సామాన్యమానవుడెట్లు కాగలడు? శుద్ధభక్తుడైనవాడు సత్యదర్శియైనందున అట్టి తప్పుద్రోవ పట్టించు గీతావ్యాఖ్యానములచే కలతను పొందడు. భగవద్గీత యందలి మూలశ్లోకములు సూర్యుని భాతి సుస్పష్టములు. మూర్ఖవ్యాఖ్యాతల దీపపు వెలుగు వాటికి ఏమాత్రము అవసరము లేదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 465 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 51 🌴


51. arjuna uvāca

dṛṣṭvedaṁ mānuṣaṁ rūpaṁ tava saumyaṁ janārdana
idānīm asmi saṁvṛttaḥ sa-cetāḥ prakṛtiṁ gataḥ



🌷 Translation : When Arjuna thus saw Kṛṣṇa in His original form, he said: O Janārdana, seeing this humanlike form, so very beautiful, I am now composed in mind, and I am restored to my original nature.

🌹 Purport : Here the words mānuṣaṁ rūpam clearly indicate the Supreme Personality of Godhead to be originally two-handed. Those who deride Kṛṣṇa as if He were an ordinary person are shown here to be ignorant of His divine nature. If Kṛṣṇa is like an ordinary human being, then how is it possible for Him to show the universal form and again to show the four-handed Nārāyaṇa form? So it is very clearly stated in Bhagavad-gītā that one who thinks that Kṛṣṇa is an ordinary person and who misguides the reader by claiming that it is the impersonal Brahman within Kṛṣṇa speaking is doing the greatest injustice.

Kṛṣṇa has actually shown His universal form and His four-handed Viṣṇu form. So how can He be an ordinary human being? A pure devotee is not confused by misguiding commentaries on Bhagavad-gītā because he knows what is what. The original verses of Bhagavad-gītā are as clear as the sun; they do not require lamplight from foolish commentators.

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment